రాష్ట్రీయం

గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్‌పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కరీంనగర్ కు చెందిన గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్‌పై శనివారం అర్ధరాత్రి దాడి జరిగింది. తన భార్య మధుప్రియను తీసుకొచ్చేందుకు అత్తగారింటికి వెళ్లినప్పుడు శ్రీకాంత్‌పై దాడి జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీకాంత్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నగరంలోని హుమాయున్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో తన భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నట్లు మధుప్రియ శనివారం ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
కాగా.. శ్రీకాంత్ యశోదా ఆసుపత్రి నుంచి చికిత్స మధ్యలోనే తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయాడని ఆసుపత్రి వర్గాల ద్వారా తెలిసింది.