మాతో - మీరు

అనుసరణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సండే గీత ‘అనుకూలం’ నేటి మేధావులనుకునే వారి నుంచి సామాన్యుల వరకు అనుసరణీయమైన ముఖ్య విషయాన్ని ప్రస్తావించారు. తనకు నచ్చని వృత్తి మార్పు వల్ల ఉత్పన్నమయిన కాలాన్ని వృథా కానీయక ‘లా’ పుస్తకాలను ఆంధ్ర, ఆంగ్ల భాషలలో రచించిన నిజామాబాద్ న్యాయమూర్తిగారు అభినందనీయులు. కారాగారంలో గడుపుతున్న నెహ్రూ తనకు చిక్కిన సమయాన్ని వృథా పోనీయక ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ ‘గ్లిమ్‌సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ రచన చేశారని చిన్నప్పుడు విన్న గుర్తు. ఖాళీ దొరికినప్పుడల్లా మనసుకు తట్టిన భావాలను ఓ డైరీలో రాసుకుంటే అవి వ్యాసాలు, పుస్తకాలు రాయడానికి ఉపయోగకరంగా ఉంటాయి. గాంధీ, సర్వేపల్లి లాంటి వారు గ్రంథాలు రాశారంటే దానికి కారణం కాలాన్ని సద్వినియోగ పరచుకోవడమే.
-ఎన్.రామలక్ష్మి (సికిందరాబాద్)
బాధ - సంతోషం
‘సండే గీత’లో అనుకూలం గూర్చి చక్కగా వివరించారు. ఏ పరిస్థితినైనా మనకు అనుకూలంగా మలచుకుంటే అప్పుడు బాధ కన్నా సంతోషం కలుగుతుందని చక్కగా తెలిపారు. ఓ చిన్న మాటలో ‘కొన్ని పరిస్థితులు’ అంటూ, పరిస్థితులను అధిగమించడానికి ధైర్యం కావాలి. మనోనిబ్బరం కావాలని చక్కగా పేర్కొన్నారు.
-పి.ఆదిత్యమూర్తి (గొల్లలమామిడాడ)
చిత్తశుద్ధి
జనక మహారాజు గద్దెనెక్కి పరిపాలించినా ఆయన ఒక ఋషి. నేడు సన్యాసులు గద్దె నెక్కడం, వ్యాపారం చేయడం చూసి ఎద్దేవా చేయనక్కర్లేదు. వారు చిత్తశుద్ధితో పని చేయడం ముఖ్యం. ప్రస్తుతం వారిపై అవినీతి ఆరోపణలేవీ లేవు కాబట్టి వారిని నిందించనక్కరలేదు. అలాగే మనకు ఇష్టం లేని పరిస్థితులు ఏర్పడినప్పుడు అనుకూలంగా మలచుకుంటే బాధ కన్నా ఎక్కువ సంతోషం కలుగుతుందన్న ‘సండే గీత’ ఉపయుక్తంగా ఉంది. మీసాలపై నిమ్మకాయలు పెట్టుకోవడం తెలుసు కాని ఎలుకలు నిలబెట్టి నిరసన వ్యక్తం చేయడం కొత్తగా ఉంది. అలాగే ఏనుగుల రోజు, 28 వేల పిల్లుల యజమాని అంశాలు ఆసక్తిని కలిగించాయి.
-పి.చంద్ర (కాకినాడ)
పరమాద్భుతం
ఒక గృహిణి హత్యకు గురయితే ఆమె శవం మాయమయింది. కాని ఆమె స్వయంగా ప్రభుత్వ లాయర్‌కి కనిపించి తను చనిపోలేదనీ, ఎవరూ హత్య చేయలేదని చెప్పినా ఎవరూ నమ్మలేదు. ఈలోగా నిందితుని ఉరి తీస్తారు. ఆ లాయర్ ఇప్పటికీ అపరాధ భావనతో హైడ్ పార్కులోని స్పీకర్స్ కార్నర్‌లో ఈ ఉదంతం గురించి రోజూ చెప్తూ ఉండటం పరమాద్భుతంగా ఉంది. నమ్మలేకపోతున్నాం. తన భార్యకు ఒక ప్రియుడున్నాడని తెలియగానే ఎవరైనా హత్యకు తెగబడతారు. కాని క్రైం కథలో భర్త నాగరికంగా సమస్యని పరిష్కరించడం మాకెంతో నచ్చింది. ప్రేమ కంటే ప్రాణాలే ముఖ్యమని నిరూపించాడు. మీకు మీరే డాక్టర్ శీర్షికలో ఆహారం గురించి అపోహలు తెలుసుకుంటున్నాం. ఈ శీర్షిక ఉపయుక్తంగా ఉంటోంది.
-కె.ప్రవీణ్ (తూ.గో.జిల్లా)
పరమ సత్యం
చెప్పడం సులువే. కాని అర్థం చేసుకొని పాటించడం చాలా కష్టం అంటూ ‘ఓ చిన్న మాట’గా చెప్పినది పరమ సత్యం. నిరుద్యోగ భృతి ఇచ్చినందుకు కొంత సమాజసేవ చేయాలనడం సమంజసమే. వృద్ధుల పెన్షన్లు సరే. కాని యువత ఏ పనీ చేయకుండా భృతి కావాలనడం సరికాదు. గవర్నర్ కోటాలో మేధావులు, రచయితలకు స్థానం కల్పిస్తే ఒరిగేది ఏమీ ఉండదు. అమర్త్యసేనులు కలబర్గిల విద్వేషం తెలిసిందే కదా. దిల్లీ యూనివర్సిటీ, హెచ్‌సియూ లను సోకాల్డ్ మేధావులు ఏ గతి పట్టించారో చూస్తున్నాం కదా. అక్షరాలోచనల్లో కవితలన్నీ బాగున్నాయి.
-కె.సాహిత్యదీప్తి (రమణయ్యపేట)
లోకాభిరామమ్
ఖయాలో మేఁ అంటూ అతని జ్ఞాపకాలు, ఆలోచనలు, నడకలు గురించి గొప్పగా చెప్పారు గోపాలంగారు. మోడు, పదిగేడుల గురించి చదువుతుంటే తూర్పు గోదావరిలో పాతకాలం వ్యాపారులు ఒకటి బదులు లాభం అని ఏడు బదులు ఆరున్నొక్కటి అని లెక్కించడం జ్ఞాపకం వచ్చింది. అనంత రోదసిలో అందాలే కాదు ఈ మధ్య శాస్తజ్ఞ్రుల జిజ్ఞాస పెరుగుతున్న కొద్దీ రోదసి అంతా గ్రహ శకలాల గోదాముగాను అనంత డస్ట్‌బిన్ గాను మారిపోయినట్టు అనిపిస్తోంది. శకల రోదసి కవర్‌స్టోరీ మాకు తెలీని ఎన్నో విషయాలను విశదీకరించింది. మీరు శాస్త్ర విషయాలకు ప్రాముఖ్యం ఇస్తూ ఉండటం ఎంతైనా శ్లాఘనీయం.
-సి.మైథిలి (సర్పవరం)
జానపదం
అలనాటి విదుషీమణులు శ్రీమతి సీత, అనసూయ గారల పాటలు ఆకాశవాణిలోనే కాక, ఒకసారి కావలిలో కూడా వారి పాటలు వినే అదృష్టం లభించింది. అలానే దేవులపల్లి వెంకట కృష్ణశాస్ర్తీ గారూ గుర్తుకు వచ్చారు. స్థానిక కళాశాల సాంస్కృతికోత్సవాలకు హాజరైన వారి చేతిలో చిన్న నోటు పుస్తకం, పెన్ను ఉన్నాయి. విరసం కవి కె.వి.రమణారెడ్డిగారు కనపడగానే ఆ పెన్నుతో పుస్తకంలో అభినందన జ్ఞాపకం రాసి రెడ్డిగారికి అందించారు. దేవులపల్లి వారికి అప్పటికే స్వరపేటిక లేదు. బొంబాయికి చెందిన డా.హీరానందాని ఆయన స్వరపేటికను తొలగించి దేవులపల్లికి ప్రాణం పోశారు. ‘నేను మూగవాడిని కాగానే మా ఆవిడ కొంత ఆనందించింది. ఇక నా అరుపులూ, తిట్లూ ఉండవు గదా’ అని అన్నారు. ఇలాంటి అనుభవాల నెన్నింటినో మా జ్ఞాపకాల్లోకి తెచ్చుకొనేలా చేస్తున్న ‘అమృతవర్షిణి’ మల్లాది గార్కి ధన్యవాదాలు.
-ఆచార్య నాగరాజరావు (కావలి)