మెయిన్ ఫీచర్

పచ్చటి పుడమి పదిలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎత్తయిన కొబ్బరి చెట్లతో, గల గల పారే నీటి ప్రవాహాలతో పచ్చటి దుప్పటి పరిచినట్లు ఉండే కేరళలో పారిశుద్ధ్య కోసం నిబద్ధతతో పనిచేసే సుచిత్వా కమిషన్ గురించి రెండేళ్ల క్రితం వరకు ఎవ్వరికీ తెలియదు.

నేషనల్ గేమ్స్‌తో వెలుగులోకి...
పచ్చటి ప్రకృతిని పదిలం చేసుకోవాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని విశ్వసించే వాసుకి రెండేళ్ల క్రితం అక్కడ నేషనల్ గేమ్స్ సందర్భంగా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. ఈ క్రీడా పోటీలను అప్పటి ఎల్‌డిఎఫ్ ప్రభుత్వం ఆషామాషీగా నిర్వహించలేదు. ఈ పోటీలకు ‘క్లీన్, గ్రీన్ నేషనల్ గేమ్స్’ అని నామకరణం చేసి పర్యావరణ పరిరక్షణ అనే అంశాన్ని జాతీయస్థాయి ఆటల పోటీల్లో ఒక ప్రధాన అంశంగా చేర్చింది. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం గ్రీన్ నియమావళిని సైతం రూపొందించింది.
పర్యావరణ పరిరక్షణలో కేరళ తన ప్రత్యేకతను చాటేలా వ్యవహరించాలంటే అందుకు సమర్థవంతమైన అధికారి కావాలి. అపుడే ప్రభుత్వానికి డాక్టర్ వాసుకి కనిపించారు. ప్రజాసేవకు సరైన వేదికి ఐఏఏస్ అని నమ్మి వైద్యవృత్తిని విడనాడి ఐఏఏస్‌లోకి అడుగుపెట్టిన డాక్టర్ వాసుకే సరైన అధికారి అని ఆనాటి ప్రభుత్వం భావించి ఈ బృహత్కార్యాన్ని ఆమెకు అప్పగించింది. ఇందుకోసం సుచిత్వా మిషన్ ఏర్పాటుచేసి డైరెక్టర్‌గా డాక్టర్ వాసుకిని నియమించింది.
ప్రజల భాగస్వామ్యంతో సాధ్యం
పచ్చటి ప్రకృతి పరిరక్షించబడాలంటే ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని భావించిన వాసుకి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రజల చేత పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని ప్రమాణ స్వీకారం చేయించింది. తొలిసారి జాతీయ స్థాయి సెమినార్‌ను నిర్వహించింది. ఆ సెమినార్‌లోనే ఆమె కాగితం, ప్లాస్టిక్ కప్పులు వాడకుండా కేవలం స్టీల్ గ్లాసులు, కప్పులను వాడించింది. తిరువనంతపురం కార్పోరేషన్‌కు ఆమె టీమ్ శక్తి వంచన లేకుండా సహకరించటం వల్లే ఆ నేషనల్ గేమ్స్ దిగ్విజయంగా నిర్వహించగలిగారు. అందుకే తన జీవితం ఈ పోటీల ముందు, తరువాత అనే పార్శ్యాల సమ్మేళనం అని డాక్టర్ వాసుకి సైతం నవ్వుతూ అంగీకరిస్తోంది.
పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది..
నేషనల్ గేమ్స్ సందర్భంలో గ్రీన్ కేరళలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు డాక్టర్ వాసుకి, ఆమె టీమ్ పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. సెమినార్లు నిర్వహిస్తే స్టీల్ గ్లాసులనే వాడేటట్లు నియమావళి రూపొందించారు. వీధి వీధిన పచ్చటి చెట్లను నాటించారు. వ్యర్థాల కోసం రెండు రకాల డస్ట్‌బిన్‌లను ఏర్పాటుచేశారు. ప్లాస్టిక్ వాడకం పట్ల ప్రజలలో పూర్తిస్థాయిలో చైతన్యం తీసుకురావటానికి ఆమె నిద్రలేని రాత్రులనే గడిపారు. పర్వావరణ పరిరక్షణ కోసం ఆమె చేస్తున్న నిస్వార్థ కృషికి కేరళవాసుల మద్దతు సైతం లభించింది.
స్టీల్ గ్లాసులే వాడతారు...
ఇపుడు అక్కడ సెమినార్లు జరిగితే కేవలం స్టీలు గ్లాసులనే వాడతారు. వ్యర్థ పదార్థాలను ఎక్కడపడితే అక్కడ వేయటం అనేది ఎన్నో ఏళ్లుగా వస్తోంది. ఒక్కసారిగా మార్పు తీసుకురావటం అనేది చాలా కష్టం. అయినప్పటికీ వెనుకంజ వేయకుండా వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రంగా ప్రతి ఇంటిని తీర్చిదిద్దింది. ప్రభుత్వ ఇచ్చే సబ్సిడీ కోసం ఎదురుచూడకుండా రెండు కుండలలో వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుల తయారీకి వాడాలని ఆమె తీసుకువచ్చిన చైతన్యం అక్కడ చక్కగా పనిచేసింది. ఇక ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని రూపుమాపటం అనేది చాలా పెద్ద పని. కాని సాధ్యం కానిదంటూ లేదు. స్కూలు పిల్లలు మంచినీళ్లు, భోజనం తీసుకువెళ్లాలంటే ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించటం ఎంతో సౌకర్యంగా ఉన్నా ... ఈ విషయంలో ఆమె తల్లులను ఒప్పించగలిగారు. ఎలా అంటే రాష్టవ్య్రాప్తంగా స్కూళ్లలో సెమినార్లు, ఇళ్లల్లోనూ, కాలనీలలోనూ, అపార్ట్‌మెంటలలోనూ ఎక్కడ ఏ చిన్న సెమినార్ ఏర్పాటుచేసినా ఆమె హాజరై ఓర్పుగా చెప్పి తల్లులను ప్లాస్టిక్ వాడకం పట్ల చైతన్యం తీసుకురాగలిగారు.
ప్రకృతి నుంచి మనం ఎంతో తీసుకుంటున్నాం. కాని ప్రకృతికి మాత్రం ఏమి ఇవ్వలేకపోతున్నాం. పచ్చటి గడ్డిని మేయాల్సిన ఆవుకు ప్లాస్టిక్ వ్యర్థాలు ఆహారంగా మారటం వల్ల పచ్చటి ప్రకృతిని చేజేతులారా మనమే నాశనం చేసుకుంటున్నాం అని ఆమె అంటారు.
దంపతులిద్దరిదీ ఒకే బాట.. ఓకే మాట
ప్రజా సేవకు వైద్యవృత్తి కంటే ఐఏఏస్ ద్వారానే ఎక్కువ అవకాశాలు అని భావించిన వాసుకి, ఆమె భర్త కార్తికేయ ఇద్దరూ కూడా వైద్యరంగాన్ని విడనాడి పాలనా రంగం వైపు వచ్చారు. ఆమె భర్త ప్రముఖ డాక్టర్. ఆయన మెడికల్ ప్రవేశ పరీక్షలలో మూడ ర్యాంక్ సాధించిన విద్యార్థి. అటువంటి వ్యక్తి దేశానికి ఏదైన చేయాలంటే ఐఎఎస్ సరైన వేదిక అని భావించి వైద్యవృత్తిని విడనాడి కలెక్టర్ అయ్యారు. ఇపుడు ఇరువురు కూడా కేరళలో పనిచేస్తున్నారు. ఇద్దరు కూడా సామాజిక మార్పులో భాగస్వాములవ్వటమే లక్ష్యంగా.. తమ వృత్తులను అనుసంధానం చేసుకుంటూ చైతన్యం పైపు సాగుతున్నారు.

ఆమె కుడి చేయి బజర్ మీద ఉన్నది. ఎడమ చేయి డాక్యుమెంట్ల మీద సంతకాలు పెడుతోంది. ఎదురుగా కూర్చుని బదిలీ గురించి అడుగుతున్న వ్యక్తితో తలూపుతూ మాట్లాడుతోంది. చూపులు డోర్‌పైన ఉన్నాయి. అక్కడ ఆమె కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. ఎపుడు పిలుపు వస్తుందా..లోనికి వెళదామని ఒకరి తరువాత ఒకరు వచ్చి తమ అభ్యర్థనలను ఆమె ముందు పెడుతున్నారు. వారు చెప్పేది ఓర్పుతో వింటూ సమాధానాలు ఇస్తోంది. ఇలా ఓ వ్యక్తి అన్ని అవయవాలతో అలవోకగా పనిచేస్తున్న ఆమే డాక్టర్ వాసుకి. ఈమె ఆసుపత్రిలో వైద్యురాలు అని అనుకుంటే తప్పులో కాలేసినట్లే. పర్యావరణ మార్పు కోరుతూ ఓ ఏజెంట్ వలే ప్రజలతో మమేకమై గ్రీన్ కేరళ కోసం నిరంతరం పరిశ్రమిస్తున్న యువ ఐఏఏస్ అధికారిణి, సుచిత్వా మిషన్ డైరెక్టర్.

స్టీలు గ్లాసులలోనే మంచినీళ్లు ఇవ్వటం అనే మార్పునకు వాసుకి శ్రీకారం చుట్టారు

- ఆశాలత