జాతీయ వార్తలు

ముగిసిన సూరజ్‌కుండ్ హస్తకళల మేళా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: హర్యానాలో జరుగుతున్న అంతర్జాతీయ సూరజ్‌కుండ్ హస్తకళాల మేళా సోమవారం ముగిసింది. పదిహేను రోజులపాటు ఆకట్టుకున్న ఈ మేళాకు తెలంగాణ రాష్ట్రం థీమ్ స్టేట్‌గా ఉన్న సంగతి విదితమే. మేళా ముగింపు వేడుకలకు కడియం శ్రీహరి హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీహరి విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ పర్యటక, సాంస్కృతిక శాఖ ఈ మేళాను ఘనంగా నిర్వహించిందని, 500 మంది కళాకారులు ప్రతి రోజూ తెలంగాణ కళారూపాలను ఈ మేళాద్వారా ఉత్తర భారతంతోపాటు ప్రపంచానికి చాటి చెప్పారని ఆయన కొనియాడారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేలా తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కడియం చెప్పారు. ఇలాంటి మేళాను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం అవసరమని, దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్‌తో చర్చిస్తానని కడియం అన్నారు. ఈ మేళాలో ప్రకటించిన అవార్డులలో తెలంగాణకు ఎక్కువ రావడం పై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.