Others

మిస్సైన మిస్సమ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానటి సావిత్రికి దేవదాసు చిత్రం తరువాత అంతటి స్టార్‌డమ్ తెచ్చిన చిత్రం -మిస్సమ్మ. అయితే, ఈ చిత్రాల వెనుక పెద్ద కథే ప్రచారంలో ఉండేది. ముఖ్యంగా, మిస్సమ్మ చిత్రానికి కథానాయికగా మొదట భానుమతిని తీసుకున్నారు. దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ అప్పటికే భానుమతితో గృహప్రవేశంలాంటి చిత్రాల్లో నటించారు. అలా భానుమతి అయితే మిస్సమ్మ పాత్రకు న్యాయం చేయగలదని ఆయన భావించార్ట. ఎన్టీఆర్ కథానాయకుడిగా, రమణారెడ్డి, రేలంగిలాంటి నటులతో అప్పటికే దాదాపు నాలుగైదు రీళ్ల చిత్రం కూడా పూర్తి చేశారు. ఇక సినిమా మొత్తం భానుమతి పాత్రే ఉంటుందని, సినిమా తప్పక విజయవంతమవుతుందని యూనిట్ భావిస్తున్న సమయంలో చిన్న పొరపొచ్ఛం వచ్చింది. ఓ రోజు నటి భానుమతి షూటింగ్‌కు ఆలస్యంగా వచ్చార్ట. ఆలస్యానికి కారణాన్ని అడిగాడు దర్శకుడు. ఓ వ్రతం వుండటంవల్ల అది పూర్తిచేసుకుని రావడానికి ఆలస్యమైందని గంభీరమైన స్వరంతో భానుమతి జవాబిచ్చారు. ఆరోజు షూటింగ్ సజావుగా జరగలేదు. దర్శకుడు ఎల్‌వి ప్రసాద్‌కు కోపం వచ్చింది. షూటింగ్‌కు పాకప్ చెప్పారని ఓ కథనం.
మరో కథనమేమిటంటే, మిస్సమ్మ చిత్రంలో కథానాయిక మిస్సమ్మది క్రిస్టియన్ మతానికి చెందిన పాత్ర. ఆమెపై లీల ఆలపించిన ‘కరుణించు మేరి మాత.. శరణంటి మేరి మాత’ పాట కూడా షూటింగ్ చేయాల్సి వుంది. అయితే ఆ సమయంలో నటి భానుమతి -బొట్టులేని పాత్రలో నటించేది లేదని చెప్పడంతో, ఆమెను కాదని జమున పాత్ర పోషించిన స్థానంలోవున్న సావిత్రికి ప్రమోషన్ ఇచ్చి మిస్సమ్మను చేశారు దర్శకులు. చెల్లెలి పాత్రకు జమునను తీసుకున్నారని మరో కథనం వినిపించేది పాండీబజార్‌లో. ఏదేమైనా సినిమా సూపర్‌హిట్ అవ్వడం అందరికీ సంతోషాన్నిచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో కథానాయకుడిగా ఎన్టీఆర్ నటిస్తే, తమిళంలో జెమినీ గణేశన్ నటించారు. రెండు వెర్షన్లూ ప్రజాదరణ పొందాయి. ఈ విషయంపై ఓసారి భానుమతిని కొందరు పాత్రికేయులు అడిగారు, మీకు మిస్సమ్మ పాత్ర మిస్సయ్యింది కదా అని. అందుకు ధీర గంభీర వదనంతో భానుమతి -నేను మిస్సైనా, ఓ మంచి నటి మిస్‌కాకుండా పరిశ్రమకు పరిచయమైంది కదా అని జవాబిచ్చారట. అది ఆమె గొప్పతనం. అలా భానుమతి చేయాల్సిన పాత్రను సావిత్రి నటించి మెప్పించారు. ఇక్కడున్న మూడు ఫొటోలు మొదట్లో మిస్సమ్మ షూటింగ్ జరిగినపుడు తీసినవే. డేవిడ్ (రమణారెడ్డి)ను కోప్పడే సమయంలో మిస్సమ్మ ఒక ఫొటోలో కన్పిస్తూంటే, మరో ఫొటోలో పార్క్‌లో దేవయ్య (రేలంగి) భిక్షాటన చేసే సన్నివేశం కాగా, మరొకటి షాట్‌కు ప్రిపేరవుతూ దర్శకుడు చెబుతున్న సన్నివేశాన్ని ఆసక్తిగా వింటున్న భానుమతి కన్పిస్తున్నారు. నాలుగో ఫొటోలో కెమెరామెన్ మార్కస్ బార్‌ట్లే సావిత్రిని ఎంపిక చేశాక టచప్ చూస్తున్నారు. ఇదీ మిస్సైన మిస్సమ్మ కథ. ఆసక్తికరంగా వుంది కదూ!

-తిలక్