మాతో - మీరు

లోకాభిరామమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీసాల కృష్ణుని గురించి ‘లోకాభిరామమ్’లో గోపాలంగారు చెప్పిన విషయాలు భలే పసందుగా ఉన్నాయి. కృష్ణుడు మహాయోధుడు కనుక ఆ విధంగానే పటాలు ఉండాలన్న ప్రతాపరెడ్డిగారి యోచన, రామాచార్లుగారి సృష్టి నిజంగా అభినందనీయం. మీసాల కృష్ణుడనగానే ఆలయాల్లో మీసాలతో కనిపించే ఒకే ఒక్క దేవుడు అన్నవరం సత్యదేవుడే కనిపిస్తాడు. పౌరాణిక సినిమాలు చూస్తూ దేవతల కెందుకు మీసాలుండవన్న అంశంపై చిన్నప్పుడు జోకులు చెప్పుకునే వాళ్లం. ‘స్ఫూర్తి’ కథలో అగ్నిపర్వతం నోటితో మానవుని నోటిని పోల్చి చెప్పిన నీతి బాగుంది. అలాగే ‘ఓ ప్రశ్న, ఓ జవాబు’ అంటూ ఓ చిన్న మాటతో ఔరా! అనిపించారు. మాస్టార్లకు (వారిలో కొందరికే!) రచయితలకూ (వీరిలోనూ కొందరికే) చివరకు మిగిలేది అవే మరి!
-కె.లక్ష్మీప్రసన్న (పేర్రాజుపేట)
ఆలోచింపజేసింది
‘ఆయుః ప్రమాణం’ గురించి సర్వేశ్వర శర్మగారి వ్యాసం ఆలోచింపజేసింది. ఆ రోజుల్లో ముప్పై ఏళ్లకే వార్ధక్యం అంటే వింతగా అనిపించింది. కన్నబిడ్డలే వృద్ధ తల్లిదండ్రుల్ని వదిలేస్తున్నప్పుడు సాహచర్యం కోసం ఒంటరి వృద్ధులు మళ్లీ ప్రేమలో పడి పెళ్లి చేసుకోవడం మన వాళ్లకి మింగుడు పడని విషయమే అయినా అనివార్యం ఏమో?! వేరే దారిలేని విధంగా ఇరికించి నేరం చేయించి డబ్బు మొత్తం కొట్టేయాలని ప్లాన్ వేసిన వారన్‌కి ఎడ్డీ బుద్ధి చెప్పిన వైనం భలేగా ఉంది క్రైం కథలో. కోపాన్ని జయించి దేవుడైన శ్రీకృష్ణుని గురించి సన్నిధానం వారి వ్యాసం అలరించింది.
-ఆర్.శాంతిచంద్రిక (సామర్లకోట)
వినదగు
అవ్యక్తమైనది, భావనలకు అందనిది, భౌతిక విజ్ఞానం ద్వారా తెలుసుకోలేనిది, ఇంద్రియముల ద్వారా ఎంత ప్రయత్నంతోనైనా సాధించలేనిది అయిన ఆత్మస్వరూపం గురిచి గ్రాహ్యమైన విషయాలను తెలుసుకున్నాం. భగవద్గీత మూలంగా గీతాచార్యుడు చూపిన ధర్మపథం ద్వారా ఆత్మసాక్షాత్కారం సాధించుకోవడమే ఈ జన్మకు వున్న ఏకైక లక్ష్యం అన్న రచయిత వ్యాఖ్య అక్షర సత్యం. రణక్షేత్రం సీరియల్‌ను సూపర్ సస్పెన్స్‌తో నడుపుతూ నవరసాలు దట్టించిన ఒక తెలుగు సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలుగుతోంది. కవితలన్నీ మమ్మల్ని అలరించాయి.
-ఎం.కనకదుర్గ (తెనాలి)
సండే గీత
ఈ వారం ‘సండే గీత’లో ‘కథలని ప్రేమిద్దాం’ అంటూ మంచి కథల్ని చెప్పుకుందాం, మంచి కథల్ని విందాం అంటూ కథల ప్రత్యేకతలను గూర్చి చక్కగా వివరించారు. సిసింద్రీలో ‘విరుగుడు మంత్రం’ కథలో చక్కటి నీతిని ఉంది. ప్రపంచ శాస్తవ్రేత్తల్లో ఒకరైన భౌతిక శాస్తవ్రేత్త సి.వి.రామన్ గురించి ఎన్నో విషయాలను తెలియజేసినందుకు థాంక్స్. ‘నమ్మండి ఇది నిజం’లో భయంకర సహచరి గురించి చదివాం. నిజంగానే ఆశ్చర్యం వేసింది.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ, తూగో.జిల్లా)
సలహాలు అమోఘం
మీకు తెలుసాలో చాలా అరుదైన జాతికి చెందిన జంతువుల లక్షణాలు, వాటి అలవాట్లు వింతగా కనిపించాయి. జికా వైరస్ ముమ్మరం కాకుండా ముందు జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో, హెచ్చరికలతో కూడిన స్పెషల్ వ్యాసం చాలా బాగుంది. అంశాలు చాలా ఉపయుక్తం, అనుసరించదగినవి. ఆయుష్షు గురించి చక్కటి వివరణలు ఇచ్చిన నిపుణులు, ఎక్కువ కాలం బతకడానికి ఇచ్చిన సూచనలు అమోఘంగా ఉన్నాయి. కథకి వున్న ఆకర్షణను స్పష్టంగా తెలిపింది సండే గీత. దూర్వాస మహాముని పుట్టుపూర్వోత్తరాలు, అతని విపరీతమైన రౌద్రాకారానికి కారణం.. సన్నిధానం గారు చక్కగా వివరించారు.
-తాళాబత్తుల సత్యనారాయణ మూర్తి (మల్కాపురం)
అక్షరాలోచనాలు
ఈ వారం ‘అక్షరాలోచనాలు’లో కవితలన్నీ బాగున్నాయి. నిరంతర స్వాప్నికుడులో ‘సూర్యుడు నడినెత్తి మీద ఈడ్చి తన్నిన మొనగాడు’ అన్నప్పుడు కవిలోని ఆవేశం కనిపించింది. ఏది సొంతంలో వేదాంత భావనలు ఎక్కువ. అక్షరమే జయిస్తుందిలో ‘అక్షరాన్ని చంపగలవా? కవికి మరణముందంటే నమ్మగలవా’ అనడంలో కవుల యొక్క అజరామరత్వం నిరూపితమయింది. కవులకు ధన్యవాదాలు.
-శాంతమూర్తి (హైదరాబాద్)
జికా వైరస్
జికా - ఈ రెండక్షరాల పేరున్న వైరస్.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఆరు నెలల క్రితం బ్రెజిల్‌లో మొదలైన ఈ జికా వైరస్ వ్యాప్తి.. ఇప్పుడు ఏకంగా 25 దేశాలకు చేరటం చూస్తూంటే - ఒంట్లో భయం పుట్టుకొస్తోంది. మానవుడి తప్పిదాలకు ఎనె్నన్ని ఉపద్రవాలు ప్రపంచాన్ని ముంచెత్తుతున్నాయో చదువుతూంటే వణుకు పుడుతోంది. అలాగే ‘ఓ చిన్న మాట’లో ఓ ప్రశ్న, ఓ జవాబు చాలా బాగుంది. చక్కటి పిల్లలు, ఓ టేబుల్, ఓ కుర్చీ అన్నింటికంటే పాడుకోవడానికి పిల్లనగ్రోవి నిజంగా మనిషికి ఇంతకన్నా ఏం కావాలి?
-డి.వి.తులసి (రామవరప్పాడు)
ఆత్మసంభాషణ
ఈ కథ చదువుతూంటే చాన్నాళ్ల క్రితం జరిగిన ఓ సంఘటన గుర్తుకొచ్చింది. నాకు ఇలాంటి అనుభవం ఉంది. నిజంగా ఆత్మలు ఉన్నాయా? అంటే నమ్మలేదు గానీ.. ఆ సంఘటన తర్వాత ఒళ్ళంతా చెమటలు పట్టింది. మళ్లీ ఆ దారి జోలికి వెళ్లలేదు. చక్కటి కథని అందించినందుకు కృతజ్ఞతలు. కోపాన్ని జయించిన కృష్ణుడు వ్యాసం బాగుంది. కానీ ఆ జయించడమే చాలా కష్టం. సాధన చెయ్యాలి.
-గుండు రమణయ్య (పెద్దాపూర్)