మెయిన్ ఫీచర్

పాఠశాలకు వెళ్లకపోతేనేమి కల నెరవేర్చుకుందిలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల పెంపకంలో పెద్దల పాత్ర గురించి వాదోపవాదాలు, చర్చలు జరుగుతున్న వేళ..స్కూలు మానేసిన ఓ టీనేజ్ అమ్మాయి తన అమ్మ అందించిన తోడ్పాటుతో అందలమే ఎక్కింది. ఆ అమ్మాయి పేరు మాళవిక రాజ్ జోషి. అందరి పిల్లల వలే మాళవిక చిన్నప్పటి నుంచి బుద్దిగా స్కూలుకు వెళ్లి చదువుకోవటానికి ఇష్టపడేది కాదు. నాలుగేళ్ల క్రితం పాఠశాలకు వెళ్లటం మానేసింది. ఆమె కనీసం 10,12 తరగతులు సైతం చదవలేదు. కాని ఇటీవల ప్రతిష్టాత్మకమైన ‘మిట్’ విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందింది. ఈ సరస్వతీ పుత్రికలో అంతర్లీనంగా దాగిన ప్రతిభాపాటవాలను గుర్తించిన ఆమె తల్లి వాటికి పదును పెట్టుకోవటానికి ఆమెఅందంచిన చేయుత అందలాన్ని అవలీలగా చేరుకునే అవకాశాన్ని కల్పించింది. ఇపుడు ఆమె వయసు పదిహేడేళ్లు. నాలుగేళ్ల క్రితం పాఠశాలను వదిలేసింది. తాను నేర్చిన కొద్దిపాటి చదువుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించింది. ఫలితంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఆమె చూపే ప్రతిభకు ఎన్నో మోడల్స్ సైతం వరించాయి.
మార్కులు కాదు మెరిట్ ముఖ్యం..
మార్కులు ప్రధానం కాదు మెరిట్ ప్రధానమని మాళవిక నిరూపించింది. స్కూలు మానేసిన తరువాత కంప్యూటర్ ప్రోగ్రామింగ్ పట్ల మక్కువ చూపింది. ఆమె తల్లి ఓ ఎన్జీఓ సంస్థలో చిరు ఉద్యోగి. తండ్రి ఇంజినీర్ చదివి సొంతంగా వ్యాపారాన్ని నడుపుకుంటున్నాడు. ఆయన తన పిల్లలు స్కూలుకు వెళ్లి చక్కగా చదువుకోవాలని ఆశించాడు. కాని తల్లి మాత్రం పిల్లలకు ఏది ఇష్టమో దాంట్లోనే ముందుకు సాగనివ్వాలని, దీనివల్ల అంతర్లీనంగా వారిలో ఉన్న ప్రతిభాపాటావాలు బయటపడటమే కాకుండా పరిశోధనలకు భీజం పడుతుందని ఆశించింది. తన కుమార్తె మాళవిక స్కూలుకు వెళ్లి చదువుకోవాలని ఆసక్తి చూపకపోవటాన్ని గమనించిన తల్లి వెంటనే చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి ఇంటినే స్కూలుగా మార్చి పాఠాలు బోధించేది.
పిల్లల సంతోషమే ప్రతిభకు పదును..
పిల్లలు సంతోషంగా ఉంటేనే వారిలోదాగివున్న జ్ఞానం వెలికివస్తుందని ఆశించింది. స్కూలు మానేసిన తరువాత మాళవిక ఆనందంగా ఉండటాన్ని గమనించింది. అలా అని చెప్పి ఆమెను చిల్లరమల్లరగా తిరగనివ్వలేదు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో ఆమెకున్న ఆసక్తిని గమనించి ఒలంపియాడ్‌కు తయారు చేసింది. ఇంట్లో ఉంటూనే ఒలంపియాడ్‌లో రెండు సిల్వర్, కాంస్య పతకాలను సాధించింది. బోస్టన్‌తో పరస్పర అనుబంధాన్ని ఏర్పరచుకుని వారితో నిరంతరం కాంటాక్ట్‌లో ఉంది. దీంతోపాటు కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లో వివిధ సబ్జెక్టులలో అనే్వషణ ప్రారంభించింది. 12వ తరగతి పాస్ అవ్వకుండా ఎలైట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌లో చోటు సంపాదించటం కష్టం. కాని మాళవిక అందులో కూడా సీటును సంపాదించింది. ఒలంపియాడ్‌లో ఆమె చూపిన ప్రతిభాపాటవాలతో పాటు ఆమెకు లభించిన మోడల్స్‌ను గమనించిన మిట్ ఆమెకు పిలిచి ప్రతిష్టాత్మకమైన తన యూనివర్శిటీలో సీటు ఇవ్వటమే కాదు స్కాలర్‌షిప్‌ను సైతం ఇచ్చింది. ఇలా నాలుగేళ్ల పాటు యజ్ఞంగా భావించి కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌లోనూ, గణితంలోనూ ఆమె నేర్చుకున్న విజ్ఞానానికి ప్రతిఫలంగా ఈ అందలాన్ని అందుకుంది. చిన్న వయసులోనే ఆశలకు రెక్కలు తొడిగి అనుకున్న విజయాన్ని సొంతం చేసుకుంది.
*