హైదరాబాద్

మహిళలే మహారాణులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 25: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రెండు పాలక మండలి ఎన్నికల్లో మహిళలదే పై చేయి కానుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు యాభై శాతం సీట్లను రిజర్వు చేస్తూ జరుగుతున్న ఈ ఎన్నికల్లో మహిళలే ఎక్కువ మంది కార్పొరేటర్లుగా గెలిచి అధికారంలోకి రానున్నారు.
కొత్త కౌన్సిల్‌లో పురుషుల కన్నా వీరి సంఖ్యే ఎక్కువగా ఉండే అవకాశముంది. చాలా చోట్ల బరిలో ఉన్న బిసి, ఎస్సీ,ఎస్టీ మహిళల్లో ఇప్పటి వరకు ఒకటి, రెండు పర్యాయాలు ఎన్నికల్లో గెలిచి కార్పొరేటర్లుగా కొనసాగిన వారే ఉండగా, మరికొన్ని చోట్ల వివిధ పార్టీలకు చెందిన సమర్థులైన నాయకుల సతీమణులు పోటీలో ఉన్నారు. ఉదాహరణకు తార్నాక నుంచి బండకార్తీకరెడ్డి, అహ్మద్‌నగర్ నుంచి విద్యావేత్త అయేషా రుబీనా వంటి వారు బరిలో ఉన్నారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో సగాని కన్నా ఎక్కువ మంది మహిళలు గెలిచే అవకాశాలున్నాయి. మహిళ జనరల్ క్యాటగిరికీ 44 సీట్లు కేటాయించగా, ఎస్సీ మహిళా 5, ఎస్టీ మహిళ 1, మహిళ జనరల్ 25తో కలిపి మొత్తం 75 సీట్లను కేటాయించారు. 75 సీట్లలో వివిధ సామాజికవర్గాలకు చెందిన మహిళా కార్పొరేటర్లు వచ్చే అవకాశముండగా, అన్ రిజర్వు సీట్లలో కూడా పోటీ చేస్తున్న కొందరు మహిళలు గెలిచే అవకాశాలుండటంతో త్వరలో అధికారంలోకి రానున్న పాలక మండలిలో మహిళల సంఖ్య పురుషుల కంటే ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. ఇక మేయర్ సీటును బిసి జనరల్‌కు కేటాయించిన నేపథ్యంలో టిఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావు కుమార్తె విజయలక్ష్మి గద్వాల్ పేరు విన్పిస్తున్న సంగతి తెలిసిందే. ఒక వేళ ఆమెకు మేయర్ సీటు కేటాయిస్తే డిప్యూటీ మేయర్ పీఠాన్ని బిసియేతర సామాజికవర్గానికి చెందిన పురుషులకు కేటాయించాలన్న సమీకరణపై అధికార పార్టీ సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే టిఆర్‌ఎస్, మజ్లిస్ పార్టీలు అవగాహనకు రావటంతో మేయర్, డిప్యూటీ మేయర్ సీట్లను కైవసం చేసుకునేందుకు వ్యూహాన్ని సిద్ధం చేశారు. ఈ రెండింటిలో ఒకటి బిసి పురుషులకు కేటాయిస్తే, మరో సీటును బిసితో పాటు ఇతర సామాజికవర్గాలకు చెందిన మహిళలకు కేటాయించాలని పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం.
డివిజన్ల రిజర్వేషన్లలో అనుసరించి ఫిఫ్టీ ఫిఫ్టీ రిజర్వేషన్ సూత్రాన్ని మేయర్, డిప్యూటీ మేయర్ సీట్ల కేటాయింపులోనూ అమలు చేయాలని పార్టీలు భావిస్తున్నట్లు సమాచారం. గతంలో 2009 నుంచి 2007 వరకు అధికారంలో కొనసాగిన గ్రేటర్ మొట్టమొదటి పాలక మండలిలో తొలి రెండేళ్ల పాటు జనరల్ క్యాటగిరి కింద బండ కార్తీకచంద్రారెడ్డికి మేయర్ పీఠం దక్కగా, ఆ తర్వాత పదవిని చేపట్టిన వారిలో బిసి, ఎస్సీ వర్గానికి చెందిన కార్పొరేటర్లున్నారు. కానీ ఈ సారి ఈ రెండు పదవుల అయిదేళ్ల కాలంతో పాటు సీట్లను సైతం మహిళలు, పురుషులకు సమానంగా వర్తింపజేయాలన్న సంకల్పంలో పార్టీలున్నట్లు తెలిసింది.