మెయిన్ ఫీచర్

ఒక్క ఐడియా జీవితానే్ తీర్చిదిద్దింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి లేని విలువ అతను సృష్టించిన డబ్బుకు ఉంది. జీవితం సాఫీగా సాగాలంటే డబ్బు కావాలి మరి. 33 ఏళ్ళ నందిని డబ్బుల్లేక ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంది. గత ఏడాదివరకు రెండు పూటలా భోజనం దొరికితే చాలనుకుంది. చిన్నప్పుడు పేదరికంలో మగ్గిపోయింది. డాక్టర్ కావాలని కలలు కనేది. అయితే డబ్బులు లేకపోవడంతో పదో తరగతిలోనే చదువును ఆపేయాల్సి వచ్చింది. అలాంటి నందిని జీవితాన్ని ఊబర్ కంపెనీ మార్చేసింది.
ఆలయ పూజారి కూతురుగా అంతంత మాత్రమే ఆదాయం..
బెంగుళూరు సమీపంలోని ఒక చిన్న గ్రామంలో పెరిగిన నందిని తండ్రి చిన్న ఆలయంలో పూజారిగా పనిచేసేవాడు. చాలీ చాలని ఆదాయం. అందుకే పదో తరగతి తర్వాత స్కూల్ మాన్పించేసి పెళ్లి చేసేశారు. కొన్నాళ్లు గృహిణిగా ఉండిపోయింది. భర్త శ్రీశాంత్ శాస్ర్తీ కూడా పూజారిగానే పనిచేసేవారు. వచ్చిన ఆదాయం తిండికి మాత్రమే సరిపోయేది. అందుకే చిన్నా చితకా పనులు చేసేది సగటు ఇల్లాలిగానే ఉంటూ వ్యాపార ప్రయత్నాలు ఆరంభించింది. చిన్న చిన్న వ్యాపారాలతో ప్రారంభమైన నందిని ప్రస్థానం ట్రావెల్ ఏజెన్సీ స్థాయకి చేరుకుంది. పెయింటింగ్, హోమ్ ఇంటీరియర్ పనులు చేసేది. అప్పుడే పాప పుట్టింది. కొన్నాళ్లకు నందిని తండ్రి మరణించటంతో చెల్లెలి బాధ్యత ఆమెపై పడింది. చెల్లెలి చదువు, పెళ్లి కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.
ఊబర్ దోస్త్
ఊబర్ దోస్త్ గురించి 2015లో నందినికి తెలిసింది. అందులో చేరి డ్రైవర్లను రిఫర్ చేస్తే డబ్బులొస్తాయని స్నేహితులు చెప్పారు. ఊబర్ రిఫరెల్ ప్రోగ్రాంకు తెలిసిన డ్రైవర్‌ను జస్ట్ రిఫర్ చేస్తే చాలు. అతను ఊబర్ తరఫురన కొన్ని ట్రిప్స్ వేస్తే మనకు 3 వేల రూపాయలు వస్తాయి. ఈ స్కీం హైదరాబాద్‌లో కూడా ఉంది. సొంతకారు ఉన్నవారు ఊబర్‌లో పార్ట్ టైం డ్రైవర్స్‌గా చేరవచ్చు. ఇదేదో బాగానే ఉందనిపించింది నందినికి.
600 మంది డ్రైవర్లకు ఉపాధి
ఊబర్‌లో చేరాక కాలం కలిసి వచ్చింది. తెలిసిన డ్రైవర్లను ఊబర్‌లో చేర్చింది. డ్రైవర్ జాబ్ కావాలా అంటూ.. సిటీలో పోస్టర్లు అంటించింది. తర్వా త ఫుల్ టైం డ్రైవర్స్ రిఫర్ చేసే కార్యక్రమం చేపట్టింది. నందిని పడ్డ కష్టం ఫలించింది.
ఇప్పటివరకు 600 మంది డ్రైవర్లను రిఫర్ చేసింది. బెంగుళూరులో చిన్న ఆఫీసు ఏర్పాటుచేసుకుంది. తనకు సహాయకులుగా నలుగురు ఉద్యోగులను నియమించుకుంది. అడ్మినిస్ట్రేషన్, ఫీల్డ్ వర్క్‌లో వారు సాయం చేస్తుంటారు. ఇప్పుడు నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. అప్పులన్నీ తీర్చేసి బెంగళూరులో సొంత ఇల్లు కట్టుకుంది. తన కుమార్తెను ప్రఖ్యాత ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదివిస్తోంది.
భర్త సహకారంతో
భర్త సహకారంవల్లే తానిప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని చెబుతోంది నందిని. కష్టాల్లో ఉన్నప్పుడల్లా భర్త సహకరించేవారని చెస్తోంది. ‘నేనున్న ఫీల్డ్‌లో చాలామంది అబ్బాయిలతో మాట్లాడాలి. వారితోనే కలిసి పనిచేయాలి. నా భర్త ఎప్పుడూ ఒక్కమాట కూడా అనలేదు. అందుకే నేను పూర్తిగా పనిమీద ధ్యాస పెట్టగలిగాను.
మా అమ్మ నాతోనే ఉంటూ నా కుమార్తెను చూసుకుంటుంది. అదే నా విజయ రహస్యం, అంటారామె. ఊబర్ సిఈఓ ట్రావిస్ కలానిక్‌ను ఎప్పుడో ఒకరోజు కలుస్తాననేది నందిని డ్రీమ్. వ్యాపారాన్ని ప్రారంభించాలంటే చదువే అవసరం లేదని.. ధైర్యం, సహనం ఉంటే చాలు.. మహిళలు ఏ రంగంలోనైనా దూసుకుపోవచ్చంటోంది నందిని.