మెయిన్ ఫీచర్

అల్లికల సోయగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫ్యాషన్ ప్రపంచంలో బంజారా డిజైన్ల వరద

సహజ రంగులతో క్లాటన్ క్లాత్‌పై కనికట్టు

లంబాడీ గిరిజన దుస్తులు లండన్ ఫ్యాషన్ షోలలో అలరిస్తున్నాయి. పండుగలు, పబ్బాలకు మాత్రమే మనం ప్యాచ్ వర్క్ చేసిన దుస్తులు ధరిస్తాం. కాని లంబాడీ గిరిజనల సంప్రదాయ వస్త్రాలలో కుట్లు, అల్లికలు అనేవి సర్వసాధారణం. వీరు ధరించే దుస్తులలో41 కుట్టు నమూనాలు దర్శనమిస్తాయంటే అతిశయోక్తి కాదు. అద్దాలు, అల్లికలతో పాటు చక్కటి డిజైన్లలో కనువిందు చేసే ఎంబ్రాయిడరీ వర్క్ వారి పనితనానికి నిదర్శనం. ఇపుడు ఇవే ఆధునిక ఫ్యాషన్‌గా మారి ఫ్యాషన్ ప్రపంచంలో తుఫాను వలే దూసుకువస్తున్నాయి. కనువిందు చేస్తున్నాయి. కర్నాటకలోని సందూర్ గ్రామ మహిళల చేతుల్లో అల్లికలతో డిజైన్ చేస్తున్న వస్త్రాలు ఎల్లలు దాటి చైనా, స్విట్జర్లాండ్, బార్సిలోనా, అమెరికా, స్వీడన్ తదితర దేశాలలో విరివిరిగా అమ్ముడుపోతున్నాయి.
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సందూర్ కుగ్రామం. లంబాడీలు ఎక్కువగా నివశించే ఈ పల్లె నేడు ఫ్యాషన్ వినువీధులలో మారుమ్రోగుతుంది. ప్రతిరోజూ ఉదయానే గ్రామ నడిబొడ్డున లంబాడీ మహిళలు గుమిగూడతారు. రంగు రంగు వస్త్రాలపై వీరంతా సూదులతో అలవోకగా అద్దాలు, గవ్వలు, పది పైసల నాణాలను అందంగా కుట్టేస్తుంటారు. అంతేకాదు రంగు రంగు దారాలతో ఎంబ్రాయిడరీ వర్క్ చేస్తుంటారు. వీరి చేతుల్లో అందమైన హ్యంగింగ్స్, కుర్తాలు, చీరలు, కుషన్ కవర్లు, దుప్పట్టాలు రూపుదిద్దుకుంటాయి. ఇవి బెంగళూరు వంటి నగరాలలో యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. సంప్రదాయ అందాలను సంతరించుకున్న ఈ దుస్తులు నేడు లండన్ ఫ్యాషన్ షోలో సైతం ప్రదర్శనకు నోచుకుని ఆహుతులను అబ్బురపరిచాయి.
ముసలి అవ్వ గైడ్
విభిన్న డిజైన్లలో దుస్తులను మలిచే ఈ గిరిజన మహిళలందరినీ 85 సంవత్సరాల తిప్పవ్వ అనే వృద్ధ డిజైనర్ గైడ్ చేస్తుందంటే ఆశ్చర్యం వేయకమానదు. ఆ గ్రామంలో పెద్ద వయసున్న వృద్ధురాలు కూడా ఈమె. ఈమె తల్లి, అమ్మమ్మ కూడా ఇలా డిజైన్ వర్క్ చేసేవారు. ఇలా వంశపారంపర్యంగా వస్తున్న ఈ కళను తిప్పవ్వ కూడా వదిలివేయకుండా అక్కడ గిరిజన మహిళలకు నేర్పిస్తుంది. ఒకప్పుడు ఈ దుస్తులు గిరిజన లంబాడీ మహిళలే వాడేవారు. నేడు తిప్పవ్వ హయాం వచ్చేసరికి ఇది అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించే స్థాయికి చేరుకోవటం విశేషం. ముఖానికి రెండు వైపులా జుత్తు చివరిలో వెండితో తయారుచేసిన జుమ్కాలను వేలాడదీసుకునే వీరు తాము ధరించే లెహంగాలు, చోలీలు కూడా ఇలాగే క్రాఫ్ట్ ఆభరణాలతో కుట్టుకుంటారు. ఇది వారి సంప్రదాయ వస్తధ్రారణ.
కుశాల కళా కేంద్రం ఆధ్వర్యంలో..
ఈమహిళల చేత కళను గుర్తించిన సందూర్ మహారాజు ఘార్పెడ్ 1984లో కుశాల కళా కేంద్రాన్ని ఏర్పాటుచేసి వీరు డిజైన్ చేసిన వస్త్రాలకు మార్కెటింగ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఇక్కడ తయారైన వస్త్రాలు గత రెండు దశాబ్దాలుగా ఢిల్లీ, కోల్‌కతా, ముంబయి, చెన్నై తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేసి అమ్ముతుంటారు. ఒకప్పుడు ఈ కళా కేంద్రంలో పదులు సంఖ్యలోనే మహిళలు పనిచేసేవారు. నేడు 400 మంది మహిళలు పనిచేస్తున్నారు. వీరి చేతిలో 41 రకాల కుట్లతో తయారుచేసిన వస్త్రాలు రూపుదిద్దుకుంటాయి.
సహజ రంగులు, కసూతి ఎంబ్రాయిడరీ వర్క్ వీరి ప్రత్యేకత
వస్త్రాలే కాదు కీచెయిన్లు, కంఠాభరణాలను కూడా చేస్తుంటారు. కీచెయిన్ రూ.60ల నుంచి అమ్ముతారు. చీర ఖరీదు రూ.4000ల వరకు ఉంటుంది. కసూతి అనే ఎంబ్రాయిడరీ వర్క్ ఈ చీరల ప్రత్యకత. సహజ సిద్ధమైన రంగుల్లో కాటన్ క్లాత్‌పై వేసే కసూతి ఎంబ్రాయిడరీ వర్క్‌కు ఎంతో ఆదరణ ఉంది. పసుపు రంగును దానిమ్మ పీల్స్ నుంచి, ఎరుపు రంగును రతన్ జోత్ పువ్వులు నుంచి, కాకీ రంగును సప్పన్ వృక్షం నుంచి సేకరిస్తారు. ఇలా సహజసిద్ధమైన రంగులతో తయారుచేసిన వస్త్రం అంచును పది పైసల బిల్లలతో డిజైన్ చేస్తారు. అందంగా..ఆకర్షణీయంగా రూపుదిద్దుకున్న ఈ వస్త్రాలు వీరి శ్రమైక సౌందర్యానికి నిదర్శనంగా నిలుస్తాయి.
*

నేషనల్ అవార్డు విజేత గౌరీబాయి
లంబాడీ వస్త్రాల డిజైనర్ అని చెప్పవచ్చు. ఏభై ఏళ్ల గౌరీబాయి ఎనిమిదేళ్ల క్రితమే లండన్ ఫ్యాషన్ షోలో పాల్గొన్నది. ఇపుడు బెంగుళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్మాలజీ విద్యార్థులకు లంబాడి దుస్తుల డిజైన్లకు సంబంధించిన పాఠాలు చెబుతుంది. అంతేకాదు హస్తకళాల విభాగంలో మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా నేషనల్ అవార్డు పొందిన గిరిజన యువతి.

-జి.కల్యాణి