మెయిన్ ఫీచర్

సంప్రదాయ శోభకు ‘సిల్క్’ సొగసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంచుమించు తొంభై సంవత్సరాలుగా భారతీయ మహిళ మేనుకు మెత్తగా హత్తుకునే నల్లిసిల్క్స్ వస్త్ర సామ్రాజ్యానికి ఐదవతరం ప్రతినిధిగా లావణ్య నల్లి అడుగుపెట్టారు. అనతికాలంలోనే సిల్క్ వస్త్రాలకు పర్యాయపదంగా నల్లి సిల్క్స్‌ను తీర్చిదిద్దారు. గత కొనే్నళ్లుగా ఆ కుటుంబంలోని మగవారే ఈ వస్త్ర సామ్రాజ్యాన్ని తరతరాలుగా ఏలుతున్నారు. నేడు ముప్పయి రెండేళ్ల అమ్మాయి ఆ సామ్రాజ్యాన్ని ఏలుతూ తన వ్యాపార దక్షతను చాటిచెబుతోంది. ఇంత చిన్న అమ్మాయి ఇంత పెద్ద వస్త్ర వ్యాపారాన్ని ఎన్ని రోజులు చేస్తుందిలే అని అనుకున్నవారి నోళ్లు మూయిస్తూ సరికొత్త ఆలోచనలతో సవాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు లావణ్య నల్లి.
ఏడాదికి వంద మిలియన్ డాలర్ల ఆదాయం
లావణ్య ఈ వస్త్ర వ్యాపారం చేపట్టిన తరువాత ఆదాయం కూడా మరింత పెరిగింది. నేడు దాదాపు సంవత్సర ఆదాయం వంద మిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒకప్పుడు పది పట్టణాలకే పరిమితమైన ఈ నల్లి సిల్క్స్ దుకాణాలు నేడు దేశవ్యాప్తంగా 29 ప్రాంతాల్లో ఉన్నాయి. అంతేకాదు కాలిఫోర్నియా, సింగపూర్ తదితర విదేశాలలో సైతం నల్లిసిల్క్స్ వ్యాపారాన్ని సమర్థవంతంగా లావణ్య నడుపుతున్నారు.

ఈ-కామర్స్ వాణిజ్య విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు.
1928లో తొలి అడుగు
నల్లి సిల్క్స్ తొలి షాపు చెన్నైలో 1928లో ఆమె ముత్తాత ప్రారంభించారు. అప్పటి నుంచి ఎనిమిది దశాబ్దాలుగా సంప్రదాయ భారతీయ వస్త్ర పరిశ్రమలో తన పేరును సార్థకం చేసుకుంటూ ముందుకు సాగుతుంది. తొలుత ఫ్యాబ్రిక్ చీరలతో ప్రారంభమైన ఈ వస్త్రం సామ్రాజ్యం నేడు సిల్క్‌కు పర్యాయపదంగా నిలిచింది. ఆధునిక మహిళ, యువతులు ధరించే అన్నిరకాల దుస్తులకు ఈ దుకాణాలలో లావణ్య చోటుచేసుకల్పించారు. .
ప్యాషన్‌లో మార్పులు
ఫ్యాషన్ ధోరణిలో వచ్చిన మార్పునకు శ్రీకారం చుట్టింది. తమిళనాడు కంచిపురంలోని ప్రావీణ్యమున్న నేత కార్మికులు చేతితో నేసిన పట్టు చీరలను వినూత్నమైన డిజైన్లలోనూ, కంటికింపైన రంగులలో తయారుచేయించి అమ్మకాలు జరపటంలో నల్లిసిల్క్ ప్రత్యేకతగా చెప్పవచ్చు. అయితే వీటి ధరలు సామాన్యులుగా అందుబాటులో ఉండేవి కావు. ఈ ధరలు గురించి ఆమె తండ్రి, తాతలు డైనింగ్ టేబుల్ వద్ద మాట్లాడుకుంటే చిన్నవయసులో ఉన్నపుడే వీటన్నింటినీ లావణ్య శ్రద్ధగా వినేది. వ్యాపారాన్ని, వ్యక్తిగత జీవితాన్ని అనుసంధానించుకుంటూ 2005లో ఈ రంగంలోకి లావణ్య అడుగుపెట్టారు. అపుడు ఆమె వయసు 21 సంవత్సరాలు.
పోటీని తట్టుకునేందుకు..
వారసత్వంగా వస్తున్న వ్యాపార సామ్రాజ్యంలోకి రావటం పోటీని తట్టుకోవాలంటే విభిన్న మార్గాలు అనే్వషించేందుకు అమెరికా వెళ్లి హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ చేసింది. చదువు, వాస్తవ పరిస్థితుల మధ్య తేడా తెలుసుకోవాలంటే అనుభవం తప్పనిసరి. అందుకే రెండేళ్లపాటు చికాగోలో ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసింది. ఇండియాకు తిరిగివచ్చి ఒక ఏడాది పాటు ఆన్‌లైన్ ఫ్యాషన్ రిటైల్ రంగంలో పనిచేసింది. తిరిగి 2015లో నల్లి వస్తవ్య్రాపార రంగంలోకి అడుగుపెట్టింది. దీనికి కుటుంబ ప్రోత్సాహం తోడవ్వటంతో అనతికాలంలో లావణ్య వ్యాపారరంగంలో నిలదొక్కుకోగలిగింది. ఆధునిక మహిళ ఆలోచనలకు అనుగుణంగా చీరల డిజైన్లలో మార్పులు తీసుకు వస్తోంది. జీన్స్, టీ షర్ట్స్ ధరించే ఆధునిక యువతులు కోరుకునే డైజైన్లలో చీరలను ప్రత్యేకంగా తీసుకురావటంలో కృషిచేస్తోంది. చీరలతోపాటు కుర్తీలు, సల్వార్ కమీజ్‌లు తదితరవాటిని కూడా ఆధునిక డిజైన్లలో రూపొందిస్తూ మార్కెట్లోకి తీసుకువస్తోంది.
ప్రతిరోజూను ఓ సవాల్‌గా స్వీకరిస్తూ కోట్ల రూపాయల పెట్టుబడిని పెంచుకుంటూ పోవాలంటే ఏమాత్రం తడబాటు లేకుండా సాగుతుంది. ఇలాంటి సమయంలో కుటుంబ ప్రోత్సహంతో వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ పెళ్లిళ్లు, ఇతర వేడుకలకు తన కుటుంబం తనకిచ్చిన నల్లి బ్రాండ్‌ను కాపాడుకుంటూ లావణ్య సాగుతున్నారు.

-లత