తెలంగాణ
గాయని మధుప్రియకు భర్త వేధింపులు!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 13 March 2016
హైదరాబాద్, మార్చి 12: సింగర్ మధుప్రియ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను భర్త శ్రీకాంత్ కొంతకాలంగా వేధిస్తున్నాడంటూ హుమయూన్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు. ఆడపిల్లనమ్మా..అనే పాట ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కరీంనగర్‌కు చెందిన మధుప్రియ ఇటీవల తనను ప్రేమించిన శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లి కాదని, ప్రేమించిన వ్యక్తిని పెళ్లిచేసుకొని అభిమానులకు పెద్ద షాకిచ్చింది. కనీసం నాలుగు నెలలైనా గడవక ముందే భర్త వేధిస్తున్నాడంటూ మధుప్రియ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంపై అభిమానులు విస్తుపోతున్నారు.