మీ వ్యూస్

మళ్లీ సోషియో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్లీ సోషియో ఫాంటసీ వ్యాసం బాగుంది. మనవాళ్లు మంచి కథలు రాయలేరని, మెగా ఫ్యామిలీతోపాటు చాలామంది అభిప్రాయం ఏర్పరచుకుని, రీమేక్‌ల వైపే పరుగులు పెడుతున్నారు. కారణాలు అడక్కు, చూపించేదే చూడు అన్న ధోరణిలో ఫాంటసీలను వండి వార్చేయవచ్చు. ఫాంటసీలు ఏమాత్రం ప్రేక్షకులకు నచ్చకపోతే తిరగ్గొడతారు. మనవాళ్లు ఉత్తమెతక కాబట్టి, దేవతల్ని జోకర్లుగా చూపించినా భరిస్తున్నారు. ఈమధ్య ప్రజల ధోరణి మారింది. దేవతల్ని అపహాస్యం చేస్తే కేసులు పెట్టి రచ్చ చేస్తున్నారు. అందువల్ల ప్రజలకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా సోషియో ఫాంటసీని రూపొందించాలి.
-పిఎస్ లక్ష్మి, బృందావనం

తెలుగు పాట
తెలుగు పాటకు ప్రపంచ ప్రఖ్యాతి ఉంది. గొప్పవాళ్లైన ఎందరో రచయితలు, సంగీత దర్శకులు, గాయనీ గాయకులు పాటను ఓ తపస్సుగా భావించి ప్రాణం పోశారు. అవి కలకాలం పాటల ప్రేమికులకు గుర్తున్నాయి. తెలుగు పాట అజరామమైతే, ఇప్పుడు రీమిక్స్ పేరిట ఆ పాటలను ఖూనీ చేస్తున్నారు. కీచు గొంతుకలు, వాద్యాల ఘోష, ఏమాత్రం భావప్రకటనలేని విధంగా ఆ పాటలను రూపొందించి, ప్రేక్షకులపై వదులుతున్నారు. పిచ్చిపిచ్చి డాన్సులతో, చూడలేని విధంగా హావభావాలను ప్రకటిస్తూ ఆ పాట అంటేనే జుగుప్స కలిగేలా చేస్తున్నారు. ఆనాటి పాటల మాధుర్యం లాలిత్యం, తాదాత్మ్యత ఒక్క శాతం కూడా లేకపోగా వెటకారంతో వాటి విలువలను దిగజారుస్తున్నారు. నక్కకు నాగలోకానికి ఉన్న తేడా రీమిక్స్ పాటలకు ఉంటోంది. దానివల్ల మంచి పాటలు వృధా అవుతున్నాయి.
-సి ప్రతాప్, శ్రీకాకుళం

సోగ్గాడే..
వయస్సు మీదపడుతున్నా మన్మధుడిలా చెలరేగిపోతున్నాడు నాగార్జున. సంక్రాంతి బరిలో దిగిన సోగ్గాడు హాయిగా, హ్యాపీగా కుటుంబమంతా కలసి చూడ దగినదిగా వుంది. బంగార్రాజు పాత్రలో నాగార్జున ఆసాంతం ఆకట్టుకున్నాడు. ఆమాయక రాము పాత్రలో ఇమిడిపోయాడు. ఇక రమ్యకృష్ణ గురించి చెప్పుకోవాలంటే చాలా వుంది. ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే గుణం ఆమె సొంతం. దర్శకుడు కొత్తవాడైనా తన శైలిలో అందర్నీ ఆకట్టుకున్నాడు. కాసింత శృంగారం, కూసింత హాస్యం, మరింత మాయాలోకం, మాటల మంత్రాలు, పాటల పరవశాలు అన్నీ వెండితెరపై పండించాడు. పచ్చని పాడిపంటలు, సంక్రాంతి ముగ్గులు, అందాల ముద్దుగుమ్మలు, ఆట పాటలు పసందుగా చూపాడు.
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్

దేశభక్తి
26 వెనె్నల్లో దేశభక్తి వ్యాసం ఆకట్టుకుంది. తెలుగు సినిమాల్లో దేశభక్తి అంశం లేదని రాశారు. కానీ తర్వాత కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. కాశ్మీర్ టెర్రరిజం నేపధ్యంలో రోజా, ఖడ్గం, వేదం లాంటి చిత్రాలు కూడా వచ్చాయి. నాగార్జున నటించిన గగనం మంచి సినిమా. తమిళం నుండి తెలుగులోకి డబ్ చేసిన మదరాసు పట్టణం, ఒక ప్రేమకథ లాంటివి కూడా దేశభక్తి ఉన్న చిత్రాలే.
- తాడల పరమహంస, విజయనగరం

అవసరమా?
కృతి, ఇమ్రాన్‌లు గంటసేపు లిప్‌లాక్ ప్రాక్టీస్ చేయడం సరికాదు. రిహార్సల్స్ పేరిట కొంటె పనులకు, తరువాత వివాదాలకు తెరతీయడం అవుతుంది. ఇంత చేసినా ఆ సీన్ సెన్సార్‌వారు కత్తిరించవచ్చు. లేదా బాగా తగ్గించొచ్చు. ఆ సన్నివేశాలు ఎక్కువ చూపిస్తే ప్రేక్షకులు ప్రేరేపించబడి అఘాయిత్యాలు చేస్తారన్న నమ్మకం వారికుంటుంది. అలా తగ్గించే సీన్లకోసం ఇంత రిహార్సల్స్ అవసరమా?
- కె.సుధీర్, శ్రీనగరం

మరణం లేదు
ప్రేమకు మరణం లేదు. దానికి ఎల్లలు లేవు. కులమతాలు అసలే లేవు అంటూ ప్రారంభమైన ‘సీతాకోక చిలుక’ చిత్రం గురించి చక్కగా చెప్పారు. దేవాంతకుడు, ముత్యాలముగ్గు, యమగోల తదితర సోషియో ఫాంటసీ చిత్రాలను ప్రస్తావిస్తూ సాగిన మళ్లీ.. సోషియోఫాంటసీ అర్థమైన విశే్లషణతో సాగింది. ఆదిత్య 369 చిత్రానికి సీక్వెల్‌గా బాలకృష్ణ వందో చిత్రం వస్తుందన్న ప్రకటన ఆనందాన్నిచ్చింది. సోగ్గాడే చిన్నినాయనా అచ్చమైన సంక్రాంతి చిత్రంగా పేరుతెచ్చుకుని కలక్షన్లు రాబట్టడాన్ని ట్రేడ్‌టాక్ ద్వారా తెలుసుకున్నాం. అక్కినేనిపై వచ్చిన అమూల్య వ్యాసం ఆలోచింపజేసింది.
- అల్లాడి వేణుగోపాల్, బారకాసు

ప్రమాద ఘంటికలు
టాలీవుడ్‌లో తక్కువే గానీ సాధారణంగా శృంగార తారామణులు హాలీవుడ్, బాలీవుడ్‌లలో క్లీవేజ్ ప్రదర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు.
అలా కనిపిస్తే రశికులకు కనువిందే. టాలీవుడ్‌లో పద్ధతిగా కనిపించే కాజల్ ముంబాయి ఓ ఫిలిమ్ ఫంక్షన్‌లో కెమెరాముందు ఛాతీ అటూ ఇటూ తిప్పుతూ క్లీవేజ్ ప్రదర్శించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. మరో హిందీ చిత్రంలో కూడా బికినీలో కనిపించనున్నదట. కెరీర్ కొడిగట్టే సమయంలో ప్రమాద ఘంటికలు వినిపించడంవల్ల కాబోలు కాజల్ శృంగార తారల లైన్లో నిలబడవలసి వచ్చింది.
- పి.శాండిల్య, కాకినాడ

వంకాయల
జనవరి 26 వెనె్నల్లో సెకండ్‌షో సుదీర్ఘ వ్యాసం నిన్నటి కథానాయికల గురించి తెలిపింది. వచ్చిన వాళ్లకు లేదనకుండా, అడిగిన వాళ్లకు కాదనకుండా తెలుగు పరిశ్రమ అవకాశాలు ఇస్తూనే వున్న వైనాన్ని గ్రహించాం. బాక్సింగ్, రైడింగ్, బాడీబిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్ లాంటి వాటిల్లో ప్రావీణ్యం గడించిన వ్యక్తి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్‌లో ఆల్‌రౌండర్, మారధాన్న్న్రర్, క్వాలిఫైడ్ అకౌంటెంట్ ఇలా ఎన్నో విశిష్టతలను కలిగిన అరుదైన సినీ నటుడు వంకాయల సత్యనారాయణమూర్తి గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు.
- ఎ.వి.గోపాల్, నెల్లూరు