ప్రకాశం

మున్సిపల్ ఓటర్ల సవరణ జాబితాపై ప్రభుత్వం దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,్ఫబ్రవరి 14: రాష్ట్ర ఎన్నికల సంఘం ఒంగోలు నగరంలోని మున్సిపల్ ఓటర్ల జాబితా సవరణపై దృష్టిసారించిన నేపధ్యంలో త్వరలో ఎన్నికలకు శ్రీకారం చుడతారన్న ప్రచారం ప్రధాన రాజకీయపక్షాల్లో జోరుగా సాగుతుంది. ఏప్రిల్ 11న ఓటర్ల జాబితాను ముద్రించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కలెక్టర్‌ను ఆదేశించిన నేపధ్యంలో జిల్లాయంత్రాంగం ఓటర్ల జాబితా సవరణలో ఇక నుండి మునిగి తేలనుంది. ఈ నేపధ్యంలో ఓటర్ల జాబితా సవరణలపై ప్రధాన రాజకీయపక్షాల నేతలు ఇప్పటి నుండే దృష్టిసారించే అవకాశాలున్నాయి. ఓటర్ల సవరణ జాబితా ప్రక్రియ పూర్తిఅయిన వెంటనే ఒంగోలు నగర కార్పొరేషన్‌కు తొలిసారిగా ఎన్నికలు త్వరలోనే జరిగే అవకాశాలుండటంతో ప్రధానరాజకీయపక్షాలకు సవాల్‌గా మారనున్నాయి. తొలిసారిగా ఏర్పడే పాలకవర్గానికి ఎస్‌సి మహిళా మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. రిజర్వేషన్ల ప్రక్రియ ప్రకారం ఒంగోలు నగరమేయర్ ఎస్‌సి మహిళా కేటగిరికి వచ్చినట్లు సమాచారం. దీంతో ఎస్‌సి మహిళల కోసం ప్రధానరాజకీయపక్షాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఈపాటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరుపున జిల్లా వైకాపా మహిళా అధ్యక్షురాలు గంగాడ సుజాత పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలుగుదేశంపార్టీ పక్షాన పేరు వెల్లడికావాల్సి ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీతో బిజెపి మిత్రపక్షంగా వ్యవహరిస్తుండటంతో కొన్ని కార్పొరేటర్లను ఆ పార్టీకి తెలుగుదేశంపార్టీ అప్పగించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కాగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ తరపున మేయర్ అభ్యర్థిని, పూర్తిస్థాయిలో కార్పొరేటర్లను రంగంలోకి దించుతుందో లేదో వేచిచూడాల్సి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఘోరపరాజయంపాలైన సంగతి విధితమే. అప్పటి నుండి జిల్లాలోనే కాకుండా ఒంగోలు నగరంలోను కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందనే చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీల మధ్యనే ప్రధానమైన పోటీ నెలకొననుంది. కాగా ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ నగరాభివృద్ధి ప్రత్యేక దృష్టిసారించారు. గతంలో సమస్యకాని డంపింగ్ యార్డు సమస్యను తీర్చి నగరాన్ని సుందరంగా తీర్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల కార్పొరేషన్ పరిధిలోని పనులను సైతం తన అనుంగ శిష్యులకు ఇప్పించటంలోనూ సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. గుండ్లకమ్మ నుండి తాగునీటిని నగరప్రజలకు తీసుకువచ్చే విషయంలోను దామచర్ల ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నగరంలోని 50డివిజన్లల్లోను పార్టీకి సంబంధించి కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ కమిటీలకు ఎప్పటికప్పుడు దామచర్ల దిశనిర్దేశం చేయటం జరుగుతుంది. రాష్ట్ర ఎన్నికలసంఘం ఎన్నికల షెడ్యూలు తేదీలను ప్రకటిస్తే రాష్ట్రంలోని మంత్రులు, పార్లమెంటుసభ్యులు, శాసనసభ్యులందరు ఇక్కడే తిష్టవేసే అవకాశాలు కూడా లేకపోలేదు. దీంతో ఒక్కొక్క డివిజన్‌కు ఒక్కొక్క మంత్రి లేదా ఎంపిలు, శాసనసభ్యులను నియమించే అవకాశం ఉంది. తొలిసారిగా జరిగే నగర ఎన్నికలను దామచర్ల ప్రతిష్టాత్మాకంగా తీసుకోవటంతో అభివృద్ధి కూడా పరుగులు పెడుతుంది. దీనికితోడు దామచర్లకు తెలుగుదేశంపార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు, జిల్లాశాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కూడా ఒంగోలు నగరంలోని ప్రజలతోసన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ముఖ్యంగా మాగుంట రాఘవరెడ్డి ఛారిటబుల్ ట్రస్టు తరపున ప్రతిరోజు వందలాదిమందికి మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీటిని ఉచితంగా సరఫరా చేయటం జరుగుతుంది. లోతట్టుప్రాంతాలకు చెందిన ప్రజలకు నిత్యం ట్యాంకర్లద్వారా నీటిని సరఫరా చేస్తుండటంతో ఆప్రాంతాల్లో మాగుంట కుటుంబం పట్ల సానుభూతి ఉందనే చెప్పవచ్చు. మొత్తంమీద ఎన్నికలు జరిగితే తమపార్టీ అభ్యర్థుల గెలుపు నల్లేరుమీద నడకేనన్న ధీమాలో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం.
ఇదిఇలాఉండగా తొలిసారిగే నగర కార్పొరేషన్ ఎన్నికల్లో తమపార్టీ జెండాను ఎగురవేయాలనే తలంపుతో ఒంగోలు మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీఎన్నికల్లో పరాజయం పాలైన తరువాత బాలినేని తన మకాంను హైదరాబాదుకు మార్చటం జరిగింది. దీంతో ఒంగోలు నియోజకవర్గంలోని నాయకులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమైన పనుల నిమిత్తం మాత్రమే బాలినేని ఒంగోలుకు వచ్చి వెళ్తున్నారు. కాగా నగర ఎన్నికల షెడ్యూలువిడుదల చేసిన తరువాత బాలినేని ఒంగోలు నగరంలో పూర్తిస్ధాయిలో తిష్టవేస్తే ఎలా అని ముందుగానే నగరంలోని అన్ని డివిజన్లల్లో పర్యటించాలి కదా అని కొంతమంది వైకాపా నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.కాగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి మాత్రం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై దృష్టిసారిస్తునే ఉన్నారు. ముఖ్యంగా వైకాపానాయకులు,కార్యకర్తలకు ఆరోగ్యబాగా లేకపోయినా వారిని ఆసుపత్రుల వద్దకు వెళ్ళి పరామర్శించటంపై ఆయనకు పార్టీలోని నాయకులు పెద్దఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి హోదాలో సుబ్బారెడ్డి ఉండి కూడాతమ ఆరోగ్యక్షేమ సమాచారాలను తెలుసుకుంటున్నారన్న సంతోషంలో వైకాపా నేతలు ఉంటున్నారు. ఈవిషయాలు వైవికి పెద్దప్లస్‌పాయింట్‌గా చెప్పుకోవచ్చు. ఒంగోలు నగరానికి ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే సుబ్బారెడ్డి, బాలినేని సంయుక్తంగా రంగ ప్రవేశం చేస్తేనే పార్టీ మనుగడ సాధ్యవౌతుందని ఆ పార్టీకి చెందిన నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. మొత్తంమీద నగర కార్పోరేషన్‌కు తొలిసారిగా జరిగే ఎన్నికలు ప్రధానరాజకీయపక్షాలైన తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీల నేతలకు అగ్నిపరీక్షగా మారనున్నాయి.

మార్కెట్ కమిటీల నియామకానికి
కాలయాపన ఎందుకో..?
* తెలుగు తమ్ముళ్ల ఆవేదన
మార్కాపురం, ఫిబ్రవరి 14: మార్కెట్ కమిటీల నియామకంలో తెలుగుదేశంపార్టీ అధిష్ఠానం ఎందుకు కాలయాపన చేస్తుందో అర్థం కావడం లేదని తెలుగుతమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలోనికి వచ్చి 20 నెలలు పూరె్తైనా కమిటీల నియామకానికి అధిష్ఠానం దృష్టి సారించకపోవడం అన్యాయమని టిడిపి కార్యకర్తలు అంటున్నారు. మార్కాపురం డివిజన్‌లోని గిద్దలూరు, యర్రగొండపాలెం, పొదిలి, స్వయాన రాష్టమ్రంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మంత్రి శిద్దా రాఘవరావు నియోజకవర్గంలోని దర్శి మార్కెట్‌యార్డుల నియామకంలో జాప్యం జరుగుతున్నప్పటికీ స్థానిక నేతలు కూడా పట్టించుకోవడం లేదని ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి మార్కెట్‌యార్డు అధ్యక్ష పదవికి నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి శ్రావణి వెంకటేశ్వర్లు పేరు ప్రతిపాదించగా పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం కోసం కష్టపడిన గుడిపూడి భాస్కర్ ఈ పదవిని ఆశిస్తూ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చాడు. ఈ విషయం ఢిల్లీలో ఉన్న కంభంపాటి రామ్మోహన్‌రావు దృష్టికి కూడా తీసుకువెళ్లారు. గిద్దలూరు మార్కెట్‌యార్డు అధ్యక్ష పదవి కోసం పలు సామాజికవర్గాలకు చెందిన నేతలు పోటీ పడటంతో ఎవరికి ఇస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందోనన్న భయంతో టిడిపి ఇన్‌ఛార్జి ఎవరిపేరును ప్రతిపాదించకపోవడం విశేషం. మంత్రి నియోజకవర్గ పరిధిలోని దర్శి మార్కెట్‌యార్డుకు కూడా మంత్రి శిద్దా సామాజిక వర్గాలకు న్యాయం చేయకపోతే ఇబ్బంది వస్తుందని భావించి పేరును ప్రతిపాదించడంలో వెనుకడుగు వేస్తున్నట్లు సమాచారం. యర్రగొండపాలెం నియోజకవర్గంలో అజితరావు ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో పలువురి పేర్లను పరిగణలోనికి తీసుకొని ఒకరి పేరు ప్రతిపాదించాలనుకునే సమయంలో ఆమెను ఇన్‌ఛార్జిగా తొలగించడం, ఆ స్థానంలో త్రిసభ్య కమిటీని వేయడం, అనంతరం త్రిసభ్య కమిటీ నలుగురికి లేఖ ఇవ్వడం, దీనితో వైశ్య సామాజికవర్గానికి చెందిన గోళ్ల సుబ్బారావు ఈ లేఖను అడ్డుపెట్టుకొని కమిటీ ఏర్పాటుకు ప్రయత్నించడం, చివరి సమయంలో ఆ విషయం బయటపడటంతో ఆశావాహుల్లో కొందరు వ్యవసాయశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి అడ్డుకున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో అధిష్ఠానానికి స్థానిక నేతలు పూర్తిస్థాయి ప్రతిపాదనలు పంపకపోవడం, ఒకటి రెండుచోట్ల పంపినప్పటికీ కొన్ని ఆరోపణలు రావడంతో అధిష్ఠానం నిర్ణయం తీసుకోలేదని పలువురు టిడిపి నేతలు అంటున్నారు. ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే నియామకాలను భర్తీ చేసి ఉంటే మరో రెండేళ్లు మరికొందరికి అవకాశం లభించి ఉండేదని, పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉండి అధికారంలోనికి వచ్చినా ఫలితం లేకపోవడంతో పార్టీ తీరుపై నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నేను టిడిపికి చెందినవాడినే!
తనను సస్పెండ్ చేసే అధికారం ఎవరికిలేదు
నూకసాని సీటు విషయంలో చట్టబద్ధంగానే వ్యవహరించా
జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర వెల్లడి
ఒంగోలు,్ఫబ్రవరి 14: తాను తెలుగుదేశంపార్టీకి చెందినవాడినేనని జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు వెల్లడించారు. ఆదివారం తన క్యాంపుకార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను తెలుగుదేశంపార్టీకి చెందినవాడినేనని తనను తెలుగుదేశంపార్టీ నుండి సస్పెండ్ చేసే అధికారం ఏవరికి లేదన్నారు. తెలుగుదేశంపార్టీ నుండి మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా అన్న పాత్రికేయులు అన్న ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. ఇటీవల జరిగిన జిల్లాపరిషత్ సర్వసభ్యసమావేశంలో జిల్లా వైస్ చైర్మన్ నూకసాని బాలాజి సీటు విషయంలో తాను చట్టబద్ధంగానే మాట్లాడినట్లు తెలిపారు. జిల్లా,మండల పరిషత్ సమావేశాల్లో సీటింగ్ ఏర్పాటు ప్రభుత్వం జారీచేసిన సూచనలకు కొనసాగింపుగా సాధ్యమైనచోట పార్టీలవారీగా సీటింగ్ ఏర్పాటుచేయాలని ప్రభుత్వం ఆదేశించిందని ఆ ప్రకారమే సీట్లను సమావేశంలో ఏర్పాటుచేసినట్లు చెప్పారు. అయితే జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ నూకసాని ముందువరసలో కూర్చోవటంలో తాను ఆవిధంగా మాట్లాడాల్సివచ్చిందని అయితే నూకసాని తనకు వ్యక్తిగత కక్షలేదన్నారు. తాను జిల్లాపరిషత్ చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తరువాత కారుఖర్చు అయితేనేం ఇతరత్రఖర్చులు బాగా తగ్గించుకోవటం జరిగిందని ఆయన వివరిస్తూ నూకసాని బాలాజి చైర్మన్‌గా ఉన్న సమయంలోను అదేవిధంగాను తాను బాధ్యతలు తీసుకున్న తరువాత ఉన్న ఖర్చు వత్యాస్యాన్ని కూడా ఆయన వివరించారు. అదేవిధంగా అప్పట్లో ఉన్న జడ్‌పి సిఇఒ ప్రసాదు హయాంలోను ప్రస్తుతం తన హాయంలోపనిచేస్తున్న సిఇఒ బాపిరెడ్డి హాయంలో ఏమేరకు ఖర్చుపెట్టిందన్న వత్యాసాలను కూడా పాత్రికేయులకు వివరించారు. తాను నీతినిజాయితీగా పనిచేస్తూ అధికారులు అదేవిధంగా పనిచేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అభివృద్ధి లక్ష్యాలను సాధించాలి
- ఎంపి మాల్యాద్రి
పంగులూరు, ఫిబ్రవరి 14: రామకూరు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి జరుగుతుందని బాపట్ల ఎంపి శ్రీరాం మాల్యాద్రి అన్నారు. రామకూరు గ్రామాన్ని ఎంపి దత్తత తీసుకున్న నేపధ్యంలో ఆదివారం గ్రామంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఒంగోలు ఆర్డీఒ కె శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపి మాట్లాడుతూ గత సమీక్షా సమావేశంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా ముందుకు సాగాలన్నారు. అందుకు ప్రజాసహకారం కూడా అవసరమన్నారు. గ్రామంలో నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసి సంపూర్ణ పారిశుధ్య గ్రామంగా తీర్చిదిద్దాలని ఎంపి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రికార్డులకు, ఆర్‌డబ్ల్యూఎస్, ఎన్‌ఆర్‌ఇజిఎస్ అధికారులు మరుగుదొడ్ల నిర్మాణాల్లో చెప్తున్న అంకెలు పొంతన లేకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. అధికారులు కచ్చితమైన సమాచారం అందించకుంటే గ్రామాభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఆర్డీఒ కలుగజేసుకుని మార్చి నాటికి నూరుశాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలను చైతన్యం చేయాలన్నారు. రామకూరు, వలపర్ల రహదారి అధ్వాన్నంగా ఉందని, చాలా కాలంగా ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారని మాజీ సర్పంచ్ మానం సుబ్బారావు, హరిబాబు ఎంపి దృష్టికి తెచ్చారు. ఆర్‌అండ్‌బి అధికారులు ఎక్కడ అని అడిగిన ఎంపి ఆ శాఖ అధికారులు గైర్హాజరు కావడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయం ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించి సమస్యను పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో అంతర్గత రహదారుల అభివృద్ధికి సమగ్ర నివేదికనివ్వాలని పంచాయతీ రాజ్ అధికారులకు అదేశించారు. గ్రామంలో 70 అంతర్గత రహదారులున్నాయని, వాటికి సైడు కాలువలతో సహా నిర్మాణానికి రూ.5.75కోట్ల ఖర్చుతో అంచనాలు తయారు చేసినట్లు అధికారులు ఎంపికి నివేదిక ప్రతిని అందించారు. గ్రామంలో నిర్మించిన ఆరోగ్య ఉప కేంద్రం ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా వెంటనే కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు ఆరోగ్య సేవలందించాలని డాక్టర్ ప్రమోద్‌కు సూచించారు. గ్రామంలో ఎస్సీ, బిసిలకు నివేశన స్థలాలు కావాలని సర్పంచి త్రివేణి, ఎంపిటిసిలు రామయ్య ఎంపిని కోరారు. త్వరలో సమస్య పరిష్కరించాలని ఆర్డీఓ, స్థానిక తహశీల్దార్ నిర్మలను ఆదేశించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎంపిడిఒ శ్యాంప్రసాద్ ఎంపికి నివేదిక సమర్పించారు. సమావేశంలో అద్దంకి నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జి కరణం వెంకటేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు.