రుచి

మనసు దోచే మాక్‌టెయల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసవి కాలమైనా.. వర్షపు జల్లులు పడినా జ్యూస్‌లు తాగే అలవాటు ఉన్నవారు ఎప్పుడు ఒకేలా తాగుతుంటే విసుగు వస్తుంది. కొత్త తరహా రుచులు జోడించి తాగితే ప్రత్యేకమైన పానియం తాగిన తృప్తి మిగులుతుంది. మాక్‌టెయిల్స్ చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రయత్నించండి.
యాపిల్ జింజర్ మాక్ టెయిల్
అల్లం కోరు-2 చెంచాలు, నిమ్మరసం-4 చెంచాలు, కొబ్బరి కోరు-2 చెంచాలు, సాల్ట్-1/2 చెంచా, షుగర్ సిరప్-1/4 కప్పు, యాపిల్ జ్యూస్- 2 కప్పులు, ఐస్‌ముక్కలు, పుదీనా- రెండు ఆకులు
ముందుగా ఒక పెద్ద మగ్‌లో అల్లం కోరు, నిమ్మరసం, కొబ్బరి కోరు వేసి దానిపై ఉప్పు సుగర్ సిరప్ పోయాలి. చివరగా యాపిల్ జ్యూస్ పోసి ఐస్ ముక్కలు వేయాలి. ఐదు నిముషాలు ఆ విధంగా ఉంచి పైన పుదీనా ఆకుతో అలంకరించాలి. తాగే ముందు చెంచాతో బాగా కలిపి తాగాలి. ఇలాంటి మిక్స్ జ్యూస్‌లు ప్రత్యేక రుచి కలిగి ఉంటాయి.
మస్క్‌మిలన్‌తో...
మస్క్‌మిలన్-1, పుదీనా తరుగు-1/2 కప్పు, మామిడి కోరు-5 చెంచాలు, కొబ్బరి కోరు-2 చెంచాలు, అల్లంకోరు-2 చెంచాలు, తేనె-1/2 కప్పు, సుగర్ సిరప్-5 చెంచాలు, ఐస్ ముక్కలు తరుగు-2 కప్పులు, ఉప్పు-1/4 చెంచా
ముందుగా మస్క్‌మిలన్ తొక్క తరిగి ముక్కలు చేసి మిక్సీపట్టాలి. ఈ జ్యూస్ ఒక గాజుపాత్రలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఒక గాజు టంబ్లర్ తీసుకుని దానిలో పుదీనా మామిడి కొబ్బరి కోరు, అల్లం కోరు వేసి దానిపై తేనె వేసి ఐస్ తరుగువేసి ఐదు నిముషాలు ఉంచాలి. ఉప్పు పంచదార సిరప్ వేసి కలిపి పైన మస్క్‌మిలన్ జ్యూస్ పోసి బాగా కలపాలి. ఐదు నిముషాలు అట్లానే వుంచి తాగితే రుచి.

ద్రాక్షతో..
మామిడిపండు కోరు-1/2 కప్పు, అరటి పండుముక్కలు-8, కొంచెం అల్లం కోరు-2 చెంచాలు, కొబ్బరి కోరు-2 చెంచాలు, మజ్జిగ-1 కప్పు, ఉప్పు-1/2 చెంచా, ఐస్ ముక్కలు-1 కప్పు, మిరియపు పొడి-1/2 చెంచా, ద్రాక్ష జ్యూస్- 2 కప్పులు
ఒక గాజు టంబ్లర్‌లో మామిడి కోరు దానిపై ఐస్ ముక్కలు అరటిపండు ముక్కలు అల్లం, కొబ్బరి,మిరియాలపొడి లైన్లు వేసి పైన మజ్జిగ పోసి ద్రాక్ష జ్యూస్ పైన వేసి ఐదు నిముషాలు వుంచి కలపాలి. దన్ని రెండు గ్లాసుల్లో పోసి ఇద్దరు తాగవచ్చు.
పుదీనాతో..
పుదీనా ఆకులు-1 కప్పు, పచ్చి మామిడి కోరు-1 కప్పు, బెల్లం సిరప్-1 కప్పు, కొబ్బరి కోరు- 2 చెంచాలు, ఉప్పు-1/2 చెంచా, ఐస్ తరుగు-1 కప్పు, ఖర్జూరం ముక్కలు-1/2 కప్పు, బాదం పొడి, జీడిపప్పు పొడి-2 చెంచాలు
ముందుగా పుదీనా మిక్సీపట్టి దానిని గ్లాసులో వేసి బెల్లం సిరప్ కొబ్బరి కోరు వేసి దానిపైమామిడి కోరు, ఐస్ తరుగు, ఖర్జూరం ముక్కలు, బాదం జీడిపప్పు పొడి వేసి 5 నిముషాలు వుంచాలి. ఆ తర్వాత చెంచాతో కలిపి తాగాలి. ఇది ఆరోగ్య రీత్యా చాలా మంచిది.
పుచ్చకాయతో..
పచ్చకాయ ముక్కలు-2 కప్పులు, నిమ్మరసం-2 చెంచాలు, తులసి ఆకులు-8, పంచదార సిరప్-1/4 కప్పు, ఉప్పు-అర చెంచా, ఐస్ కోరు-2 కప్పులు,
ముందుగా పుచ్చకాయ ముక్కలు మిక్సీపట్టి నిమ్మరసం, తులసి ఆకులు, పంచదార సిరప్ అన్నీ వేసి బాగా కలిపి ఐస్ ముక్కలు వేసి కలిపి త్రాగండి. ఇవి లేయర్స్‌గా వేయడంవల్ల రంగురంగులుగా వస్తుంది.పిల్లలకి పెద్దలకి ఆకర్షణీయంగా ఉంటుంది.
మామిడిపండుతో..
మామిడి పండు రసం-4 కప్పులు, మిరియాల పొడి-1 చెంచా, జీలకర్ర పొడి-1 చెంచా, ఉప్పు-1/2 చెంచా, తులసి ఆకులు-12, దానిమ్మ గింజలు-1 కప్పు, కొబ్బరి కోరు-2 చెంచాలు, పెరుగు-1 కప్పు, ఐస్ కోరు-2 కప్పులు, సుగర్
ముందుగా గ్లాసులో మామిడి రసం పోసి తులసి ఆకులు దానిపై వేసి దానిపై దానిమ్మ గింజలు వేసి సుగర్ సిరప్ మిరియాలు, జీలకర్ర పొడి వేసి దానిపై పెరుగు ఐస్ ముక్కలు వేసి 5 నిముషాలు ఉంచి చెంచాతో కలిపి తాగండి.

vani prebhakar