అంతర్జాతీయం

మహాకాయుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అత్యంత స్థూల కాయుడు ఆండ్రియాస్
మెక్సికో, డిసెంబర్ 26: ప్రపంచంలోనే అత్యంత స్థూలకాయుడిగా గుర్తింపు పొందిన మెక్సికోకు చెందిన ఆండ్రియాస్ మోరెనోక్రిస్మస్ రోజున గుండెపోటుతో మరణించాడు. ఇంటినుంచి ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా దారిలో గుండెపోటు రావడంతో ఆండ్రియాస్ మృతి చెందాడు. ఒకప్పుడు 980 పౌండ్ల బరువుండిన ఆండ్రియాస్ చనిపోయే సమయానికి 700 పౌండ్ల బరువున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లడం కోసం ఆండ్రియాస్‌ను బెడ్‌పైనుంచి ఎత్తి స్ట్రెచర్‌పైకి చేర్చడానికి ఏడుగురు శ్రమించాల్సి వచ్చింది. సహజసిద్ధంగా 266 పౌండ్లు బరువుతగ్గిన తర్వాత మరింత బరువు తగ్గడం కోసం అతను ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నాడు. ఆపరేషన్ గనుక విజయవంతమై ఉండి ఉంటే ఆండ్రియాస్ బరువు175 పౌండ్లకు తగ్గిపోయేది.
అధిక బరువు కారణంగా తన భార్య మూడేళ్లకే తనను విడిచిపెట్టి పోయిందని బాధపడుతుండిన ఆండ్రియాస్ ఆపరేషన్ తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవాలని, పిల్లా జెల్లాతో గడపాలని కలలు కనే వాడు. ఆపరేషన్‌లో రిస్క్ ఉందనే విషయం తనకు తెలుసునని, అయితే ఆపరేషన్ చేయించుకోకపోతే తాను చనిపోతాననే విషయం కూడా తనకు తెలుసునని ఆపరేషన్ చేయించుకోవడానికి ముందు ఆండ్రియాస్ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించాడు.
వాస్తవానికి ఆండ్రియాస్ పుట్టినప్పటినుంచే అధిక బరువుండే వాడు. పుట్టినప్పుడు 13 పౌండ్ల బరువున్న అతను పదేళ్ల వయసు వచ్చేసరికి 264.5 పౌండ్లున్నాడు. నెలరోజుల క్రితమే ఫుట్‌బాల్ సూపర్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో బరువు తగ్గడానికి అతను పడుతున్న శ్రమను అభినందిస్తూ సంతకం చేసిన రియల్ మాడ్రిడ్ క్లబ్ షర్టును కానుకగా పంపించాడు కూడా.
** ప్రపంచంలోనే అత్యంత స్థూల కాయుడు ఆండ్రియాస్ (ఫైల్‌ఫొటో) **