మెయిన్ ఫీచర్

సూరజ్‌కుండ్ మేళాలో తెలంగాణ కళా సౌరభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ అనతికాలంలోనే అరుదైన ఘనతను సాధించింది. హర్యానాలోని ఫరీదాబాద్ వద్ద జరుగుతు న్న ‘సూరజ్‌కుండ్ అంతర్జాతీయ కళా ప్రదర్శన’లో కీలక రాష్ట్రం (్థమ్ స్టేట్)గా స్థానం సంపాదించడంతో తెలంగాణ సంస్కృతి, కళల గురించి విదేశీయులకు సైతం తెలిసే అవకాశం కలిగింది. ‘30వ సూరజ్‌కుండ్ మేళా’లో తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే స్టాళ్లు సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకూ జరిగే సూరజ్‌కుండ్ మేళాలో పలు రాష్ట్రాలతో పాటు 23 దేశాలకు చెందిన కళాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ సంప్రదాయానికి అద్దం పట్టే హస్తకళలు, చేనేత వస్త్రాలు, వంటకాలను పరిచయం చేయడమే కాదు, ఒగ్గుడోలు, యక్షగానం, లంబాడా నృత్యాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనల్ని కూడా నిర్వహిస్తున్నారు. తమ ప్రాంత విశిష్ఠతను తెలిపే హస్తకళలు, సాంస్కృతిక విన్యాసాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకు తెలంగాణ కళాకారులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.
ఏటా జరిగే ‘సూరజ్ కుండ్ అంతర్జాతీయ మేళా’లో ఏదో ఒక రాష్ట్రం ‘్థమ్ స్టేట్’గా వ్యవహరిస్తుంది. ఈ ఏడాది ఆ అవకాశం తొలిసారిగా తెలంగాణకు దక్కింది. 40 ఎకరాల మేళా ప్రాంగణంలో దాదాపు 15 ఎకరాలను తెలంగాణ స్టాళ్లకు కేటాయించారు. ఇక్కడ నిర్మించిన సుమారు 880 కుటీరాల్లో 70 కుటీరాలు తెలంగాణవి కావడం విశేషం. ఈ ఏడాది మేళాలో భారీ సంఖ్యలో విదేశీ కళాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. చైనా, జపాన్, శ్రీలంక, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, థాయ్‌ల్యాండ్, మలేషియా, ఈజిఫ్ట్, టునీషియా, వియత్నాం, లెబనాన్ వంటి 23 దేశాలు మేళాలో భాగస్వామ్యం వహిస్తున్నాయి. జపాన్, కాంగో, ఈజిఫ్ట్, థాయ్‌ల్యాండ్, మాల్దీవులు, రష్యా వంటి దేశాలకు చెందిన ప్రముఖ కళాకారులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. విదేశీ విభాగంలో ఈ ఏడాది చైనా కీలక భూమిక పోషిస్తోంది.
వివిధ కళారూపాలను ప్రదర్శించేందుకు మూడు ప్రధాన వేదికలను, వంటకాల రుచులను అందించేందుకు కొన్ని ఫుడ్‌కోర్టులను తెలంగాణకు కేటాయించారు. ఆరుబయట వేదికలపై బోనాలు, ఒగ్గుడోలు, చిందు యక్షగానం, గుస్సాడి, రామాయణం, కోలాటం, బంజారా, కొమ్ముకోయ, మదూరి, పేరిణి శివతాండవం, బతుకమ్మ వంటి సంప్రదాయ, జానపద కళాప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. సందర్శకులకు స్వాగతం పలికేలా కాకతీయ కీర్తి తోరణం, చార్మినార్, గోల్కొండ కోట, రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాలను, శిల్పారామం నమూనాలను కళాత్మకంగా తీర్చిదిద్దారు. తెలంగాణ పర్యాటక శాఖ ఉన్నతాధికారులు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి వందలాది మంది కళాకారులను మేళాకు రప్పించారు. తెలంగాణలోని గిరిజన సంస్కృతిని చాటిచెప్పే కళారూపాలను ఇతర ప్రాంతాల వారికి పరిచయం చేస్తున్నారు. ‘అప్నాఘర్’ పేరిట నిర్మించిన ప్రత్యేక కుటీరాలు తెలంగాణలోని కుటుంబ వ్యవస్థ, జీవనశైలిని ఆవిష్కరిస్తున్నాయి. రెండువారాల పాటు ఎంతో కోలాహలంగా జరిగే ఈ అంతర్జాతీయ మేళా వల్ల వివిధ ప్రాంతాల కళారూపాలు, హస్తకళలు, వంట లు, జీవనశైలి గురించి ప్రచారం జరగడమే కాదు, వివిధ దేశాల మధ్య సాంస్కృతిక బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది.
*
chitram...
తెలంగాణ వేదికలు ఏర్పాటైన ప్రాంతం