జాతీయ వార్తలు

మీ అభిప్రాయాలను ప్రజలపై రుద్దుతున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోపూర్ (అస్సాం), ఫిబ్రవరి 15: కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బిజెపితో పాటు దాని మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్)పై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలను పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్న సంఘ్ పరివార్ సంస్థలు తమ అభిప్రాయాలను బలవంతంగా రుద్దుతూ అందరినీ నియంత్రించాలని చూస్తున్నాయని, న్యూఢిల్లీలోని జెఎన్‌యులో కొద్ది రోజుల నుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తున్నాయని రాహుల్ నిప్పులు చెరిగారు. అసోంలోని సోనిత్‌పూర్ జిల్లాలో సోమవారం ఆయన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘దేశ సాంస్కృతిక వైవిధ్యం పట్లగానీ, ప్రజల మనోభావాల పట్లగానీ బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు ఏమాత్రం గౌరవం లేదు. అందరూ తమ అభిప్రాయల ప్రకారమే నడుచుకోవాలని సంఘ్ పరివార్ సంస్థలు కోరుకుంటున్నాయి. విశ్వవిద్యాలయాలతో పాటు ప్రతిచోటా వారికి ఉగ్రవాదమే కనిపిస్తోంది. వారి అభిప్రాయాలతో ఏకీభవించని వారిని ఉగ్రవాదులుగా ముద్ర వేస్తున్నారు. చాలా ఏళ్ల నుంచి దేశంలో హిందువులను, ముస్లింలను విభజించడమే పనిగా పెట్టుకున్న బిజెపి ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరిస్తోంది. 2014లో బిజెపి ఇదే విధానాన్ని అస్సాంలోనూ అవలంబించి బోడోలు, ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టింది’ అని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే తమ పార్టీ బిజెపి లాంటిది కాదని, సామరస్యత, సౌభ్రాతృత్వం, అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యత ఉండాలని ప్రగాఢంగా విశ్వసించే కాంగ్రెస్ పార్టీ అన్ని సంస్కృతులను గౌరవిస్తుందని ఆయన చెప్పారు.