మెయిన్ ఫీచర్

‘బార్బీ’ సరికొత్త తళుకులు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారులనే కాదు, తల్లుల్ని సైతం ఎంతో ఆకట్టుకుని విశ్వవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ప్లాస్టిక్ బొమ్మ ‘బార్బీ’ ఇపుడు కొత్త అందాలను సంతరించుకుంది. బొమ్మల ప్రపంచంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందిన ‘బార్బీ’ ఇన్నాళ్లూ ఒకే ఆకారంలో సాక్షాత్కరించేది. మార్కెట్‌లో పోటీని తట్టుకునేందుకు తాజాగా ఈ బొమ్మను మూడు విభిన్న ఆకృతుల్లో తీర్చిదిద్దినట్టు అమెరికాకు చెందిన ప్రఖ్యాత బొమ్మల తయారీ కంపెనీ ‘మట్టెల్’ ప్రకటించింది. అయిదున్నర దశాబ్దాలకు పైగా ఒకే ఆకృతిలో కనిపించిన ‘బార్బీ’ ఇపుడు మూడు రకాల మార్పులతో వైవిధ్య భరితంగా పిల్లలకు కనువిందు చేయబోతోంది. పొడవైన, ఒంపులు తిరిగిన, సన్నటి శరీరాకృతిలో ఈ బొమ్మలు ఇక మార్కెట్లను ముంచెత్తబోతున్నాయి. విభిన్న రంగుల్లో, వివిధ ఆకృతుల్లో లభించే బొమ్మలను కొనేందుకు తల్లులు ఇష్టపడుతున్నందున వారి అభిరుచులకు అనుగుణంగా ‘బార్బీ’లోనూ సరికొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. మారుతున్న ఫ్యాషన్లను దృష్టిలో పెట్టుకుని ‘బార్బీ’కి మెరుగులు దిద్దుతూ మార్కెట్‌ను మరింతగా విస్తరించుకోవాలని ‘మట్టెల్’ యాజమాన్యం నిర్ణయించింది. శరీరాకృతికి సంబంధించి ‘బార్బీ’ బొమ్మలు నాలుగు రకాల్లో ఉంటాయని ఆ సంస్థ పేర్కొంది. శరీరం రంగులో ఏడు రకాలు, కళ్ల రంగుకు సంబంధించి 22 రకాలు, 24 రకాల హెయిర్ స్టయిల్స్‌లో ‘బార్బీ’ ఇకపై పిల్లలకు మరింత చేరువ కాబోతోంది. బొమ్మల ఎత్తు, ఆకృతుల విషయంలో తల్లుల అభిరుచులకు తగ్గట్టుగా ఈ మార్పులను తీసుకువచ్చారు. తాము చేపట్టిన మార్పులతో ప్రపంచంలోనే ‘నెంబర్ వన్ ఫ్యాషన్ డాల్’గా బార్బీ ఇకముందు కూడా అగ్రస్థానంలో ఉంటుందని ‘మట్టెల్’ యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది. బాలలు, తల్లుల అభిరుచులు, ఆసక్తులను పరిగణనలోకి తీసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నందునే ‘బార్బీ’ బొమ్మల తయారీలో నూతన ఆవిష్కరణలు చేపట్టినట్లు ‘మట్టెల్’ ముఖ్య కార్యనిర్వహణాధికారి రిచర్డ్ డిక్సన్ చెబుతున్నారు.
ఘనమైన చరిత్ర..
అందమైన బాలిక రూపంలో కనువిందుచేసే ‘బార్బీ’ బొమ్మను 1959 మార్చి 9న తొలిసారిగా అమెరికా మార్కెట్‌లో విడుదల చేశారు. మహిళా పారిశ్రామికవేత్తగా, సృజనశీలిగా అప్పటికే గుర్తింపు పొందిన రథ్ హ్యాండ్లెర్ సృష్టించిన ఈ ఆటబొమ్మ అనతికాలంలోనే అందర్నీ అలరించింది. ‘బార్బీ’ని దేశదేశాల్లో పరిచయం చేసేందుకు ఆమె నేతృత్వంలోని బొమ్మల తయారీ కంపెనీ ‘మట్టెల్’ సరికొత్త వాణిజ్య వ్యూహాలకు పదునుపెట్టింది. దీంతో అమెరికాతో పాటు అనేక దేశాల్లో ‘బార్బీ’కి అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. జర్మనీలో విశేష ఆదరణ పొందిన ‘బిల్డ్ లిల్లీ’ బొమ్మను స్ఫూర్తిగా తీసుకుని హ్యాండ్లెర్ ‘బార్బీ’కి రూపకల్పన చేశారు. తన కుమార్తె బార్బరా కాగితాలతో బొమ్మలు చేయడం, వాటికి ఇంట్లోని పెద్దవాళ్ల పేర్లు పెట్టడం గమనించిన ఆమె మదిలో కొత్త ఆలోచనలు కలిగాయి. చిన్నారుల కోసం వైవిధ్య భరితమైన బొమ్మలను తీర్చిదిద్దాలన్న ఆమె ఆకాంక్ష ఫలించి ‘బార్బీ’ ఆవిర్భవించింది. పెద్దవాళ్లను అనుకరించడం, బొమ్మలకు వారి పేర్లు పెట్టడంలో పిల్లలు ఎంతో అనుభూతి పొందుతూ ఆడుకుంటారని ఆమె చెప్పేవారు. 1956లో తన పిల్లలు బార్బరా, కెనె్నత్‌లతో కలిసి యూరప్‌లో పర్యటించినపుడు జర్మనీకి చెందిన ‘బిల్డ్ లిల్లీ’ బొమ్మలను చూసి ఆమె తన సృజనకు పదునుపెట్టారు. జాక్ ర్యాన్ అనే ఇంజనీర్ సహాయంతో బాలిక ఆకృతిలో ఓ బొమ్మను తీర్చిదిద్ది, దానికి ‘బార్బీ’ అని ఆమె నామకరణం చేశారు. తన కుమార్తె బార్బరా పేరు స్ఫురించేలా ఈ పేరు పెట్టారు. 1959 మార్చి 9న మార్కెట్‌లో తొలిసారి విడుదల చేయడంతో ఆ తేదీనే ‘బార్బీ’ జన్మదినంగా వ్యవహరిస్తున్నారు. తాము ఆడుకునే బొమ్మల్లో పిల్లలు పెద్దలను చూస్తుంటారని, ఇందుకు తగ్గట్టుగానే ‘బార్బీ’ ఉండాలని హ్యాండ్లర్ చెప్పేవారు. ప్రపంచంలోనే బొమ్మల మార్కెట్‌కు సంబంధించి తొలిసారిగా టీవీలో ప్రకటనలు రూపొందించిన ఘనత ఆమెకే దక్కింది. మార్కెట్‌లో విడుదలైనపుడు ఒక్క ఏడాదిలోనే మూడున్నర లక్షల బార్బీ బొమ్మలు అమ్ముడుపోయాయి. ఆ తర్వాత వీటి ఉత్పత్తి కోట్లకు చేరింది. కాలిఫోర్నియాలో 1916 నవంబర్ 4న జన్మించిన హ్యాండ్లర్ 2002 ఏప్రిల్ 27న కన్నుమూశారు. ఆమె ఆశయాలను, ఆకాంక్షలను పుణికిపుచ్చుకున్న ‘మట్టెల్’ సంస్థ కాలానుగుణంగా ‘బార్బీ’కి పలుసార్లు మార్పులు చేస్తూ మార్కెట్‌లో తన స్థానాన్ని పదిలపరచుకుంటోంది.
‘టీనేజ్ ఫ్యాషన్ మోడల్’గా ప్రపంచంలోనే విశేష ప్రాచుర్యం పొందిన బార్బీ బొమ్మల వల్ల యువతుల దుస్తులు, నగల రూపకల్పనలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ‘బార్బీ’ పేరిట సౌందర్య సాధనాలు, నోట్ పుస్తకాలు, వీడియో గేమ్స్, యేనిమేషన్ సినిమాలు, కథల పుస్తకాలు, పెయింటింగ్స్ మార్కెట్లలో రంగప్రవేశం చేశాయి. బొమ్మల ప్రపంచంలోనే కాదు, సాంస్కృతిక రంగంలోనూ ‘బార్బీ’కి ఒక విశిష్ట స్థానం దక్కింది. 2013లో తైవాన్‌లో ‘బార్బీ కేఫ్’ పేరిట ఓ హోటల్‌ను తెరిచారు. ‘బార్బీ’ ఏభయ్యో జన్మదినం సందర్భంగా 2009లో న్యూ యార్క్‌తో పాటు అనేక నగరాల్లో ‘్ఫ్యషన్ వీక్’లను నిర్వహించి కోలాహలంగా ఉత్సవాలను నిర్వహించారు.
*
chitram..

బార్బీ సృష్టికర్త హ్యాండ్లెర్ ---- నూతన ఆకృతుల్లో బార్బీ