తెలంగాణ

మేడారం జాతరకు 4 వేల బస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 15: తెలంగాణలో జరిగే అతి పెద్ద ఆదివాసీ జాతర ‘మేడారం సమ్మక్క, సారలమ్మల జాతరకు’ వెళ్లే భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) విస్తత్ర ఏర్పాట్లు చేసింది. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే మేడారం జాతరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఇందుకు అనుగుణంగా హైదరాబాద్, వరంగల్, తదితర ప్రాంతాల నుంచి ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసి బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం తిరిగే సర్వీసులకు అదనంగా నాలుగు వేల సర్వీసులను నడుపుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఎంజిబిఎస్, జెబిఎస్, కాచిగూడ, పాత సిబిఎస్ గౌలిగూడ బస్ స్టేషన్ల నుంచి ఈ ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు జరిగాయి. మేడారం జాతర సందర్భంగా సమకూర్చే ఏర్పాట్ల కోసం సుమారు రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే మేడారం చేరుకునే భక్తుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో అవసరాన్ని బట్టి బస్సులు పెంచుతూ నడుపుతున్నారు. మేడారం జాతర ప్రాంతానికి సమీపంలో కూడా బస్సులు నిలిపేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఆర్డినరీ సర్వీసులతో పాటు ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ బస్సులను ప్రతి సారి నడుపుతున్న ఆర్టీసి ఈసారి ఏసి బస్సులను కూడా నడుపుతోంది. ఆ మేరకు ప్రయాణీకుల డిమాండ్ ఉండడంతో ఎసి బస్సులను నడిపేందుకు నిర్ణయించారు. బస్సులు నడపడంతో పాటు వాటి నిర్వహణకు సంబంధించి సమన్వయం కోసం ఆర్టీసి అధికారులు విస్తత్ర ఏర్పాట్లు చేశారు. పికప్ పాయింట్‌ల నుంచి గమ్యస్ధానం వరకు వెళ్లే బస్సుల వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించడంతో పాటు సమయానికి వాటిని పంపే విధంగా సమన్వయం చేసేందుకు సిబ్బందిని పెద్ద ఎత్తున నియమించారు. ఇప్పుడు పని చేస్తున్న వారితో పాటు రిటైర్డు సిబ్బంది కలిపి 10 వేల మందికిపైగా వారి సేవలను వినియోగించుకుంటున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలతో పాటు మైకుల ద్వారా బస్సుల సమాచారాన్ని తెలియజేసేందుకు ప్రత్యేక కౌంటర్లను, సహాయ కేంద్రాలను అన్ని ప్రధాన బస్‌స్టేషన్ల వద్ద ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచే కాకుండా తెలంగాణలోని అన్ని జిల్లాల కేంద్రాల నుంచి ప్రత్యేక బస్సులను ఆర్టీసి నడుపుతోంది. ఇదిలావుంటే రైల్వే శాఖ సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను వరంగల్ స్టేషన్ వరకు, వరంగల్ నుంచి సికింద్రాబాద్ వరకు ఈ నెల 17 నుంచి 20 వరకు నడుపుతున్నట్లు ప్రకటించింది. వరంగల్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణీకులను మేడారం వరకు చేరవేసేందుకు కూడా స్ధానికంగా ఆర్టీసి యంత్రాంగం బస్సులను నడుపుతోంది. మేడారం జాతరకు రవాణా ఏర్పాట్లను తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా ఆర్టీసి జెఎండి జి.వి.రమణారావు మేడారం సందర్శించి అక్కడ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేసి భక్తులకు రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. ఈడి స్థాయి అధికారులకు సమన్వయ బాధ్యతలను అప్పగించారు.