మెయిన్ ఫీచర్

వాడిన పువ్వే వికసించెనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* చదువు రాకపోయినా ఆరు భాషల్లో పట్టు * రూ. 20 వేలతో పూల వ్యాపారం మొదలు
* ఇప్పుడు ఏటా 70 కోట్ల టర్నోవర్‌* బెంగళూరులో బోధన్ వ్యక్తి విజయగాథ

అతడు పూలనే నమ్ముకున్నాడు.. వాటినే అమ్ముతున్నాడు..
పరిమళాలు వెదజల్లుతూ విచ్చుకునే పుష్పాలను చూస్తే అతడి మోముకూడా వికసిస్తుంది. చదువుపెద్దగా లేదు. కానీ ఆరుభాషల్లో చక్కగా మాట్లాడగలడు. ఒకప్పుడు పూదోటలో వెయ్యిరూపాయలకు పనిచేసిన ఆ వ్యక్తి ఇప్పుడు 300 మందికి ఉపాథి చూపిస్తు రూ.70 కోట్ల టర్నోవర్ సాధిస్తున్నాడు. ఆ పూలరంగడు మన బోధన్‌కు చెందిన శ్రీకాంత్. బెంగళూరులో పూదోటను పెంచి జీవితాన్ని పరిమళభరితం చేసుకున్న అతడి కథ ఎందరికో స్ఫూర్తినిస్తోంది.
చలాకీ చామంతులు, గుబాళించే గులాబీలు, మైమరపించే మందారాలు.. ఇలా రకరకాల పువ్వులు అతను పెంచిన తోటలో రెక్కలు విప్పుకుంటాయి. పరిమళాలు వెదజల్లుతాయి. వాటిని చూస్తే అతని కళ్లల్లో వెలుగులు విరబూస్తాయి. మగువ సిగకే కాదు పెళ్లి, పేరంటం వేడుకేదైనా అతను అందించే పూలు, పూలదండలు రావాల్సిందే. అక్షరజ్ఞానం లేకపోయినా అనర్గళంగా ఆరు భాషలు మాట్లాడగల సామర్ధ్యం నలభై ఏళ్ల శ్రీకాంత్ సొంతం. ఒకప్పుడు పూల మొక్కలు సాగుచేసే ఫామ్‌లో వెయ్యి రూపాయల వేతనానికి పనిచేసేవాడు. అపుడు అతని వయసు పదహారేళ్లు. పెరిగిన వయసుతో సంపాదించిన అనుభవంతో నేడు పూలతోటల పెంపకం, ఈ వ్యాపారంలో దేశంలోనే అత్యధిక టర్నోవర్ సాధించే వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచాడు.
పొట్టచేతబట్టుకుని..
బెంగళూరులో పనిచేస్తున్నాడంటే ఏ సాఫ్ట్‌వేర్ ఇంజనీరో అనుకుంటాం. కాదుకాదు.. వ్యవసాయం చేస్తున్నాడంటే అక్కడ కు వెళ్లి పొలం పనులు చేసుకుంటున్నాడా? అని పెదవి విరు స్తాం. కానీ అలాంటివారికి శ్రీకాంత్ విజయం అసలైన జవాబు. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌కు చెందిన అతడు ఇరవై ఏళ్ల క్రితం పొట్టచేత పట్టుకుని బెంగళూరు వలస వెళ్లాడు. కృషి, పట్టుదలతో ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఆకళింపుచేసుకున్నాడు. ఉద్యానవనాల పెంపకంలో అద్భుతమైన ఫలితాలు సాధించాడు. వికసించిన పువ్వులా పరిమళిస్తున్నాడు.
చిల్లర అమ్మకాలతో మొదలు
బోధన్‌లో శ్రీకాంత్ కుటుంబమంతా వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతోంది. ఉపాధికోసం బోధన్ నుంచి బెంగళూరుకు వలస వెళ్లాడు. అక్కడ నీలమంగళ వ్యవసాయక్షేత్రంలో రోజుకు 18 నుంచి 20 గంటలు పనిచేసేవాడు. అలా పూల సాగు, వ్యాపార మెళకువలు, ఎగుమతులు గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నాడు. జీవితంలో ఎదగాలంటే సాహసంతో ఏదో ఒకటి చేయాలని భావించాడు. అతని జీతం సంవత్సరానికి కేవలం రూ.12 వేలు. వ్యాపారం చేయాలంటే కనీసం 20 వేల రూపాయలు కావాలి. రెండేళ్లపాటు అతను కూడబెట్టిన సంపాదనకు తోడు కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన సాయంతో రిటైల్ పూల వ్యాపారం ప్రారంభించాడు. తొలుత ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అతని ఆర్థిక ఇబ్బందులు చూడలేక తండ్రి సొంత ఊరు వచ్చేయమన్నా శ్రీకాంత్ తన పట్టుదల వీడలేదు. విజయం సాధిస్తానని అతని మనసు చెప్పేది. మనసు చెప్పిన మాటనే అనుసరించాడు. 200 గజాల విస్తీర్ణంలో ఇంటి పక్కనే పూల వ్యాపారం ఆరంభించాడు.
తొలి టర్నోవర్ ఐదు లక్షలు
రైతులు, రిటైల్ వ్యాపారుల నుంచి పూలను సేకరించి వాటిని అందంగా ప్యాక్ చేసి అందజేసేవాడు. పెళ్లి, పుట్టిన రోజు తదితర వేడుకలకు, స్టార్ హోటల్స్‌కు తానే స్వయంగా అందజేసేవాడు. అలా రోజుకు రోజుకు కస్టమర్ల పెరుగుతుండటంతో రెట్టించిన ఉత్సాహంతో వ్యాపారం చేశాడు. వ్యాపారంలో అతని చురుకుదనాన్ని చూసి తోటి వ్యాపారులు సైతం అభినందించేవారు. అలా మొదటి సంవత్సరమే అతని టర్నోవర్ ఆరోజుల్లోనే 5 లక్షలకు చేరుకుంది. రెండవ సంవత్సరానికి టర్నోవర్ రెట్టింపయింది. అపుడు అతని వయసు 25 ఏళ్లు మాత్రమే. అలా అతని టర్నోవర్ 5 కోట్ల రూపాయలకు చేరుకుంది.
కట్టెలమ్మిన చోటే పువ్వుల విక్రయం
పూలమ్మిన చోటే కట్టెలమ్మే అనే సామెతను తిరగరాస్తూ శ్రీకాంత్ 2005లో బెంగళూరు రూరల్ జిల్లాలోని దొడ్డబళ్లాపురంలో పదెకరాల పొలం కొనుగోలు చేసి పూలసాగు చేపట్టాడు. తొలుత ఆరు ఎకరాల్లో సాగు ఆరంభించాడు. 2009-10 సంవత్సరానికి ఈ సాగును 30 ఎకరాలకు విస్తరించాడు. అలాగే తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని కూనూర్‌లో మరో పదెకరాలు తీసుకుని సాగు చేయటం ఆరంభించాడు. బ్యాంకు రుణాలు తీరుస్తూ దాదాపు 15 కోట్ల రూపాయలు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగాడు.
పూల సాగులోనూ, వ్యాపారంలోనూ అతను చూపిస్తున్న ప్రతిభను గుర్తించిన జాతీయ ఉద్యానవన బోర్డు అతనికి 3 కోట్ల రూపాయలను సబ్సిడీ మంజూరు చేసింది. రోజ్, చామంతి, కార్నెషన్, గిప్సోఫిలా అనే పూలను పెంచేవాడు. నూటికి నూరు శాతం శ్రమను పెట్టుబడిగా పెట్టాడు. మొక్క నాటిన దగ్గర నుంచి అది చిగురించి, పూలు వికసించి మార్కెట్‌కు వెళ్లేవరకు స్వయంగా దగ్గరుండి చూసుకునేవాడు.