మెయిన్ ఫీచర్

సరికొత్త సవాల్.. అయినా సై!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముప్పయి కిలోమీటర్ల మారథాన్ రన్ ఎవరు చేయగలరు. కాని ఈ మహిళా కమాండో అవలీలగా చేశారు. తల మీద యాపిల్ పెట్టి గురితప్పకుం డా కాల్చటంలో ఆమెకు ఆమె సాటి. ప్రతికూల పరిస్థితుల్లోనూ లక్ష్యం వైపు గురిపెట్టగల సామర్థ్యం సొంతం. చాలా మంది మగ కమాండో శిక్షకులు సైతం ఒకటి రెండు సార్లు గురితప్పుతారేమోగానీ సీమారావు మాత్రం మహాభారతంలోని అర్జునుడి వలే తన లక్ష్యాన్ని చేరుకుంటారు. ఓ వైపు తుపాకీ ఎక్కుపెట్టి మరోవైపు కత్తి విసిరినా ఎలా తప్పించుకోవాలో ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ముంబయ చెందిన తొలి మహిళా కమెండో శిక్షకురాలిగా చరిత్ర పుటల్లో తన పేరును రాసుకోవటమే కాదు ఎంతోమందికి సైనికులకు శిక్షణ ఇస్తూ వారిలో దేశభక్తి కి ప్రేరణ కలిగిస్తున్నారు. తండ్రి స్వాతంత్య్ర పోరాట యోధుడు. ఆయన చిన్నతనంలో స్వాతంత్య్ర సంగ్రామంలో జరిగిన సంఘటనలను కథలు కథలుగా చెబుతుంటే విని ఆ వయసులో మనసులో నాటిన దేశభక్తి బీజాలు వృక్షాలుగా ఎదిగాయ.
దీంతో వైద్యవిద్య చదివినప్పటికీ ఆ వృత్తిని చేపట్టకుండా కమాండోగా తనను తాను తీర్చిదిద్దుకుంది. భర్త కూడా మేజర్ కావటంతో ఆమె ఎంచుకున్న మార్గంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. ఎంతోమంది సైనికులు శిక్షణ పొందట మే కాదు మాతృభూమిని కాపాడుతూ ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు.
జీవితం అసాధారణమైంది. మనం ఒక మార్గంలో వెళ్లాలనుకుని బయలుదేరితో మరోమార్గంలో వెళ్లాల్సి రావచ్చు. వైద్యశాస్రాన్ని అభ్యసించినా.. కమాండో శిక్షకురాలిగా జీవితానికి ముగింపు ఇవ్వాల్సివస్తే అంతకన్నా ఆనందం లేదంటుంది సీమారావు. భర్త కూడా ఆమె అభిరుచిని కాదనకుండా ప్రోత్సహించటంతో ఆమె అందరు వెళ్లే మార్గంలో కాకుండా విభన్నమైన రంగాన్ని ఎంచుకోగలిగారు. ఈ వృత్తి ఆమెకు సరికొత్త సవాల్. అయినప్పటికీ సంతృప్తినిస్తుందంటారు. నిన్న ఏమి చేయలేకపోయానో.. ఈరోజు అదే చేయగలననే నమ్మకంతోనూ, అంకితభావంతో పనిచేస్తోంది. జీవితం యుద్ధ్భూమిలాంటిది. ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంపికచేసుకున్నపుడు శారీరంగా, మానసికంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని భయపడి పారిపోకుండా నిలబడితేనే విజయాన్ని సొంతం చేసుకోవచ్చని ఆమె ప్రగాఢ నమ్మకం.
శిక్షణలోనే రాటుదేలా..
సైనికులకు ఇచ్చిన శిక్షణలోనే మానసికంగా, శారీరకంగా మరింత రాటుతేలింది. ఓ సారి శిక్షణలో భాగంగా తలకు పెద్ద గాయమైంది. జ్ఞాపకశక్తిని సైతం కోల్పోయింది. జీవితంలో ఎదురైన ఇలాంటి పెద్ద అడ్డంకిని సైతం అధిగమించి మళ్లీ పూర్వ జీవితాన్ని అందుకోగలిగానని స్వాతంత్య్ర సమరయోధుడు రమాకాంత్ సినారి కుమార్తె, మేజర్ దీపక్ రావు భార్య సీమారావు వెల్లడించారు.
హోంశాఖ సైతం కీలక బాధ్యతలు అప్పగింత
తండ్రి చెప్పిన దేశభక్తి పాఠాల వల్లనేమో శిక్షణలో ఆమె చూపే నిబద్ధతను పరిశీలించిన హోంశాఖ దేశంలో పెచ్చుమీరుతున్న ఆమె ఉగ్రవాద చర్యలను అరికట్టేందుకు సైనికులకు ఇచ్చే ప్రత్యేక శిక్షణా బాధ్యతలను సైతం ఆమెకు అప్పగించటం జరిగింది.
సీమారావుకున్న ప్రత్యేకతలు
ఆసియాలోనే సీనియర్ బ్లాక్ బెల్ట్ హోల్డర్. బ్రూసిలీ ఆర్ట్‌లో సీనియర్ ఇన్‌స్ట్రక్టర్, ఇజ్రాయిల్ శిక్షణా విధానాన్ని కూడా ఆమె నేర్చుకుని సైనికులకు నేర్పిస్తుంటారు. సైనిక శిక్షణ గురించి వివరిస్తూ.. యుద్ధంలో యోధులు మూడు మిల్లీ మీటర్ల దూరంలో ఉన్న శత్రువునైనా పసిగట్టి పోరాడే విధంగా శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటారు. ప్రతి ఒక్క సైనికుడు సూపర్‌మేన్‌గా వ్యవహరించాలని, శత్రువులతో పోరాడుతూనే ఒంటిచేత్తో 60 కిలోల బరువు ఉన్న ఆయుధాలను మోసుకువెళ్లేవిధంగా శిక్షణ ఇవ్వటం జరుగుతుందని, రోజుకు 50-100 కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుందని, ఆవిధంగా వారికి తర్ఫీదు ఇవ్వటం జరుగుతుందని వివరించారు.
ఎంతో రిస్క్‌తో కూడకున్న ఈ శిక్షణ ఓ మహిళా కమాండోగా ఆమె సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ సైనిక శిక్షణాకేంద్రాలకు తరుచూ ప్రయాణిస్తూ సైనికులను యుద్ధవీరులుగా తీర్చిదిద్దుతున్నారు. శిక్షణ సందర్భంగా ప్రమాదవశాత్తు గాయపడినా తొలి ప్రతిస్పందన ఆమె నుంచే సైనికులు అందుకుంటారు. ఎందుకంటే ఆమె వైద్యురాలైనందున వెనువెంటనే ప్రాధమిక చికిత్స అందిస్తూ వారిలో ఆత్మస్ధైర్యాన్ని నింపుతోంది.
వివక్షను ఎదుర్కొన్నారా..?
ఏ రంగంలోనైనా ఎవరైనా తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నపుడే వారు ఆయా రంగాలలో రాణిస్తారు. ఈ రంగం శారీరక శ్రమకు సంబంధించింది. ఏ రంగంలోనైనా మహిళలు తమ మంచి నడవడిక ద్వారానే వారి సామర్ధ్యాన్ని నిరూపించుకోగలుగుతారని ఆమె నిశ్చితాభిప్రాయం. సామర్ధ్యాల నిరూపణలో స్ర్తి, పురుషులిద్దరూ సమానమేనని అంటారు.
కుటుంబ ప్రోత్సాహం వల్లనే...
కుటుంబ ప్రోత్సాహం వల్లనే తాను ఈ రంగంలో నిలదొక్కుకోగలిగానని చెబుతారు. ఆమెకు ఓ కుమార్తె. విధి నిర్వహణలో యావత్ దేశం తిరిగే ఆమె తన కుమార్తెను నిర్లక్ష్యం చేయలేదు. ఆమెను కూడా తనవలే తీర్చిదిద్దేందుకు కృషిచేస్తోంది. అంతేకాదు మరో అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని ఆమెకు మంచి జీవితాన్ని ఇచ్చేందుకు 42ఏళ్ల సీమారావు సిద్ధమవుతున్నారు.
ఆమెకు ఇష్టమైనవి.. వరించిన అవార్డులు
స్విమ్మింగ్‌ను ఎంజాయ్ చేస్తోంది. గోవా, థాయిలాండ్‌లలో స్కూబా డైవిం గ్ అంటే కూడా మక్కువే. అలాగే హార్రర్ సినిమాలను చూస్తూ ఆనందం పొం దుతుంది. కామెడీ సినిమాలంటే మరీ ఇష్టం. తాత్విక చింతన కూడా అధికమే. ఓషో సాహిత్యాన్ని చదువుతుంది. వయసు ఓ సంఖ్య మాత్రమే. ప్రతికూల ధోరణులను అధిగమించటానికి మాత్రమే ఇది ఉపయోగపడుతోంది అని అం టారు. సైనికులను సమర్థవంతంగా తీర్చిదిద్దుతున్న ఆమె సామర్థ్యానికి గీటురాయిగా వరల్డ్ పీస్ అవా ర్డు, యూఎస్ ప్రెసిడెంట్ అవా ర్డు, వలంటీర సర్వీసు అవార్డులు దక్కాయి.

- ఆశాలత