రాష్ట్రీయం

ముగిసిన వెంకటేశ్వర వైభవోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ముషీరాబాద్, ఫిబ్రవరి 12: తిరుమల తిరుపతి దేవస్థానం,తిరుపతి హిందూ ధర్మ ప్రచార పరిషత్తు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు శుక్రవారంతో ముగిసాయి. చివరిరోజు కార్యక్రమంలో భాగంగా ‘పుష్పయాగా‘న్ని వైభవంగా నిర్వహించారు. చివరిరోజు కావటంతో శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తులు శుక్రవారం ఉదయం నుంచే బారులు తీరారు. ఈ ఒక్క రోజునే దాదాపు 60 వేల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు అంచనా. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకూ 5లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన టిటిడి జెఇవో భాస్కర్ తిరుమలలో సామాన్య భక్తులకు సాధ్యంకాని స్వామి వారి పలు సేవలు, కైంకర్యాలను ఇక్కడ భక్తులకు నేరుగా అందుబాటులోకి తెచ్చామన్నారు. శ్రీవెంకటేశ్వర వైభవోత్సవాలను నెల్లూరులో ప్రారంభించి తర్వాత డిల్లీలో, ఇప్పుడు ఉమ్మడి రాజధానిలో నిర్వహించినట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి రెండు నెలలకోసారి దేశంలోని ముఖ్య పట్టణాలలో వీటిని నిర్వహిస్తామన్నారు. శ్రీవారి దివ్య దర్శనం ప్రతి భక్తుడికి గొప్ప అనుభూతిని కల్గిస్తుందని బిజెపి నేత లక్ష్మణ్ అన్నారు.