ఉత్తరాయణం

చరిత్ర నుంచి పాఠం నేర్వని భారత జాతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పృథ్వీరాజ్ 16 సార్లు మహమ్మద్ ఘోరీని ఓడించి, క్షమించి వదిలేశాడు. 17వ సారి ఘోరీ మహమ్మద్, ఫృథ్వీరాజ్ చౌహాన్ని తరైన్ యుద్ధంలో ఓడించి, కళ్లు పీకించి, గుర్రానికి కట్టి లాక్కెళ్లాడు. భారత్ నుంచి బంగారాన్ని గుర్రాల మీద, స్ర్తిలను బానిసలుగా తీసుకెళ్లాడు. వ్యాపారానికని వచ్చిన బ్రిటిష్ వారు పాలకులై ఒక్కొక్క రాజ్యాన్ని కబళించి, రాజ్యాధికారాన్ని చేజిక్కించుకొని ఇక్కడి వృత్తులను నాశనం చేసి ముడిసరుకుని ఇంగ్లండ్‌లోని తమ పరిశ్రమలకు తీసుకొని వెళ్లారు. అవి తయారు చేసిన వస్తువులను అధిక ధరకు మళ్లీ మనకే అమ్మారు. 1876లో, 1942లో పుష్కలంగా పండిన ధాన్యాన్ని బ్రిటన్‌కు పంపి, ఇక్కడి ప్రజలను కరువుకు ఎరవేశారు. లక్షల సంఖ్యలో భారతీయులు మరణించారు.
దేశస్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా..ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం, వీటోపవర్ ఇప్పించారు నెహ్రూజీ. గుడ్డిగా చైనాను నమ్మారు. ఆ చైనా 1962లో మనపై దాడిచేసి మన భూభాగాన్ని ఆక్రమించింది. 1965లో పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్‌ని ఆక్రమించే స్థితి ఉన్న మన సైన్యాన్ని ఆపి తాష్కెంట్ ఒప్పందం పేరుతో ప్రధాని లాల్ బహదూర్ శాస్ర్తీని పొట్టన పెట్టుకున్నారు. చివరకు శవపరీక్ష కూడా జరపలేదు. ప్రధాని వాజ్‌పేయి లాహోర్‌కి బస్సు ప్రయాణం చేశారు. ప్రతిగా పాకిస్తాన్ కార్గిల్ యుద్ధానికి ఒడిగట్టింది. నవాజ్ షరీఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, షరీఫ్ తల్లికి పాదాభివందనం ఆచరించి, మనుమరాలి పెళ్లిని చూచి వచ్చిన ప్రధాని మోదీకి పఠాన్‌కోట ఉగ్రవాదుల దాడిని ప్రసాదించారు.
పాకిస్తాన్ యుద్ధంలో లాహోర్‌ను ఆక్రమించుకునే పరిస్థితి ఉన్నా, బంగ్లాదేశ్ యుద్ధంలో 90వేల మంది పాక్ సైనికులు మన చేతికి చిక్కినా, కశ్మీర్ సమస్య పరిష్కరించుకోకుండానే వదిలేసింది. వచ్చిన అవకాశాలను వదులుకొని, అతి మంచితనానికి పోయి శత్రువులకు అవకాశాలు ఇస్తూ చరిత్ర నుండి ఎలాంటి పాఠాలు నేర్వని జాతిగామనం మిగిలిపోతున్నాం. బ్రిటన్ కెన్యాకి వౌవౌ హత్యాకాండకి క్షమాపణ చెప్పింది. మొదటి ప్రపంచ యుద్ధంలో 18 లక్షల ఆర్మీనియన్లను చంపిన టుర్క్‌ల ఘాతుకాన్ని అర్మీనియా మరచిపోలేదు. స్టాలిన్ కత్యన్ హత్యాకాండని పోలెండ్ మరచిపోలేదు. చైనా జపాన్ చేత రెండుసార్లు క్షమాపణ చెప్పించుకుంది. నష్టపరిహారం అడిగింది. మనమెందుకు తురకలను, బ్రిటిషర్లను, చైనాని, పాకిస్తాన్‌ని చేసిన ఘాతుకాలకు నష్టపరిహారం గానీ, క్షమాపణలు గానీ అడగడం లేదు?
- వల్లూరు రామకృష్ణ, హైదరాబాద్
హద్దులు మీరుతున్న మగువలు
టెక్నాలజీ పెరిగిపోతోంది. ప్రతీ విద్యార్థి జేబులో పెన్నులేకపోయినా చేతిలో మాత్రం లేటెస్ట్ స్మార్ట్ఫోనుంటుంది. వీటిని తల్లిదండ్రులు ఎందుకు కొనిస్తున్నారో కానీ ఈ స్మార్ట్ ఫోన్లవల్ల ఫేస్‌బుక్, వాట్సప్, ఛాటింగ్‌లనబడే వ్యసనం బాగా ముదిరిపోయింది. అయిందానికి కాని దానికి ఇవొక మీడియాగా తయారయ్యాయి. ముక్కూమొహం తెలియని వారితో పరిచయాలు పెరిగి, ప్రేమంటే అర్ధం తెలియక, వ్యామోహంలో పడి పండంటి జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఎయిడ్స్ రోగి అయిన ఒక ఆటోడ్రైవరు ఉచ్చులో మూడువందల మంది యువతులు చిక్కుకున్నారు. మరో సైకో ఫేస్‌బుక్ ద్వారా ముప్ఫైఅయిదు వేలకు పైగా ఆడ వారిని ఆకర్షించాడట. ఆడవారు హద్దులు దాటి ప్రవర్తించడమే ఇందుకు కారణం. ప్రాణంకన్నా మానం ప్రధానం అని భావించే మన దేశంలో పెళ్ళికాని వారేకాక, పెళ్ళయి పిల్లలున్న కొందరు తల్లులు కూడ భర్తల చాటున రహస్య కలాపాలు కావిస్తూండడం స్ర్తిజాతికే సిగ్గుచేటు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్