అంతర్జాతీయం

మైనారిటీ ఓటర్లకు హిల్లరీ, శాండర్స్ గాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఫిబ్రవరి 12: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం నువ్వా, నేనా అన్నట్లుగా పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్స్‌లు ఇప్పుడు లాటినో, ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అంతేకాదు డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటు చేసిన ఒక చర్చాగోష్ఠిలో ఈ ఇద్దరూ జాతి వివక్ష, ఇమిగ్రేషన్‌కు సంబంధించి తమ రికార్డులు లాంటి అంశాలపై పరస్పరం వాదించుకున్నారు.
గత మంగళవారం న్యూహాంప్‌షైర్ ప్రైమరీ ఎన్నికల్లో శాండర్స్ చేతిలో దారుణంగా ఓడిపోయిన తర్వాత తిరిగి పట్టుసాధించడానికి ప్రయత్నిస్తున్న హిల్లరీ క్లింటన్ ఈ సమస్యల విషయంలో తానెంతో వాస్తవ దృక్పథంతో కూడిన ప్రగతి శీల భావాలు కలిగిన వ్యక్తినని చెప్పుకోవడానికి ప్రయత్నించారు. అంతేకాదు గతంలో విదేశాంగ మంత్రిగా తనకున్న అనుభవాన్ని కూడా ఆ చర్చలో ఆమె పదే పదే ప్రస్తావించారు. ఈ ఇద్దరి మధ్య పోటీ మైనారిటీ జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న నెవాడా, సౌత్ కరోలినా రాష్ట్రాలకు మారిన నేపథ్యంలో ఈ చర్చ జరిగింది.
‘అమెరికాలోని ఆఫ్రికన్లు ఉద్యోగ మార్కెట్ విద్య, హౌసింగ్, క్రిమినల్ జస్టిస్ విధానం తదితర రంగాల్లో వివక్షను ఎదుర్కొంటున్నారు. ఎంతో కష్టించి పని చేసే వలస జాతుల వారు భయంతో జీవిస్తున్నారు. వారు, వారి పిల్లలు మెరుగైన భవిష్యత్తులో జీవించేలా చూడడం కోసం వారిని ఆ భయంనుంచి బైటికి తేవాల్సిన అవసరం ఉంది. మహిళా కార్మికులకు వారి హక్కయిన సమాన వేతనం లభించేలా చూడాలి’ అని హిల్లరీ క్లింటన్ అన్నారు. పిబిఎస్ చానల్ న్యూస్‌అవర్‌లో ప్రత్యక్ష ప్రసారమైన ఈ చర్చా గోష్ఠిలో హిల్లరీ క్లింటన్ మైనారిటీ ఓటర్లలో ఎంతో పలుకుబడి కలిగిన అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తనకున్న సంబంధాలను సైతం పదే పదే ప్రస్తావించారు.
ఈ చర్చాగోష్ఠిలో ఇమిగ్రేషన్ సంస్కరణలు కూడా ప్రధానాంశం అయింది. అమెరికాలోకి అక్రమంగా వలస వచ్చిన దాదాపు కోటీ 10 లక్షల మందికి పౌరసత్వం కల్పించడానికి ఒక మార్గాన్ని కనుగొనాల్సిన అవసరముందని ఇరువురు అభ్యర్థులు అభిప్రాయ పడ్డమే కాకుండా ఇటీవల ఒబామా ప్రభుత్వం అమెరికాలోకి ఇతర దేశాలనుంచి వలసలను ప్రోత్సహించడాన్ని సైతం ఖండించారు. 2007లో ఇమిగ్రేషన్ సంస్కరణల బిల్లుకు వ్యతిరేకంగా శాండర్స్ ఓటు వేశారని హిల్లరి ఆరోపిస్తే, బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని శాండర్స్ గట్టిగా సమర్థించుకోవడమే కాకుండా పౌర హక్కుల సంఘాలు, ఇమిగ్రేషన్ గ్రూపులు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయని చెప్పుకొన్నారు. అధికార పార్టీ సెనేటర్ అయిన శాండర్స్ అధ్యక్షుడు ఒబామాను విమర్శించడాన్ని హిల్లరీ క్లింటన్ తప్పుబట్టగా, ఒబామా అంటే తనకెంతో గౌరవమని, అయితే ఒక సెనేటర్‌గా అధ్యక్షుడి ఆలోచనతో విభేదించే హక్కు తనకు ఉందని శాండర్స్ అన్నారు.