మెయిన్ ఫీచర్

బ్లేడ్ రన్నర్..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె ధైర్యం ఆమె సొంతం.. కాళ్లు లేకున్నా పరుగు ప్రాక్టీస్
పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్ష

నాకు తెలుసు నేను సొంతంగా చిన్న పని కూడా చేయలేనని. అయితే ఆత్మవిశ్వాసం, కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే ఎవరైనా అద్భుతాలు సృష్టించగలరు. అందుకు తానే ప్రత్యక్ష నిదర్శనమని చెబుతారు షాలిని
సరస్వతి.

‘‘ఆత్మవిశ్వాసం నాలో దండిగా ఉంది.. భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు చేయగలను. నాకు కావల్సింది మీ మద్దతు మాత్రమే. మద్దతు ఇచ్చే సత్తా మీకుందా’’ అని ప్రశ్నిస్తున్నారు బెంగుళూరుకు చెందిన షాలిని సరస్వతి. పగవారికి సహితం అటువంటి జబ్బు రాకూడదని కోరుకునేంత భయంకరమైనది ఆమెకు వచ్చిన జబ్బు. దీనివల్ల ఆమె రెండు చేతులు (మణికట్టుపైవరకు), రెండు కాళ్ళు (గిలకల పైభాగం వరకు) పోగొట్టుకుంది. అయినప్పటికీ ఆమె గత మేలో బెంగుళూరులో జరిగిన 10కె మారథాన్‌లో పాల్గొని అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. 2020లో జరిగే పారా ఒలింపిక్స్‌లో మన దేశానికి పతకం తీసుకురావాలనే ఆశ, ఆకాంక్షతో నడక ప్రాక్టీస్ చేస్తున్నది.
2012 వరకు ఆమె జీవితం వడ్డించిన విస్తరి అని చెప్పవచ్చు. మంచి ఉద్యోగం, వివాహంతో ఆనందంగా జీవితం గడుపుతున్నది. 2012లో కంబోడియా నుంచి బెంగుళూరుకు తిరిగివచ్చింది. అదే సమయంలో తల్లి కాబోతున్నట్లు వైద్యులు తెల్పడంతో ఆనందానికి అవధులు లేవు. ఈ నేపథ్యంలో ఆమెకు హఠాత్తుగా జ్వరం వచ్చింది. ప్లేట్‌లెట్స్ తగ్గిపోవటం ప్రారంభం అయింది. అనంతరం షాలినీ కోమాలోకి వెళ్లిపోయారు. ఆరు రోజుల తరువాత కోమానుంచి బయటకు వచ్చా రు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆమెకు గర్భస్రావం అయింది. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ వలన వచ్చిన గాంగ్రీన్ కారణంగా ఎడమ చేయి మణికట్టు పైభాగం వరకు తొలగించారు. దీంతో, ఒక రోజు మొత్తం ఏడ్చాను. అయినప్పటికీ బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా ఏర్పడిన గాంగ్రీన్‌లు మాత్రం తనను వదలలేదని చెబుతారు షాలిని. ఆమె నెలలు హాస్పిటల్‌లో పడకకనే పరిమితం అయ్యారు. హాస్పిటల్‌నుండి ఇంటికి వచ్చిన తరువాత గాంగ్రీన్ కారణంగా కుడి చేయి (మణికట్టు పైభాగం వరకు) ఊడిపోయింది. అనంతరం గాంగ్రీన్ వలన రెండు కాళ్ళు గిలకల పైభాగం వరకు తొలగించారు. దీంతో బాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ నుంచి విముక్తి పొందటానికి ఆయుర్వేదం వైద్య సహాయం తీసుకొన్నారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ శరీరం మొత్తం వ్యాపించకుండా చేయడంలో ఆయుర్వేదం బాగా ఉపయోగపడింది.
తన బ్లాగ్ ద్వారా ఆమె తన గురించి తెలియచేయడమే కాకుండా, వైకల్యం కారణంగా కృంగిపోతున్నవారిలో ఆత్మవిశ్వాసం పెం పొందించడానికి కృషి చేస్తున్నారు. తాను చాలా విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నానని చెబుతారు ఆమె. ‘‘నేను ఎవరి సహాయం లేకుండా కనీసం బ్రష్ కూడా చేసుకోలేను. అయితే ఎవరి సహాయం లేకుండా మాత్రం పరిగెత్తగలనని’’ షాలిని చెబుతారు. ఆమె ప్రస్తుతం ఒక ఐ.టి కంపెనీలో డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా వచ్చిన వైకల్యంతో ఆమె కృంగిపోలేదు. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, వినూత్నంగా ఏదైనా సాధించాలనే తపనతో కార్బన్ ఫైబర్ రన్నింగ్ బ్లేడ్‌ను ఉపయోగించి మెల్లగా నడవడం ప్రారంభించింది. ప్రస్తుతం కార్బన్ ఫైబర్ రన్నింగ్ బ్లేడ్‌ల సహాయంతో పరిగెత్తగలుగుతుంది. 2020లో జరిగే పారా ఒలింపిక్స్‌లో జరిగే మారథాన్ పోటీలలో పాల్గొని, పతకం సాధించాలని ఆమె సన్నాహాలు చేస్తున్నది. షాలిని సరస్వతి పారా ఒలింపిక్స్‌లో పతకం సాధించాలని ఆకాంక్షిద్దాం.