మెయిన్ ఫీచర్

కాంతులీనే ముఖం సౌందర్యానికి సంకేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురాణాల కాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకూ మగువల మనోహర రూపానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందచందాల భామల కోసం రాజుల మధ్య యుద్ధాలు జరిగాయి. రాజ్యాలను కోల్పోయిన వారూ ఉన్నారు. చరిత్రను పక్కనపెట్టి, వర్తమానంలోకి వస్తే ఆడ,మగ అనే తేడా లేకుండా అందరిలోనూ అందం కోసం ఆరాటం పెరిగింది. అమ్మాయిల్లోనే కాదు, అబ్బాయిల్లోనూ అందం పట్ల ఆసక్తి పెరిగింది. పుస్తకాలతో కంటే అద్దం ముందే నేటి యూత్ ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారంటే అందులో అతిశయోక్తి లేదు. మనం ఏదైనా మ్యారేజ్ బ్యూరోకెళితే వాళ్లు ఫొటో చూసి చెప్పేస్తారు- ‘పెళ్లి తొందరగా అవుతుందా? లేక ఆలస్యం అవుతుందా?’ అని. ఓ తెలుగు మ్యారేజ్ సైట్‌లో మూడు నెలలకి డబ్బు కడితే, అమ్మాయి ఫొటో పెట్టిన వారంలోనే పెళ్లి కుదిరిపోయిన సంఘటనలున్నాయి. నేటి సమాజంలో అందానికి వున్న ప్రాముఖ్యం అటువంటిది. ‘ఏం చేస్తే ఒక వ్యక్తి అందంగా వుంటాడు?’ అని పరిశీలన చేసుకుంటే- అపుడు ముఖానికే పెద్ద పీట వేయాల్సి వస్తుంది. శరీర అందంలో ముఖానికి ఉన్న ప్రాముఖ్యత అటువంటిది.
***
* అపుడే సినిమా హాల్ నుంచి బయటకి వచ్చిన ఓ గృహిణి తన భర్తతో- ‘కొత్త హీరో పొట్టివాడైనా మొహంలో మంచి కళ ఉంది.. అతను నవ్వితే థౌజండ్ వాల్ట్ బల్బులా స్క్రీన్ వెలిగిపోయింది.. కచ్చితంగా పెద్ద హీరో అవుతాడు’ అని.
* ఓ అమ్మాయి తండ్రి తన ఇల్లాలితో- ‘అబ్బాయి పొడుగే కానీ.. మొహం నిండా మచ్చలు.. చూడలేం అనుకో.’
* ఓ పెళ్లికొడుకు తండ్రి- ‘అమ్మాయి సన్నగా నాజూగ్గా ఉన్నా.. నవ్వితే మూతి మూసీ నదిలా వంకరగా వుంది’.
* వరుడితో అతని స్నేహితుడు- ‘అమ్మాయి నోట్లో ఉన్నవి పళ్లా? పాపికొండలా? ఏనుగు దంతాల్లా అంతంత ఉన్నాయేంట్రా బాబూ..’
.... ఇలాంటి వ్యాఖ్యానాలను మనం నిత్యం ఎక్కడో అక్కడ వింటూనే ఉంటాం. ముఖంలోని లోపాలతో మొదటి చూపులోనే ఇలాంటి చేదు అనుభవాలు కొందరికి ఎదురవుతుంటాయి. ఎవరికైనా సరే ముఖంలోని లోపాలు వారి పాలిట శాపాలు కారాదు. ఇలాంటి లోపాల పర్యవసానంగా పెళ్లికి ఎదిగిన అమ్మాయిలు, అబ్బాయిలు అనునిత్యం మానసికంగా ఆందోళన చెందుతుంటారు. ముఖంలో లోపం వల్ల పెళ్లి కావడం లేదని చాలామంది యువతీ యువకులు కుంగుబాటుకు లోనవుతుంటారు.
***
ఓసారి నా దగ్గరికి 20 ఏళ్ల అమ్మాయిని వాళ్లమ్మ కన్సల్టేషన్‌కి తీసుకుని వచ్చింది. ఆ అమ్మాయికి కింది దవడ ముందు భాగం (గడ్డం) చిన్నదిగా, బాగా వెనక్కి ఉంది. దానివల్ల ఆమె ముఖం చూడటానికి బాగాలేదు. అందుకే ఆమెకి పెళ్లి కావడం లేదట! ఫలితంగా ఆమెలో ఎలాంటి చలాకీతనం లేదు. అదే అమ్మాయి ఆపరేషన్ చేయించుకున్న తరువాత నన్ను కలవడానికి ఓ సారి వచ్చింది. మొదట ఆమెను నేను గుర్తుపట్టలేదు. అందంగా తయారై, నగలు అలంకరించుకుని ఆమె కిలకిలా నవ్వుతోంది. ‘నన్ను గుర్తు పట్టలేదా సార్..?’ అని హుషారుగా ప్రశ్నించింది. ఆమెలో ఎంతటి మార్పు..? ఎంతటి ఉత్సాహం..? ఆపరేషన్ ద్వారా దవడ భాగం సరిచేయడంతో ఆమె ముఖారవిందం కాంతులీనుతోంది.
నిజానికి- అందచందాలనేవి చూసేవారి కళ్ల బట్టి ఉంటుంది. చూసే ప్రతి కన్నుకీ నచ్చేట్లుగా ఉండడం కష్టమేమో గానీ, మనల్ని ఇష్టపడే వాళ్లకి నచ్చేట్టుగా ఉండడం ఏ మాత్రం కష్టం కాదు. అపోహలు, అనుమానాలు కాదు.. అందచందాలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఎంతోకొంత అవగాహన కలిగి ఉండాలి. లోపాలను సవరించుకుని, అందాలను పెంచుకోవడం అన్నది మన చేతుల్లోనే ఉందని తెలుసుకోవాలి. సందేహాలను, సంశయాలను వౌనంగా భరించకుండా మన సమస్యకు మనమే పరిష్కారం వెదుక్కోవాలి. నిపుణుల సలహాలు పాటిస్తూ, ఆధునిక వైద్య విజ్ఞానంపై నమ్మకం పెంచుకుంటే ఎలాంటి చీకూచింతలూ ఉండవు. అందుకే-
‘అందంగా వుండండి.. ఆనందంగా నవ్వండి’

-డాక్టర్ రమేష్ శ్రీరంగం సెల్ నెం: 92995 59615