రాష్ట్రీయం

మిర్చికి రికార్డు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 15: ఆసియా ఖండంలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనివిధంగా రైతులు భారీ ఎత్తున మిర్చిబస్తాలను తీసుకొచ్చారు. సోమవారం ఒక్కరోజే లక్షా 21వేల 254 బస్తాలను రైతులు యార్డుకు తరలించారు. మిర్చి ధర ఆశాజనకంగా ఉండటంతో కోల్డ్ స్టోరేజ్‌లలో నిల్వ ఉంచిన మిర్చిని రైతులు అమ్మకానికి పెద్దఎత్తున యార్డుకు తీసుకొచ్చారు. యార్డుకు తరలించిన బస్తాల్లో 97,012 బస్తాల అమ్మకాలు జరిగాయి సోమవారం క్వింటాకు రూ.15,800 రికార్డు స్థాయి ధర పలికింది. నాన్ ఎసి కామన్ వెరైటీ 341 రకం ఈ ధరకు అమ్మకాలు జరిగాయి. నెంబర్ 5 రకం 15,600 రూపాయలు, 334 రకం 15,500, 273 రకం 15వేల రూపాయల చొప్పున ధర పలికాయి.