మెయిన్ ఫీచర్

హృదయం పదిలం... అతివల్లోనే అధిక గుండె సంబంధ వ్యాధులు ( నేడు వరల్డ్ హార్ట్ డే)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమ్మలేని నిజాలు

- గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా 30-45 ఏళ్ల వయసు ఉన్నవారిలో సంభవిస్తున్నాయి.
- గృహిణుల్లో 69శాతం, ఉద్యోగినుల్లో 67శాతం మందికి వ్యాధులు సంభవిస్తున్నాయి.
- 8 నుంచి 10 మందిలో కొలెస్ట్రాల్ వల్ల, 3 నుంచి 4 మంది మహిళల్లో అధిక బరువు వల్ల వ్యాధులు దరిచేరుతున్నాయి. - 90 శాతం మందికి పొగతాగటం వల్ల, 97 శాతం మందికి డయాబెటీస్ వల్ల గుండె జబ్బులు వస్తున్నాయి.

‘‘హృదయం ఎక్కడున్నది..నీ చుట్టూనే తిరుగుతున్నది..’’ అనే పాట యువతుల మనస్సుల్లో గిలిగింతలు పెట్టవచ్చేమోకానీ నేటి ఆధునిక జీవన పరిస్థితులు మాత్రం మూడు పదులు వయసు దాటిన యువతుల్లోనే అధిక గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయని సరికొత్త అధ్యయనాలు వెల్లడించే చేదు నిజాలు. ఆధునిక కాలంలో మనం ఎంచుకున్న జీవన విధానమే మనల్ని అనారోగ్యం పాల్జేస్తోంది. మన ఆలోచనా విధానం సవ్యంగా వెళుతుంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవు. మనసుకు, హృదయానికి ఉన్న అవినావభావ సంబంధం దృష్ట్యా విశాలమైన హృదయంతో చేసే ఆలోచనలు శారీరక రుగ్మతలను నుంచి ఇట్టే బయటపడవచ్చని మానసిక వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మానసిక భావోద్వేగాలకు గురైనపుడు విడుదలయ్యే కొన్నిరకాల గ్రంథులు, హార్మోన్ల వల్ల రకరకాల గుండె సంబంధ వ్యాధులు సంభవిస్తున్నాయి. మానసిక భావోద్వేగాలు మహిళల్లోనే ఎక్కువగా ఉంటాయి. అందువల్లనేమో గుండె సంబంధిత వ్యాధుల వల్ల మహిళల్లో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏటా 17.3 మిలియన్ల మంది గుండె సంబంధ వ్యాధుల వల్ల మృతిచెందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తుండగా.. ఇందులో 3.7 మిలియన్ల మంది మహిళలే ఉండటం గమనార్హం.
వ్యసనాలకు బానిసలు
జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల ఆధునిక యువతులు పొగ, ఆల్కాహాలు తదితర వ్యసనాలకు బానిసలవుతున్నారు. అధికంగా బరువు పెరగటం, మానసిక భావోద్వేగాలు గుండెపోటుకు దారితీస్తున్నాయి. దీనికితోడు శరీరంలో కొవ్వుశాతం పెరగటం, అలాగే ఈనాటికీ గ్రామీణ ప్రాంతాలలో కట్టెల పొయ్యిల మీద
వంటలు చేస్తుండటం వల్ల పొగ లోనికి వెళ్లి మహిళలు ప్రాణాలు విడుస్తున్నారు. మనం నివశించే పరిసరాలను ఆరోగ్యంగా తీర్చిదిద్దుకున్నట్లయితే.. అంటే పొగతాగేవారికి దూరంగా వెళ్లటం, పోషకవిలువలున్న ఆహారాన్ని తీసుకుంటే మహిళలు గుండె సంబంధ రోగాల నుంచి బయటపడవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడిస్తోంది. 2025 నుంచి మహిళల్లో గుండె సంబంధ వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలను 25శాతానికి తగ్గించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించుకుంది.
పది సూత్రాలు పాటిస్తే పదిలం..
ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో మార్పులు చేసుకుంటూ కొద్దిపాటి ఆరోగ్య సూత్రాలు పాటిస్తే చాలు మీ ఆరోగ్యం పదిలమంటున్నారు న్యూట్రీషియన్లు. అవేమిటో తెలుసుకుందాం..
వెన్న శాతం తక్కువగా ఉండే పాలు ప్రతిరోజూ తీసుకోవాలి.
తాజా రంగుల్లో ఉండే కాయగూరలు, పండ్లు తినాలి. పప్పు్ధన్యాలు, చిక్కుళ్లను తప్పనిసరిగా ఆహారంలో తీసుకోవాలి.
క్రమం తప్పకుండా బరువును చూసుకుంటూ ఉండాలి. అలాగే రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధులు ఉంటే వెంటనే వాటి నుంచి బయటపడాలి. అలాగే ఆహారం తీసుకున్నపుడు తగుమాత్రమే తీసుకోవాలి. దొరికింది కదా అనే ఆబగా తినేయ్యకూడదు. ఆహారంలో తక్కువ క్యాలరీలు, ఎక్కువ పోషకాలు ఉండేటట్లు చూసుకోవాలి.
బేకరీకి సంబంధించిన పదార్థాలను తినవద్దు. ఉడకబెట్టిన ఆహారపదార్థాలను తింటే ఎంతో మంచిది.
ఆహారపదార్థాలలో ఫైబర్ పోకుండా తినెయ్యాలి. క్యారెట్, కీరదోసకాయ, యాపిల్ వంటి పండ్లను తొక్కతో తినేస్తే ఎంతో మేలు. నాలుగు పదులు వయసు దాటిన వారిలో ఆలోచన, ఆందోళనలో మార్పు వస్తుందు కాబట్టి తప్పనిసరిగా గుండెకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి.
చేటు తెచ్చే చెక్కరను దూరంగా ఉంచటం ఎంతైనా మంచిది. శీతలపానియాలను దరిచేరనివ్వ వద్దు. చాక్లెట్స్, కేక్స్, కుకీస్ వంటి తినవద్దు.ఆహారం మధ్యలో సీట్లు అసలు తినవద్దు.
సోడియం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది. ఆహార పదార్థాలలో తక్కువ ఉప్పు వాడండి. చిప్స్ వంటివాటిని అలవాటు చేసుకోవద్దు.
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు ఎక్కువ సేపు అవుట్‌డోర్ వ్యాయామం చేయవద్దు. ఐదు పదులుదాటిన వారు నడకను వ్యాయామంగా చేస్తే సరిపోతుంది.