మెయన్ ఫీచర్

‘జనవరి ఫస్టు’.. చైత్ర శుద్ధ పాడ్యమి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగాది పండుగ మన సాంస్కృతిక స్వాతంత్య్రానికి చిహ్నం! ఎందుకంటె బ్రిటన్ దుండగులు మన సాంస్కృతిక స్వాతంత్య్రాన్ని హరించడానికి పూర్వం మన దేశంలో ‘కాలగణన’ కలియుగం ప్రాతిపదికగా జరిగేది. బ్రిటన్ పెత్తనం మన దేశానికి దాస్యం. బ్రిటన్ పెత్తందారుల నిష్క్రమణ మన దేశానికి స్వాతంత్య్రం. బ్రిటన్‌వారు రాకపూర్వం ‘ఉగాది పండుగ ఎప్పడు జరుపుకుంటాము?’ అన్న ప్రశ్నకు సమాధానం- ‘చైత్ర శుద్ధ పాడ్యమి నాడు..’ అన్నది! ఇప్పుడు ఇదే ప్రశ్నకు మేధావులు, విద్యావంతులు చెబుతున్న సమాధానం ప్రతి సంవత్సరం భిన్నంగా ఉంటోంది. ‘చైత్రశుద్ధ పాడ్యమి’ మారలేదు. కానీ సమాధానం మారుతోంది! ఈ ఏడాది మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఉగాది అన్నది సమాధానం! గత ఏడాది వచ్చిన సమాధానం ఉగాది పండుగ ఏప్రిల్ ఎనిమిదవ తేదీ జరిగిందన్నది. ఉగాది పండుగతో కొత్త సంవత్సరం పుడుతున్న ధ్యాస లేదు! విద్యావంతులలో అత్యధికులకు లేదు, వ్యవసాయదారులలో మాత్రం ఇంకా ఈ ధ్యాస మిగిలి ఉంది! ధ్యాస మిగిలి ఉండడం సాంస్కృతిక స్వాతంత్య్రం, ధ్యాస లేనితనం సాంస్కృతిక దాస్యం! బ్రిటన్ ప్రభువుల వారసత్వానికి ఊడిగం చేస్తున్న మేధావులు ఉగాదిని స్థిరమైన సనాతనమైన ‘చైత్రశుద్ధ పాడ్యమి’ ప్రాతిపదికగా కాక నడమంత్రపు మార్చి లేదా ఏప్రిల్ నెలల ప్రాతిపదికగా చెప్పుకొస్తున్నారు! ‘చైత్ర మాసం’ గురించి శుక్లపక్షం గురించి పాడ్యమి గురించి తెలిసి ఉండడం ‘తిరోగమన’-వెనక్కి నడిచే-ప్రవృత్తికి చిహ్నమని కూడ ఈ బ్రిటన్ వారసులు దశాబ్దులుగా ప్రచారం చేస్తున్నారు. ‘చదువుకున్న యువకుల’లో ఎక్కువమంది అడగనే అడగరు. ఎవడైన ఎక్కడో అక్కడ అడుగుతాడు.. ‘గత ఏడాది దుర్ముఖి- ఏప్రిల్ ఎనిమిదిన వచ్చిన ‘ఉగాది’ ఈ ఏడాది హేమలంబి మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన ఎందుకొచ్చింది?’ అన్న ప్రశ్న వేస్తాడు! ‘అంతేనయ్యా.. మన పండుగలు ఎప్పుడూ ఒకసారి రావు. అందువల్లనే గందరగోళం..’ అని బ్రిటన్ భావదాస్యపు ‘బ్రాందీ’ మత్తుదిగని మేధావి సమాధానం చెపుతాడు. ‘అదే న్యూ ఇయర్ చూడు.. ఎప్పుడూ జనవరి ఫస్టునే వస్తుంది, గందరగోళం లేదు..’ -అని కూడ ఈ బ్రిటన్ మానసపుత్రుడు ముక్తాయింపు ఇస్తాడు! ‘ఓహో! అని..’ ఆశ్చర్యపోతాడు అడిగిన విద్యార్థి! విజ్ఞానం అజ్ఞానం గాను, అజ్ఞానం విజ్ఞానం గాను చెలామణి అవుతుండడం మన దేశంలో నెలకొని ఉన్న బ్రిటన్ వారసత్వం, సాంస్కృతిక దాస్యం!
జాతీయతా నిష్ఠ కేవలం నినాదం కారాదు, అది జీవన వ్యవహారం అయినప్పుడే ఒక జాతికి నిజమైన స్వాతంత్య్రం ఏర్పడి ఉన్నట్టు! మన ఇంటిని గురించి మన పూర్వుల గురించి మన పద్ధతుల గురించి తెలుసుకొనడం, మన పద్ధతులను పాటించడం ‘ఇంటి తనం’. మాతృదేశపు సంస్కృతిని తెలుసుకొని వర్తమానానికి అన్వయించుకొని భవిష్యత్తు వైపు పయనించడం మాతృదేశభక్తి.. మన ఇంటి సంగతులు మరచి ఎదురింటి సంగతులను, గజదొంగల ఇళ్లలోని విశేషాలను తెలుసుకొని ‘ముక్కులెగరేయడం’ వల్ల ఇంటితనం నిలబడదు. బ్రిటన్ సామ్రాజ్యవాదులు గజదొంగలు. అందువల్ల ఆ దొంగలు మన నెత్తికెత్తిపోయిన ‘పద్ధతుల’ను ఒక్కొక్కటిగా వదలించుకోవడం నిజమైన జాతీయతత్త్వం, సాంస్కృతిక స్వాతంత్య్రం! మన న్యాయవ్యవస్థలో, మన విద్యావిధానంలో మన ప్రతి జీవనంలో బ్రిటన్ ‘ప్రభువులు’ ప్రతిష్ఠించిన ‘అభారతీయ’ విధానాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ‘ఉగాది’ని మార్చి, ఏప్రిల్ ప్రాతిపదికగా గుర్తించడం ఈ ‘దాస్యాని’కి ఒక ఉదాహరణ మాత్రమే! ఈ దాస్యానికి కారణం మన ‘వ్యవహార’ లేదా ‘సాధారణ’ లేదా ‘సామాన్య’ కాలగణనం మూలపడి ‘మత శకం’ మననెత్తికెక్కడం!!
అనాదిగా మన దేశంలో యుగాల ప్రాతిపదికగా కాలగణన జరిగింది. బ్రిటన్ సామ్రాజ్యవాదులు కలియుగం 4702లో చొరబడినారు. అంతకు పూర్వం పోర్చుగల్ నుంచి ‘వాస్కోడిగామా’ అనే దుండగుడు కలియుగం 4,600లో మన దేశంలోకి చొరబడినాడు. అప్పటివరకు కలియుగం మనకు వ్యవహార శకం లేదా మొత్తం అఖండ భారతదేశానికి వర్తించిన ‘కాలగణన పద్ధతి’. ఈ అఖండ భారతదేశం కొలంబో నుంచి కైలాసం వరకు విస్తరించి ఉండేది! కైలాసం త్రివిష్టపంలో ఉంది. ‘త్రివిష్టపం’-టిబెట్-లో మన దాక్షిణాత్య చాంద్రమాన పద్ధతిలో ఇప్పటికీ ‘నెల’లను లెక్కిస్తున్నారు. ‘దాక్షిణాత్య చాంద్రమాన పద్ధతి’ అని అంటే నెలను అమావాస్య మరుసటి రోజున, శుక్ల పాడ్యమి నాడు మొదలుపెట్టి అమావాస్యతో ముగించడం. టిబెట్‌లో ఇదే పద్ధతిలో ఇప్పటికీ కాలాన్ని లెక్కిస్తున్నారు. టిబెట్ ‘అఖండ భారత్’లో భాగమన్నదానికి ఇది ఒక ఉదాహరణ. వివేకానంద స్వామి కలియుగం 4995లో అమెరికాలోని చికాగో వేదికపై జరిగిన ప్రసంగంలో ప్రధాన ఇతివృత్తం ‘సర్వమత సమభావం’. ఆయన మాతృదేశానికి తిరిగి వచ్చినప్పుడు మొదట కొలంబోలో ఓడ దిగాడు. కొలంబో సింహళం- శ్రీలంక-లో ఉంది! కొలంబోలో ఓడ దిగిన వెంటనే వివేకానందుడు మాతృదేశానికి, మాతృభూమికి వంగి నమస్కరించి మట్టిలో పొర్లాడు. అప్పటికి ‘సింహళం’ అఖండ భారత్‌లో భాగమని అప్పటివారు భావించారనడానికి ఇది కూడ ఒక సాక్ష్యం! సర్వమత సమభావానికి ‘కలియుగ’ప్రాతిపదిక కాలగణనం అనాది ప్రతీక! ఈ కాలగణనం సింహళం నుంచి టిబెట్ వరకు అమలులో ఉండేది. ఇది భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచానికి వర్తించే సర్వమత సర్వజాతీయ సర్వవర్ష సర్వద్వీప సమభావం! ఎందుకంటె దీనిని భారతీయులు కృత్రిమంగా తయారుచేయలేదు. సృష్టిలో సహజమైన ఖగోళ వాస్తవం కలియుగం. ఈ వాస్తవాన్ని భారతీయులు గుర్తించారు. ఇది మత శకం కాదు! దీన్ని తొలగించిన బ్రిటన్ వారు మతంతో ముడివడిన ‘క్రీస్తుశకా’న్ని మన నెత్తికెత్తిపోయారు..
ఇప్పుడు సర్వమత సమభావానికి ప్రతీక అయిన ‘కలియుగం’ అనగానే ఇదంతా ‘మత వ్ఢ్యౌం’ అని అంటున్నారు. ఒక మత ప్రవక్తతో ముడివడిన క్రీస్తు శకాన్ని సాధారణ శకమని, సామాన్య శకమని వ్యవహార శకమని ప్రచారం చేస్తున్నారు. ఇలా క్రీస్తుశకాన్ని వ్యవహార శకమని, సాధారణ శకమని సామాన్య శకమని చెప్పడం బ్రిటన్ భావదాస్య వారసత్వానికి చిహ్నం. అందువల్ల ‘క్రీస్తు మతశకాన్ని’ కేవలం ‘క్రీస్తు శకం’గా మాత్రమే గుర్తించడం న్యాయం, తార్కికం! ‘కలియుగం’ ప్రాతిపదికగా జరిగే కాలగణనం మాత్రమే ‘వ్యవహార శకం’ లేదా సాధారణ శకం లేదా సామాన్య శకం! దీన్ని ఇతర ‘ప్రపంచం’ మరిచిపోవడం వేఱు! భారతీయులు మరచిపోయారు.. బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు మరపింపచేశారు! బ్రిటన్ దురాక్రమణదారులు మత శకాన్ని ఆరంభించిన కొత్తలో ఈ దేశ ప్రజలు ‘జనవరి ఒకటవ తేదీ ఎప్పుడొస్తుంది?’ అన్న ప్రశ్నకు ‘మార్గశీర్షం’లో వస్తుంది లేదా ‘పుష్యం’లో వస్తుంది’ అని సమాధానం చెప్పేవారు. ‘అదేమిటి ఈ ఆంగ్లేయుల ‘ఉగాది’ ఎప్పుడూ ఒకేసారి రాదా?’ అన్నది అప్పటి ప్రశ్న. ‘అవును.. వారి పండుగలు ప్రతి ఏటా ఒకేసారి రావు.. అందుకే గందరగోళం..’ అన్నది అప్పటి భారతీయుని సమాధానం! ఇప్పుడు కూడ ‘జనవరి ఫస్ట్’ ప్రతి సంవత్సరం ఒకేసారి రావడం లేదు. కలియుగం 5118లో ‘జనవరి ఫస్ట్’ పుష్యమాసపు శుక్ల ‘తదియ’ నాడు వచ్చింది. ‘హేమలంబి’తో మొదలయ్యే ‘కలి’ 5119లో ‘జనవరి ఫస్టు’ ‘పుష్యమాసపు శుక్ల చతుర్దశి’ రోజున రానుంది. అందువల్ల మన దేశంలో ఏది ప్రాతిపదిక? అన్నది సంస్కృతితో ముడిపడి ఉంది. భారతీయమైన కాలగణన ప్రాతిపదికలు విశ్వవ్యవస్థలోని శాశ్వతమైన ఖగోళ వాస్తవాలు! ‘జనవరి’ కాని ‘జనవరి ఒకటవ’ తేదీ నుంచి కొత్త సంవత్సరాన్ని లెక్కపెట్టడం కాని కేవలం మానవ కల్పితాలు! మానవ కల్పిత ‘చక్రం’లోకి సృష్టిక్రమాన్ని ఇమడ్చడానికి యత్నించడం పాశ్చాత్యుల అహంకారం.. సృష్టిక్రమానికి అనుగుణంగా మానవ జీవన వ్యవహారాన్ని సమన్వయం చేసుకొనడం భారతీయుల సనాతన జాతీయ ప్రస్థానం..
పాశ్చాత్య దేశాలలోని జన సముదాయాలు వివిధ కాలాలలో భారత ఖండం నుంచి ఆయా దేశాలకు వెళ్లిపోవడం యుగాల చరిత్ర! భారతీయతను మరచిపోయిన కారణంగా వేల లక్షల ఏళ్లపాటు ఈ పాశ్చాత్య జన సముదాయాల వారు మానవ సంస్కారాలకు దూరమై పశుతుల్య జీవనులయ్యారు! కలియుగంలో రెండువేల ఏళ్లు గడిచిన తరువాత ‘గ్రీసు’దేశపు నాగరికత పాశ్చాత్య దేశాలను ముంచెత్తింది. ‘గ్రీసు’ నాగరికతను కలియుగం 2347 ప్రాంతంలో ‘రోమన్’లు ధ్వంసం చేశారు. అప్పటి నుంచి 709 ఏళ్లపాటు పాశ్చాత్యులు రోము సామ్రాజ్యం ‘కాలగణన’ను పాటించారు. పాశ్చాత్యులకు ప్రసిద్ధమైన మొదటి ‘కాలగణన’ ఈ ‘రోము శకం’. ఈ రోము శకం 709లో అంటే కలియుగం 3056లో రోము నియంత ‘సరికొత్త’ క్యాలండర్‌ను తన పేరుతో సృష్టించి ప్రారంభించాడు. దీనికి తార్కిక ప్రాతిపదిక- తన పేరు చిరస్థాయిగా ఉండాలన్న ‘జూలియస్ సీజర్’ తపన మాత్రమే! భారతీయుల ‘పంచాంగానికి’ ఏ వ్యక్తి పేరూ లేదు. ఇది అనాది విజ్ఞానం కావడం ఇందుకు మొదటి కారణం, తమ పేరు శాశ్వతంగా ఉండాలన్న ‘దుగ్ధ’ మన మహనీయులకు లేకపోవడం రెండవ కారణం! సైరస్ అన్న విదేశీయుని శకాన్ని తప్పించడానికి మాత్రమే విక్రమ శాలివాహనులు కొత్త కాలగణనను ప్రారంభించారు. అది వ్యక్తుల అహంకారం కాదు, ఆ కథ వేరే ఉంది! ఇలా కలియుగం 3056లో జూలియస్ సీజర్ మొదలుపెట్టన ఈ ‘జూలియన్ కాలెండర్’లో సంవత్సరం ‘మార్చి’తో మొదలయ్యేది. ఈ ‘కాలండర్’ మొదలైన తర్వాత నలబయి ఆరేళ్లకు కలియుగం 3102వ సంవత్సరంలో క్రీస్తు శకం మొదలైంది. దాంతో ‘జూలియన్’ కాలండర్ క్రీస్తు శకానికి మాధ్యమంగా మారింది. కానీ ఈ ‘జూలియన్’ కాలెండర్‌లో ప్రతి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాలకు ఒకరోజు లెక్క తప్పిందని కలియుగం 3832వ సంవత్సరంలో వెల్లడయింది. అయినప్పటికీ కలియుగం 4,684 వరకు ఈ తప్పులతడక కాలెండర్‌ను పట్టుకొని పాశ్చాత్యులు వ్రేలాడారు. అప్పటికి ‘జూలియన్ కాలెండర్’లో ‘పది రోజులు’ తప్పిపోయాయి. కలియుగం 4,684వ సంవత్సరం నాటికి క్రీస్తుశకం 1582వ సంవత్సరం వచ్చింది. ఆ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తేదీ మరుసటి రోజును అక్టోబర్ పదిహేనవ తేదీగా పోప్ గ్రెగరీ అనే మేధావి నిర్ధారించాడు! ఇలా పది రోజులను కలుపుకోవడానికి కారణం విజ్ఞానం కాదు, అంతవరకు ఆవహించి ఉండిన అజ్ఞానం! కానీ పాశ్చాత్యుల ఈ ‘గ్రెగేరియన్’ కాలండర్‌లో కూడ ఇప్పటికీ తప్పులు దొర్లుతూనే ఉన్నాయి. అదంతా పెద్దకథ. కాని నూట తొంబయి ఐదు కోట్లు యాబయి ఎనిమిది లక్షల ఎనబయి ఐదువేల నూట పద్దెనిమిది ఏళ్లుగా మన పంచాంగంలో ఒక్క క్షణం కూడ తేడా రాలేదు, ఇది నూట పంతొమ్మిదవ ఏడు.. కలియుగంలో ఇది 5119వ శుభవత్సరం! ఏది వ్యవహార శకం..?
*

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com