ఐడియా

సుగంధం... ఆహ్లాదకరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫంక్షన్ల్‌కు వెళ్తుంటే సిల్కు చీరలలో, రుమాళ్లలో సెంటో, అత్తరో జల్లితే కమ్మగా సువాసనలు వెదజల్లుతాయి. వాటిలో మల్లె, రోజా, సంపెంగ, చామంతి రకాల సెంట్లు వుంటాయి. అవి ఫారిన్, ఇండియన్‌వి వుంటాయి. అవి ఖర్చుతో పని. అందుకని సువాసనకు, సౌందర్యాన్ని పెంచడానికి గంథం వాడుకుంటే ఉభయ తారకంగా వుంటుంది.
గంథాన్ని రోజ్‌వాటర్‌లో కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంమీద రాష్ పోతుంది. పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత ముఖాన్ని కడుగుకోవాలి. ముఖానికి మంచి కాంతి వస్తుంది.
ప్రతిఠోజూ పసుపు, గంధం కలిపి ముఖానికి రాసుకుంటే క్రమేణా మొటిమలు తగ్గి మంచి వర్ణం వస్తుంది.
గంధపు నూనెను నాలుగు చుక్కలు నీళ్లలో కలిపి స్నానం చేస్తే చర్మవ్యాధులు రావు. శరీరం సువాసనతో వుండటం కాక బాక్టీరియా దరికి చేరదు. గంథం నూనెను, ఆలీవ్ ఆయిల్‌లో కలుపుకుని శరీరానికి మర్దన చేసుకుంటే చర్మం మృదువుగా తయారౌతుంది. గంథంలో హారతి కర్పూరం కలిపి మొటిమలకు క్రమం తప్పక పూస్తుంటే మొటిమలు, చర్మం పొక్కులు తగ్గిపోతాయి. గంథం రసం కొద్దిగా, రోజ్‌వాటర్ కలిపి బ్లషర్‌తో బుగ్గలపై అప్లయి చేస్తే అందంగా, నున్నగా కన్పడతాయి.
స్నానానంతరం గంథం కొన్ని చుక్కలు, పన్నీరు కొన్ని చుక్కలు ఓ మగ్గు నీటిలో కలుపుకొని ఒళ్ళంతా స్ప్రే చేసుకుంటే ఆ రోజంతా ఎంతో పరిమళిస్తారు. గులాబీ రేకులతో నీటిని కలియబెట్టి ఆ రేకులతో ఒళ్ళు రుద్దుకుంటూ స్నానం చేసిన తర్వాత గంథం వాటర్‌ని చర్మంపై చల్లితే రోజంతా ఘుమఘుమలాడతారు.
పూజకు వాడే గంథం 2 చిటికెలు జేబురు రుమాలులో వేసికొని బయటికి వెళ్తే మంచి సువాసన వెంట వున్నట్లే!

భూమికకు రచనలు
పంపాలనుకునే వారు
రచనలను
ఈ మెయిల్‌లో స్కాన్ లేదా
పిడిఎఫ్ ఫార్మాట్‌లో bhoomika@andhrabhoomi.netకు మెయల్ చేయవచ్చు.
లేదాఈకింది చిరునామాకు
పంపగలరు.
మా చిరునామా :
ఎడిటర్, భూమిక
ఆంధ్రభూమి దినపత్రిక
36, సరోజినీదేవి రోడ్
సికిందరాబాద్- 03

- బి.విజయలక్ష్మి