ఉత్తరాయణం

ముస్లింలలో చైతన్యం రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మజ్లిస్ ముస్లింలకు ప్రాతినిధ్యం వహిస్తుందా? ప్రశ్నార్థకమే. బీఫ్ తినాలంటే మజ్లిస్‌కే ఓటు వేయాలంటూ చేసిన ప్రచారం విడ్డూరంగా ఉన్నదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మజ్లిస్ ఆవిధంగా ప్రచారం చేయడం విడ్డూరం మాత్రమే కాదు అవివేకం కూడా. తాగునీరు, విద్యుత్ సమస్య మొదలైన జీవనానికి సంబంధించిన నినాదాలుండాలి కాని, ‘బీఫ్’ ఆఫర్ ఏమిటి?
నిజానికి మజ్లిస్ నాయకుల నినాదం మతోన్మాదంతో కూడినట్టిది. అధికారంలోకి రావడంకోసం మతోన్మాదానే్న ప్రధాన ఆయుధంగా ఎంచుకుంటారు మజ్లిస్ నాయకులు. ముస్లిం సమాజంలో ముఖ్యంగా యువతరాన్ని మతం మత్తులో ముంచి ఆ సమాజం ఎదగకుండా ఉంచడం వల్లనే వీళ్లు పబ్బం గడుపుకోగలుగుతున్నారు. పాతబస్తీలో ఓటెవరికి వేస్తారని అడిగితే ఇంకెవరికి? మజ్లిస్‌కే..అంటారు అక్కడి జనం. అంటే ముస్లింల సమస్యలు లేవనెత్తగలిగే పార్టీ మజ్లిస్ పార్టీ అనే కదా అర్థం. అంటే ఎల్లకాలం ముస్లిం సమాజం మతం మత్తులో ఉండాలని మజ్లిస్ ఉద్దేశంగా కనిపిస్తున్నది. సెక్యులరిస్టు, సోషలిస్టుల భావజాలానికి, వీరి ఆలోచనలు ఎంతమాత్రం సరిపడవు. ఎవరైనా అటువంటి వారు పోటీకి నిలబడితే వారి సంగతి అంతే! ఇలాంటి తిరోగమన ఆలోచనలతో ఉన్న ప్రజల్లో ముఖ్యంగా యువతరంలో మార్పు రావాలి. ఆధునిక యుగంలో మతానికి చాలా తక్కువ విలువ మాత్రమే ఉన్నదని, సంఘంలో వినూత్న, ప్రగతికాముక ఆలోచనలకు ప్రాధాన్యం అత్యధికమన్న చైతన్యం ప్రజల్లో కలిగిననాడు మజ్లిస్ బండారం బట్టబయలవుతుంది.
మైనారిటీలకున్న రాయితీల సహాయంతో మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు స్థాపించి, వాటిల్లో ఎంతమంది ముస్లింలకు సీట్లిస్తారో అందరికీ తెలిసిందే. నిజాం నిర్మించిన భవనాలన్నింటిని కైవసం చేసుకుని, అవన్నీ మజ్లిస్ ఆస్తులుగా ప్రచారం చేసుకోవడం అందరికీ తెలిసిందే. అంతేకాదు పాతబస్తీలో ప్రజలను మతం మత్తులో కొనసాగించినంత కాలం తామే అధికారంలోకి వస్తామన్న ధీమా మజ్లిస్ నాయకత్వంలో వ్యక్తమవుతుండటం గమనార్హం. మజ్లిస్ పూర్వీకులు మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన వారే. అందుకే సెటిలర్ అన్నవాళ్లని ప్రాసిక్యూట్ చేయాలని వాదిస్తుంటారు. నిజానికి తెలంగాణ ప్రజలు ఎవరినీ వెళ్లిపొమ్మనలేదు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే, వారితో దోస్తీ చేసి తమ పబ్బం గడుపుకునే మజ్లిస్ పార్టీ ముస్లిం సమాజానికి అభివృద్ధికి ఏమాత్రం దోహదం చేయదు. ముస్లింలకు కాస్తోకూస్తో ఎవరైనా మేలు చేశారా అంటే కేవలం కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుతం అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌లు మాత్రమే. ఆ పార్టీలు తమకు మేలు చేస్తాయని ముస్లిం ప్రజలు విశ్వసించాలి. ఇస్లాం మనుషుల వికాసానికి ఉపయోగపడాలి కాని, మతోన్మాదానికి దారితీయరాదు. అసలు ఇస్లాం సూత్రాలకు భిన్నంగా మజ్లిస్ ప్రవర్తిస్తున్నది. అందుకే ముస్లిం ప్రజలు, యువత, అసలు నిజాన్ని తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే ముస్లింలు బాగుపడతారు.
- ఎస్.బి. అలి, హైదరాబాద్
పిచ్చి కుక్కల బెడదను నివారించండి
తెలుగు రాష్ట్రాల్లో పిచ్చి కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించాలి. పెంపుడు కుక్కలు మినహా వీధుల్లో తిరిగే పిచ్చి కుక్కలను జనావాస ప్రదేశాలనుంచి తొలగించాలి. వివిధ పురపాలక సంస్థల నిర్లక్ష్యం వల్లనే పిచ్చికుక్కల బెడద అధికంగా ఉంటోంది. కర్నూలు పట్టణంలో ప్రజలను బెంబేలెత్తిస్తూ, భయానక వాతావరణం సృష్టిస్తున్న పిచ్చికుక్కలను పురపాలక సంస్థ ఏరివేయాలి.
-డి. చాంద్ పాష, కర్నూలు
జిహాదీ మారణకాండ
అనేక పేర్లతో పిలువబడే జిహాదీ ఉగ్రవాదం ఇంచుమించు ప్రతిరోజూ ప్రపంచంలో ఏదో ఒక మూల పడగవిప్పి మానవ మారణకాండకు పాల్పడుతోంది. అవిశ్వాసులు, విగ్రహారాధకులు, మత భ్రష్టులు వంటి పేర్లతో ఇతర మతస్థులను, సాటి మహమ్మదీయులను, జిహాదీలు హతమారుస్తున్నారు. తాము అనుసరించే విద్యుక్త ధర్మాలకు అదనంగా జిహాద్ అంటే పవిత్ర యుద్ధం పేరుతో ఉగ్రవాదులు మారణకాండను కొనసాగిస్తున్నారు. ఇది ఇస్లాం బోధనలకు విరుద్ధం. జిహాదీ పేరుతో ఇతరుల వాక్‌స్వాతంత్య్రాన్ని, మత స్వాతంత్య్రాన్ని హరించే హక్కు ఏ ఉగ్రవాదికీ లేదు. ప్రపంచలోని ప్రతి పౌరుడికి తనకు నచ్చిన మతాన్ని అనుసరించే హక్కు ఉన్నది.
- వి. వెంకట్రామయ్య, శిద్ధాంతం, ప.గో. జిల్లా
అసహనం పెరుగుతుంది
ఇటీవలి కాలంలో ప్రతివారూ ప్రజలలో అసహనం పెరిగిపోతున్నదని తమకు తోచినట్లు వ్యాఖ్యానించడం పరిపాటయింది. అయితే ప్రజల్లో అసహనం కలగడానికి పత్రికలలోను ఇతరత్రాప్రసార మాధ్యమాలలోని కొన్ని విషయాలు దోహదం చేస్తున్నాయని చెప్పకతప్పదు. మచ్చుకు ఆ మధ్య పత్రికల్లో పద్మ పురస్కారారపై విశే్లషణ గమనిస్తే ప్రజల్లో అ