మెయిన్ ఫీచర్

పిల్లల్లో ఆ సరదాలేవి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూనీగల్లా ఎగురుతూ తుళ్లింతలు, కేరింతలతో ఆనందంగా ఆహ్లాదంగా గడిచేది బాల్యం. ఆటపాటలకి అసలుసిసలైన వయసు పసిప్రాయం. మారిన సమాజంలో చదువుల్లో ఒత్తిడి పెరిగింది. సినిమాలు, టీవీ ప్రభావం, తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పు పిల్లల ఆలోచనా విధానంలోనూ కనబడుతోంది. శారీరక దృఢత్వానికి, వ్యాయామానికి వలసిన ఆటకు అవరోధం కలుగుతుంది. ఆ తరం పిల్లలు సాంస్కృతిక వికాసానికి, శారీరక పుష్టికి, మనోవికాసానికి కావాల్సిన ఆటలు, లలిత కళలు, వినోదాల పట్ల శ్రద్ధచూపేవారు.
ఇళ్ళల్లో పండుగొచ్చినా, ఏ ఉత్సవం వేడుకలొచ్చినా ఆ తరం పిల్లలు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. భోగి, దీపావళి, దసరా పండగలొస్తే.. పిల్లలున్న ప్రతి ఇంటా సందడే. దీపావళికి తారాజువ్వలు, బాంబుల తయారీల్లో నిమగ్నమయ్యేవారు ఈ సిసింద్రీలు. భోగి పండుగవస్తే భోగిమంటల్లో చలి కాగుదామని ఉవ్విళ్లూరేవారు. ఇపుడు పిల్లలు ఉదయం లేవడమే కష్టం. దసరా పండుగకు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు రకరకాల వేషాలతో, బాణాలతో పూలను రువ్వుకోవడం ఒక ముచ్చట. పప్పుబెల్లాలు పంచుకోవడం ఒక వేడుక.
సమోసాలు, నూడిల్స్, చాట్, పానీపూరీ, దిల్‌పసంద్‌లు, కేక్‌లు వంటి బయట దొరికే తినుబండారాలను పిచ్చిగా ఇష్టపడి తినే ఈ తరం పిల్లలకు ప్రతి పండుగకు వివిధ రకాలుగా వండి వడ్డించే చవులూరించే పిండివంటల రుచులు తెలియవు. ఆరోగ్యకరమైన ఈ వంటలను వండిపెట్టే ఓపిక కూడా చాలామంది తల్లులకు ఇపుడు ఉన్నట్టు లేదు.
వేళ్లమీద లెక్కించే కుటుంబాల్లో తప్పిస్తే పిల్లల్లో సాంస్కృతిక వికాసాన్ని పెంచే శ్రద్ధ తల్లిదండ్రుల్లో లేదు. పూర్వం మాట తీరు, కట్టుబొట్టు, వస్తధ్రారణ లాంటి ప్రతి విషయంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లలను హెచ్చరించేవారు. ఇప్పటి తరం పిల్లలకు పండుగలకుండే ప్రాధాన్యతగాని, వాటి విలువగాని తెలియదు, తెలుసుకునే ఆసక్తి లేదు. ఎప్పుడూ పిల్లలకు ఏ ఏ సబ్జెక్టులలో ఎన్ని మార్కులు వచ్చాయి అన్న యావ తప్ప మంచిమాట, మంచితీరు, సంస్కృతి సంప్రదాయాలు, నైతిక విలువల గురించి చెప్పే తల్లిదండ్రుల సంఖ్య అత్యల్పం.
ఆధునికీకరణ పేరుతో విద్యావిధానం, విద్యా సంస్థల మధ్య వ్యాపారపరమైన పోటీతత్వం కారణంగా విద్యార్థులు సాధించే ర్యాంకులే ప్రధానమంటూ మూర్తిమత్వ వికాసానికి దోహదపడే నైతిక విద్యను బోధించడంలో పాఠశాలలు విఫలవౌతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ తరగతి గదిలో బంధించి నిర్బంధ విద్యను బోధించే విధంగా చదువులు చెప్పే కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలకు శారీరక వ్యాయామం కొరకు, మానసిక ఆహ్లాదం కొరకు ఉద్దేశించిన ఆటలకు, క్రీడలకు స్థానమే లేదు. ఆశ్చర్యకరమైన విషయమేమిటటే వేలాది రూపాయలు ఫీజులు గుంజే చాలా కార్పొరేట్ స్కూళ్ళలో విద్యార్థులకు కనీస వైశాల్యంలో ఆటస్థలం కూడా లేకపోవడం చూస్తున్నాం.
తల్లిదండ్రులు కార్పొరేట్ పాఠశాలల్లో ఈ స్థితిగతుల గురించి ఆలోచించరు. గ్రాహ్యశక్తి అధికంగా వుండే పిన్న వయస్సులో పిల్లలపై నైతిక వర్తన, క్రమశిక్షణ పడే ముద్ర జీవితకాల ప్రభావం చూపుతుంది అన్న వాస్తవం గ్రహించరు. కార్పొరేట్ స్కూళ్ళకు అనుమతులిచ్చేటప్పుడు మంచి ప్రశాంతమైన వాతావరణం, మంచి వసతులు, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉండాలనే ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి ప్రభుత్వ అనుమతుల్ని చాలా కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు పొందుతున్నాయి. ఇటువంటివాటిపై ప్రభుత్వ పర్యవేక్షణ ఎంత మాత్రం లేదని, ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్ల తనిఖీ కేవ లం మొక్కుబడిగానే జరుగుతుందని మేధావులు, విద్యావేత్తలు ఎంతగా వాపోతున్నా మార్పు రావడంలేదు. తల్లిదండ్రులు కేవలం పిల్లల మార్కుల విషయంలో విద్యాసంస్థల యాజమాన్యాల్ని ప్రశ్నిస్తున్నారు గాని, విద్యా సంస్థలలో వసతులుగాని, క్రీడలు, సాంస్కృతిక వికాసానికి దోహదపడే నైతిక విద్యాబోధన లేకపోవడంపై ప్రశ్నించడంలేదు. దీని కారణంగా పిల్లలు చదువుల్ని ఎలాగోలా గట్టెక్కిస్తున్నా నైతిక వర్తన మానసిక పరిణతివాళ్లలో పెరగడం లేదన్నది వాస్తవం. మేధావులు, తల్లిదండ్రులు శాస్త్ర సాంకేతిక విద్యలతోపాటు మానసిక వికాసానికి దోహదపడే నైతిక విద్య, క్రీడలు, ఒత్తిడిలేని విద్యా విధానం కోరుకోవాలి. కార్పొరేట్ స్కూళ్ల యాజమాన్యాలు వ్యాపార దృక్పథం సడలించుకుని నైతిక విద్యాబోధనకు కూడా ప్రాధాన్యతనివ్వాలి. జాతీయ ఆదాయంలో అధికంగా నిధులు విద్యాభివృద్ధికి ఖర్చుచేస్తున్న ప్రభుత్వాలు మంచి పౌర సమాజ నిర్మాణం కోసం నైతిక విద్యాబోధనపై దృష్టిపెట్టడం ఎంతైనా అవసరం. మంచి వ్యక్తిత్వం, నైతిక వర్తన, మానసిక పరిణతి వున్నవారికి విద్య సంపూర్ణంగా రాణిస్తుంది. అటువంటి విద్య సత్ఫలితాలనిస్తుంది.

.....................................
టెక్నోస్కూళ్లు, మోడ్రన్ కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలను పరిశీలిస్తే సెల్‌ఫోన్‌లో గేమ్‌లు, మెసేజ్‌లు, టీవీల్లో వెకిలి హాస్యం, వెగటుపుట్టించే కార్యక్రమాలు చూడటం తప్ప పదిమందితోకలిసి పండుగలు, వేడుకలు జరుపుకోవడంలో పొందే సంతోషం, ఆనందోత్సాహాలు, సంస్కృతి, సంప్రదాయం గురించి తెలియదు. తల్లిదండ్రులు కూడా వాళ్ళకు తెలియజేసే తీరిక లేదు. ఎప్పుడు పండగ వస్తుందా! రకరకాల పిండి వంటలు, కమ్మనైన రుచుల్ని అమ్మ ఎపుడు వడ్డించి పెడుతుందా! అని అప్పటి పిల్లలు ఎదురుచూసేవారు.
..........................
ఉదయం నుంచి సాయంత్రం వరకూ తరగతి గదిలో బంధించి నిర్బంధ విద్యను బోధించే విధంగా చదువులు చెప్పే కార్పొరేట్ పాఠశాలల్లో పిల్లలకు శారీరక వ్యాయామం కొరకు, మానసిక ఆహ్లాదం కొరకు ఉద్దేశించిన ఆటలకు,
క్రీడలకు స్థానమే లేదు.
......................

- రాజ్‌కుమార్