మెయిన్ ఫీచర్

తేనెలూరే తెలుగు పిలుపులు ఏవీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషుల మధ్య బంధాలు, అనుబంధాలు ఏర్పడటానికి పెంపొందటానికి ఒకరినొకరు పిల్చుకునే పిలుపులు కూడా ఎక్కువగా కారణమవుతాయి. ఒకరితో మరొకరికి ఉండే బాంధవ్యాన్ని తెలియజేస్తాయి. అనురాగాన్ని అభివృద్ధి చేస్తాయి.
పూర్వకాలంలో వరుసలు తెలుసుకుని, వరుసలు కలుపుకుని మరీ సంబోధించుకునేవారు. ఆ పిలుపులలో ఆప్యాయత వెల్లివిరిసేది. అనుబంధం బలపడేది. ‘అమ్మా!’ అని పిల్లలు, తల్లిని పిలవటంలో వుండే ఆనందం, ఆత్మీయత ‘మమీ’ అనే పిలుపులో ఎక్కడిది? ‘నాన్నా’ అనే పిలుపులో ఉన్న దగ్గరితనం ‘డాడీ!’ అనటంలో వినిపించదు. కాని ఈ రోజుల్లో అమ్మా, నాన్నా అని పిలిపించుకోవటం చాలామంది చిన్నతనంగా భావించటం బాధాకరం. ఎవరు ఎంతగా విమర్శించినా కొందరు తల్లిదండ్రులు పట్టించుకోరు. వాళ్ళకు మమీ, డాడీ అంటేనే చెవుల్లో అమృతం పోసినట్లుంటుంది.
ఇక పెద్దమ్మ, పిన్ని, బాబాయి, అమ్మమ్మ, నాన్నమ్మ, బామ్మ, తాతయ్య, అత్తయ్య, మామయ్య, బావ, అక్క, చెల్లి అంటూ పిలుచుకునేవారు రాను రాను తగ్గిపోతున్నారు. ఈకాలం పిల్లలకు చాలామందికి వావివరుసలు తెలియవు. ఆ పిలుపులు, వాటిలోని మాధుర్యం అసలే తెలియదు. అది వాళ్ళ తప్పు కాదు. పెద్దలు చెప్పటం మానేస్తున్నారు.
‘ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట’ అంటూ ఆపదమొక్కులవాడిని కీర్తిస్తూ గానం చేస్తుంటాం. మనం పిలిచే పిలుపులో ఆర్తి, ఆరాధన ఉంటే పిలవగానే పరమాత్మ అయిన మనలను కరుణిస్తాడు అనటంలో సందేహం లేదు. అటువంటిది మానవ మాత్రులమైన మనమెంత? పిలిచే పిలుపును బట్టి మనసులో ఆప్యాయత అంకురిస్తుంది. అభిమానం ఉప్పొంగుతుంది. ఆంటీ అనే పిలుపుకు ‘అత్తయ్యా’ అనే పిలుపుకు ఉన్న తేడాను గుర్తించగలగాలి. సమయం లేదంటూ, పనుల ఒత్తిడి అంటూ మన బంధువులను మనం దూరం చేసుకుంటున్నాం. పిల్లలకు తెలుగు పిలుపులలోని మాధుర్యాన్ని దూరం చేస్తున్నాం. యాంత్రికంగా జీవిస్తూ యంత్రాల్లా మనల్ని మనం మార్చేసుకుని జీవితంలోని అనుబంధాలను వదిలేసుకుని గిరిగీసుకుని బ్రతుకున్నాం. ఇకనైనా మేలుకుందాం. మన పెద్దలు చూపిన మార్గంలోనే పయనిద్దాం. తేనెలూరే తెలుగు పిలుపులను పిల్లలతో పలికించుదాం. మనమూ పలుకుదాం.
.........................................
నేటి పిల్లలకు ఆడవాళ్లందరూ ఆంటీలు, మగవాళ్ళందరూ అంకుల్స్. ఇళ్ళల్లో వృద్ధులు ఉండటం తగ్గిపోతున్నది. అందువలన వాళ్ళను పిలువవలసిన అవసరమే లేదు. ఎవరైనా ఉన్నా, కనపడినా వాళ్ళను కూడా ఆంటీ, అంకుల్ అనే అంటారు. లేదా గ్రాండ్ ఫాదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫా, గ్రానీ అంటూ పిలవటమే ఇప్పుడు ఫ్యాషన్. సాధారణంగా పిల్లలకు పెద్దలు చెప్పినదే వేదవాక్కు. వాళ్ళకు తెలుగు పిలుపులను అలవాటు చేసి అందులోని ఆనందాన్ని తెలియజేయాలి.

- అబ్బరాజు జయలక్ష్మి