జాతీయ వార్తలు

మోదీ సర్కార్‌పై నమ్మకం పోయింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మ కం పోయిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో విశ్వాస సంక్షోభం నెలకొందని పేర్కొన్న ఆయన ప్రజా సంక్షేమం కోసమే తా ను పనిచేస్తున్నానన్న నమ్మకాన్ని ప్రతి పౌరుడిలో కలిగించాల్సిన బా ధ్యత మోదీపై ఉంద్నారు. గోవధ, మత కలహాల వంటి సునిశిత అంశాలపై మోదీ మాట్లాడక పోవడాన్ని మన్మోహన్ తప్పుబట్టారు. ఇవన్నీ కూడా ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా చేశాయన్నారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరించడం ప్రభుత్వాధినేతగా ప్రధాని బాధ్యత అని పేర్కొన్న మన్మోహన్..కీలక విషయాల్లో మోదీని వౌనమే సమాధానంగా మారిందని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
కాగా, మోదీపై మన్మోహన్ చేసిన విమర్శలను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తిరస్కరించారు. జనధన్, ముద్ర సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను తమ ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు.