మెయిన్ ఫీచర్

చైతన్య దీప్తి...లీలా సంతోష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదివాసీ సామాజిక వర్గంలో ప్రతిభ ఉన్నా అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, తనకు మాత్రం తన భర్త, పిల్లల పూర్తి సహకారం ఉందని, వారి సహకారంతో తాను ముందుకు వెళతానని, తన ప్రతిభని రుజువుచేసుకుంటానని చెప్తుంది లీలా సంతోష్.

మలయాళ చిత్రసీమలో ఇప్పుడా పేరు ఒక స్ఫూర్తి. ఆమె ఆధునిక సమాజానికి దూరంగా వుండే ఆదివాసీ వర్గానికి చెందిన యువతి. చదువు సంధ్యలకు ఆమడదూరాన మిగిలిపోయిన యువతి. చిత్ర పరిశ్రమకు సంబంధించిన ఎలాంటి శిక్షణ పొందలేదు. చిత్ర పరిశ్రమలో ఆమెకు ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు గాడ్‌ఫాదర్ లేరు. ఉన్నదల్లా ఒక్కటే చలన చత్ర పరిశ్రమ మీద ఆసక్తి. చిత్రాలను తియ్యాలన్న ఆసక్తి. ఆ ఆసక్తే ఆమెను చిత్ర పరిశ్రమ వైపునకు నెట్టింది. తనకున్న పరిధిలో మొదట ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని తీసింది. తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఇంకా ముందుకు సాగడానికి ప్రయత్నాలు కొనసాగిస్తూనే వుంది. ఆమే లీలా సంతోష్. కేరళ రాష్ట్రంలో చిత్ర పరిశ్రమలోకి దర్శకురాలిగా అడుగుపెట్టిన తొలి ఆదివాసీ మహిళ.
కేరళలోని వాయనాడ్ జిల్లాలో నడవయాల్‌లోని పునియా ఆదివాసీ తెగకు చెందిన 28 ఏళ్ళ మహిళ లీలా సంతోష్. చిన్నతనంనుంచి సినిమాలమీద ఆసక్తి. కాని చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టడానికి కావలసిన ప్రతిభా, పాటవాలుగానీ, శిక్షణగానీ లేవు. కనీసం సాధారణ చదువుకు కూడా నోచుకోలేదు. కాకపోతే.. చిత్ర దర్శకుడు, ఉద్యమకారుడు, ఆదివాసీ ప్రజల బాగోగులపై పనిచేస్తున్న కె.జె.బాబి నిర్వహిస్తున్న ఒక స్వచ్ఛంద సంస్థ పాఠశాల ద్వారా కాస్త విద్యను అభ్యసించింది. అక్కడే ఎన్నో విషయాలను అభ్యసించింది. కనవు అన్న పేరుతో నిర్వహిస్తున్న ఆ పాఠశాలలో చిత్ర దర్శకుడైన కె.జె.బాబి చిత్రాలకు సంబంధించిన విషయాలను కూడా ఒక పాఠ్యాంశంగా బోధించేవాడట. దాంతో అక్కడ తన ఆసక్తిని, కలను సాకారం చేసుకోవడానికి అక్కడే శ్రీకారం చుట్టింది. సినిమాలకు సంబంధించిన ఎన్నో విషయాలను అక్కడే ఆకళింపు చేసుకుంది. అందులో నేర్చుకున్న విషయాలకు తోడు చిత్రాలకు సంబంధించి నిర్వహించే వర్క్‌షాపులకు హాజరయ్యేది. అలా తనకు కావలసిన సమాచారాన్ని, మెళకువలను నేర్చుకుంది. ఆదివాసీలను, వారిలోని నైపుణ్యాలను వెలుగులోనికి తీసుకురావాలని తపించే సివిక్ చంద్రన్ లాంటి కొందరి సహకారంతో కొన్ని డాక్యుమెంటరీలకు సహాయకురాలిగా పనిచేసింది. మొదటిసారి, 2005లో వి.కె.జోసెఫ్ దర్శక త్వంలోని గుడ డాక్యుమెంటరీ చిత్రానికి సహాయకురాలిగా పనిచేసింది. అక్కడ మరిన్ని మెళకువలను నేర్చుకుంది. ఆ తరువాత కొన్ని షార్ట్ ఫిల్ములకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది. ఆ అనుభవంతో ఆదివాసీ తెగలలోని ఆచార, వ్యవహారాలు, సంబంధాలు, మొదలైన విషయాలతో 2010లో 45 నిముషాల షార్ట్ఫిల్మ్‌ను తీసింది. ఆ చిత్రం అందరి మన్ననలు పొందడమే కాకుండా చాలా చిత్రోత్సవాలలో కూడా ప్రదర్శించబడింది. ఆ స్ఫూర్తితో ఇపుడు పూర్తి స్థాయి చలనచిత్రానికి దర్శకత్వం చేయాలని సన్నాహాలు చేసుకుంటోంది. దీనికి కూడా తన పునియా ఆదివాసీ తెగకు సంబంధించిన ఇతివృత్తానే్న ఎంచుకుంది. ఆదివాసీ తెగలలో ఎక్కువగా కనబడేది చిన్నవయసులోనే అది కూడా పెళ్లికాకుండానే తల్లులయే పసిపిల్లలు. దీన్ని ఇతివృత్తంగా తీసుకుని తన మొదటి చిత్రాన్ని మొదలుపెడుతోంది. ఏ సామాజిక సమస్య అయినా ప్రజలలోకి అత్యంత వేగంగా తీసుకువెళ్ళేది సినిమాయేనని, అందుకే తన ఆదివాసీల సమస్యలను సమాజం ముందుకు తీసుకుపోవడానికి తను ఆ మాధ్యమాన్ని ఎన్నుకున్నానని అంటుంది లీలా సంతోష్. అయితే ఇది చూసి ఇక అన్నీ రొటీన్‌గా ఉండే ఇలాంటి అంశాల చిత్రాలే తననుంచి వెలువడతాయని చాలామంది అంచనా వేస్తారు. కానీ తను కేవలం ఒకే అంశానికి కట్టుబడిపోకుండా అన్ని కోణాలను స్పృశిస్తూ ఒక వ్యాపార చిత్రాల దర్శకురాలిగా కూడా ఎదగాలన్నది తన కోరికని అంటుంది లీల.

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- మావూరు విజయలక్ష్మి