మెయిన్ ఫీచర్

పండగలా వస్తారు! (కృష్ణా పుష్కరాల ప్రత్యేకం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణవేణి పుష్కరాలకు జనం పోటెత్తనున్నారు. ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో ఇప్పటికే జనం ప్రధాన ఘాట్లకు ప్రయాణం మొదలెట్టారు. శనివారం సాయంత్రానికే చాలాచోట్ల రద్దీ పెరిగింది. మహబూబ్‌నగర్ జిల్లాలో 4 లక్షలమంది భక్తులు వచ్చారని అంచనా. అటు నల్గొండ జిల్లాలోనూ నిన్న నీరు లేని కొన్ని ఘాట్లకు ఇవాళ కృష్ణమ్మ చేరుకుంది. మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల, అలంపురం, బీచుపల్లి, రంగాపురం ఘాట్లకు జనం పోటెత్తారు. అటు నల్గొండ జిల్లాలోని వాడపల్లి, సాగర్ ఘాట్లకు రద్దీ పెరిగింది. సెలవురోజుల్లో భక్తుల తాకిడి దృష్ట్యా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురుకాకుండా ఇప్పటికే అధికారు చర్యలు తీసుకున్నారు. నల్గొండ జిల్లాలో అడిషనల్ డిజిపి అంజన్‌కుమార్, డిఐజి అకుల్ సబర్వాల్, ఐజి మల్లారెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించారు. సెలవులున్న రెండురోజులు ట్రాఫిక్ నియంత్రణపై చర్చించారు. అటు మహబూబ్‌నగర్ జిల్లా సోమశిల ఘాట్‌వద్ద హెలికాఫ్టర్‌లో ఏరియల్ సర్వే చేశారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్, సోమశిల, బీచుపల్లి, నల్గొండ జిల్లా వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లి ఘాట్‌లకు జనం పోటెత్తే అవకాశం ఉందన్న అంచనాతో ఏర్పాట్లు చేశారు. భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లే ఇప్పుడు కీలకం కానున్నాయి. వసతి, మంచినీటి సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉంటుంది. దాదాపు 90 శాతం ఘాట్లవద్ద పరిస్థితులన్నీ బాగానే ఉన్నాయి. వచ్చే రెండు రోజుల్లో కనీసం 15 లక్షలమంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరం నుంచి ఇప్పటికే వేలాదిమంది కృష్ణవేణిని దర్శించుకునేందుకు బయలుదేరారు.