మెయన్ ఫీచర్

తీరు మారని వామపక్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమాన ప్రపంచ పరిస్థితులు శరవేగంగా మార్పు చెందుతున్నాయి. ఈ తరుణంలో కూడా వామపక్షాలు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా కాకుండా, ఇంకా కాలం చెల్లిన సైద్ధాంతిక కోణంలోనే తమ రాజకీయ విన్యాసాలను నడుపుతుండటం విచిత్రం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఈ ఎండాకాలంలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మళ్లీ ‘గత వైభవాన్ని’ తిరిగి అందుకునేందుకు, కాంగ్రెస్‌తో జట్టుకట్టడానికి సిద్ధంగా ఉన్నాయని ఊహించడం ఈ సందర్భంగా నిర్హేతుకం కాబోదు. సిపిఎం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కమిటీ ఈనెల 12/13 తేదీల్లో సమావేశం కాబోతున్నది. ఐదేళ్ల క్రితం వరకు పశ్చిమ బెంగాల్ వామపక్షాలకు దుర్భేద్యమైన కోట. కానీ ఇప్పుడది చరిత్ర. కమ్యూనిస్టుల కంచుకోట మమతమ్మ పుణ్యమాని బద్దలైపోయింది. ఈ నేపథ్యంలో వామపక్ష నేతలకు, సిద్ధాంతాలకంటే మనుగడకే ప్రాధాన్యత నివ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కోల్‌కతాలోని ఇరుకైన అలిముద్దీన్ వీధిలోని కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయంలో సైద్ధాంతిక నిబద్ధులైన వృద్ధ కమ్యూనిస్టు నేతలు, ప్రస్తుతం నెలకొన్న వాస్తవ పరిస్థితులతో పోరాటం సలపాల్సి వస్తున్నది.
ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాలతోకూడిన తన నేతృత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ మమతా బెనర్జీని ఓడించే స్థితిలో లేదన్న సత్యాన్ని సిపిఎం గుర్తించింది. ఒక దశలో అసెంబ్లీలో ప్రతిపక్ష స్థాయిని కూడా కోల్పోయి, ఆ స్థానాన్ని భాజపా ఆక్రమిస్తుందన్న ఊహాగానాలు కూడా వెల్లువెత్తాయి. అయితే భాజపా వారి ముందుచూపులేని తనం వల్ల ఈ ప్రమాదం తప్పింది. భాజపా నుంచి ఎదురవుతున్న ఈ సవాలును ఏదోవిధంగా తట్టుకొని బయటపడినా, తృణమూల్ కాంగ్రెస్‌కు సవాల్ విసరలేక కుప్పకూలి ఉండటం వామపక్షాల దైన్యస్థితికి నిదర్శనం. అందువల్ల తృణమూల్‌తో నేరుగా ఎన్నికల యుద్ధంలో పాల్గొంటే వామపక్షాల పరాజయాన్ని అంచనా వేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
ఇక రెండో అంశమేమంటే 2016 అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాజకీయ పోరాటానికి మాత్రమే పరిమితం కాదు, అంతకు మించి ఎక్కువని సిపిఎం గాఢంగా విశ్వసిస్తోంది. రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గ రాజకీయ సంస్కృతి వల్ల విపక్షాలకు కొద్ది పాటి స్థానం కూడా లభించని దుస్థితి నెలకొంది. ఈ పాపానికి మూలం వామపక్ష పాలనా కాలం నాటిది. మూడు దశాబ్దాల తమ పాలనలో ఈ సంస్కృతిని పెంచి పోషించిందే వారు. అధికారంలో ఉన్న లెఫ్ట్‌పార్టీలతో రాజకీయ పోరాటం జరపడం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండబోదని అప్పట్లోనే మమతా బెనర్జీ, ఆమె అనుయాయులు కృతనిశ్చయానికి వచ్చేశారు. పంథాను మార్చి లెఫ్ట్ కోటను కూల్చేశారు. అప్పట్లో వామపక్షాలు అనుసరించిన పద్ధతినే ఇప్పుడు మమతమ్మ కూడా అమలు పరుస్తోంది. ఫలితం వామపక్షాలు ఎంతమాత్రం అడుగుపెట్టలేని స్థితి నెలకొనడం.
2011 ముందు కాలంలో స్థానిక స్థాయి ల్లో కూడా వామపక్షాలను ఒక చిహ్నంగా భావించిన వారు ఇప్పుడు పూర్తిగా తృణమూల్ వైపుకు మారిపోయారు. అంటే ఇక్కడ స్థానికుల రాజకీయ ‘అనుబంధం’ మారినప్పటికీ కండబలం, అసహనం మాత్రం గతంలో మాదిరిగానే కొనసాగుతోంది. దీని ఫలితంగా రెండోసారి కూడా ఓటమి పాలైతే ఇప్పటికే ముక్కలు చెక్కలుగా ఉన్న తమ రాజకీయ వేదిక, పూర్తిగా కుప్పకూలిపోక తప్పదని లెఫ్ట్‌ఫ్రంట్ నాయకత్వం భయపడుతోంది. అందువల్ల పార్టీ మనుగడకు ఈ ఎన్నికలు అత్యంత ముఖ్యమైనవిగా మారిపోయాయి.
ఇక కాంగ్రెస్ పరిస్థితి కమ్యూనిస్టుల కంటె భిన్నంగా ఏమీ లేదు. లెఫ్ట్ ఫ్రంట్ ఎదుర్కొంటున్న సమస్యలే కాంగ్రెస్‌నూ పీడిస్తున్నాయి. ఇప్పటి వరకు క్రమంగా, సుస్థిరంగా తమ రాజకీయ ఆధారాన్ని కోల్పోతూ వచ్చిన కాంగ్రెస్, ప్రస్తుతం ఉప-ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది. ముఖ్యంగా ముర్షిరాబాద్, మాల్డా, రెండు దినాజ్‌పూర్లకు మాత్రమే కాంగ్రెస్ అస్తిత్వం పరిమితమైంది. ఇక మిగిలిన రాష్ట్రంలో కోల్‌కతా, హౌరా, దక్షిణ బెంగా ల్ ప్రాంతాల్లో అక్కడక్కడా కాంగ్రెస్ కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో గతంలో కాంగ్రెస్‌కు అండగా ఉన్నవారంతా ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ సమర్థకులుగా మారారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రంలో పార్టీ ఉనికి సాధారణ స్థాయిలో కొనసాగింది. ఇందుకు కేంద్రం ఉదారంగా నిధులు పంపడం వంటివి ఇందుకు కారణం. ఇక 2014 సాధారణ ఎన్నికల నుంచి ఈ ‘బంధం’కూడ తెగిపోయింది.
2011లో మహజోత్‌లో తృణమూల్‌కు కాంగ్రెస్ జూనియర్ భాగస్వామిగా ఉం డేది. అయితే తృణమూల్ గాలి బలంగా వీచిన నేపథ్యంలో, కాంగ్రెస్ ఉత్తర బెంగాల్ ప్రాంతాల్లో తనకు పట్టున్న చోట్ల అక్కడక్కడా చచ్చీ చెడీ విజయం సాధించగలిగింది. నేడు ఈ ప్రాంతాలు కూడా తృణమూల్ కాంగ్రెస్ ఖాతాలోకి చేరిపోతాయేమోనని కాంగ్రెస్ నేతల్లో ఇప్పటినుంచే గుబులు మొదలైంది. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ స్థానాలను కూడా తృణమూల్ ఎగరేసుకుపోతుందేమోనని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు. ఒకవేళ లెఫ్ట్‌పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లయితే ఉత్తర బెంగాల్‌లోని అసెంబ్లీ సీట్లను కాంగ్రెస్ అలవోకగా గెలుచుకోగలదు. ఈ ప్రాంతంలో తృణమూల్ కాంగ్రెస్‌కు అంతగా పట్టు లేదు. సాపేక్షంగా ఈ పార్టీని అక్కడివారు కొత్తగా పరిగణిస్తారు. ఇది సిలిగురి మున్సిపాలిటీకి గత వేసవిలో జరిగిన ఎన్నికలే ఇందుకు సాక్ష్యం. ఈ ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీ కమ్యూనిస్టుల హస్తగతమైంది. ఇక్కడ విచిత్రమేమంటే, లెఫ్ట్‌తో కలియడం వల్ల కాంగ్రెస్‌కు ఏ ప్రయోజనమైతే కలుగుతుందో, కాంగ్రెస్‌తో చేతులు కలిపితే తృణమూల్‌కు అంతే లాభం జరుగుతుంది.
గతంలో కాంగ్రెస్ నేతగా ఉన్న మమతా బెనర్జీ, రాష్ట్రంలో లెఫ్ట్‌పార్టీలను ఎదుర్కొనడానికి అధిష్టానం అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విసిగిన మమత 1997లో పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్నారు. అయితే సైద్ధాంతికంగా తన మాతృపార్టీలో మమతా బెనర్జీకి విభేదాలేమీ లేవనే చెప్పాలి. మమతా బెనర్జీకి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మంచి సంబంధాలున్నాయి. కేరళలో కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీ మధ్య వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోరాటమే జరగనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ తనతో కలిసి, వామపక్షాలను ఎన్నికల రణరంగంలో ఢీకొనడానికే ఇష్టపడుతుందన్న సంగతి కూడా మమతమ్మకు బాగా తెలుసు. ఒకవేళ కాంగ్రెస్-సిపిఎంలు కలిసి బెంగాల్ ఎన్నికల్లో పోటీచేయాలని నిర్ణయించుకున్నా, దీదీ అంత తేలిగ్గా వదిలిపెట్టదు. తక్షణమే సోనియా, రాహుల్‌లతో మంతనాలు జరిపి వారిని ఒప్పించి మరీ 2011 నాటి రెండు పార్టీమధ్య కుదిరిన అంగీకారాన్ని పునరుద్ధరింపజేసే చాతుర్యం మమతమ్మ సొంతం. అంతవరకు ఆమె నిద్రపోదు కూడా. స్థానిక కాంగ్రెస్ నాయకులు సిపిఎంతోపొత్తు పెట్టుకోవడానికే ఇష్టపడుతున్నారన్న సంగతి కూడా తృణమూల్ అధినేత్రికి బాగా తెలుసు. జాతీయ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీలతో పోలిస్తే తృణమూల్ కాంగ్రెస్ వల్ల మాత్రమే సోనియాగాంధీకి ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నది వాస్తవం.
ఈ విషయంపై సిపిఎం పోలిట్ బ్యూరో ఈనెలాఖరులో తగిన నిర్ణయం ప్రకటించవచ్చు. తమ పశ్చిమ బెంగాల్ యూనిట్ రాజకీయ వ్యవహార శైలి అతిగా ఉన్నదని సిపిఎం భావిస్తోంది. ఇక బుద్ధదేవ్ భట్టాచార్జీ సమస్యను రాష్ట్ర రాజకీయాలను మరింత సంకుచిత దృక్కోణంలో వీక్షిస్తున్నారు. రాష్ట్ర యూనిట్ చాలా వరకు హర్‌కిషన్ సింగ్ సూర్జిత్ భావజాలానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడ గమనార్హం. ఈ విషయంలో ఈ యూనిట్ ప్రకాశ్ కారత్ కంటే, సుర్జిత్‌కే ప్రాధాన్యతనిస్తున్నది. 2008లో నాటి యుపిఎ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించిన తర్వాత, వామపక్షాలు కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయాయి. క్రమంగా జాతీయ రాజకీయాల్లో తమ పాత్ర నామమాత్రమవుతున్నదన్న అంశాన్ని సిపిఎం గుర్తించింది. ఇక 2016లో జాతీయ రాజకీయాల్లో లెఫ్ట్ పార్టీల ప్రభావం స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని స్థాయికి దిగజారిపోయింది.
వామపక్షాలు తమకున్న వాస్తవ బలానికంటే అధికంగానే ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా మేధావుల్లో ఆ పార్టీలకున్న పలుకుబడి, మీడియా సహకారం ఇందుకు కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన తర్వాత, మీడియా, మేధావుల్లో వామపక్షాలకున్న పలుకుబడి కొంత ఆ పార్టీకి బదలాయింపు జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ పీఠాన్ని హస్తగతం చేసుకోవడానికి ఇది కూడా ఒక కారణం. ఇక వర్తమాన పరిస్థితికి వస్తే, సిపిఎం మళ్లీ జాతీయ రాజకీయా ల్లో కీలకపాత్ర పోషించాలంటే కాంగ్రెస్ లేదా మరే ఇతర ప్రాంతీయ పార్టీల వెనుక నడవక తప్పదు. అప్పుడు మాత్రమే తిరిగి జాతీయ రాజకీయాల్లో ఒక ప్రత్యేక పాత్రను నిర్వహించే అవకాశం లభిస్తుంది.
ఒక దశలో సోనియాగాంధీ రాడికల్ సోషలిస్టు భావాలు కలిగిన పార్టీని అక్కున చేర్చుకోవాలని భావించిన మాట వాస్తవం. కానీ చివరకు ఆమె విస్తృత ప్రాతిపతికన బలిష్టమైన కూటమి ఏర్పాటుకే సుముఖత చూపుతున్నారు. ముఖ్యంగా ఎంతో బలపడిన భాజపా నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య సంఘటనను 2019 ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే అదొక్కటే మార్గమని ఆమె భావిస్తున్నారు. ఇక రాజకీయ లెక్కల విషయానికి వస్తే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సిపిఎం అధినేత సీతారామ్ ఏచూరి కంటే నాలుగడుగులు ముందే ఉన్నారు. సిపిఎం యేచూరి మార్గం లో పయనించాలన్న తార్కిక నిర్ణయానికి వచ్చి,కాంగ్రెస్‌తో మిత్రత్వం నెరపినట్లయితే, పరిస్థితి మరింత మెరుగ్గా ఉండేది. మరి అది జరగాలంటే సిపిఎం, ప్రస్తుత కాలానికి అవసరంలేని పురాతన సిద్ధాంతాలను, ఎంత వేగంగా పక్కన పెడితే అంత మంచిది.

- స్వపన్ దాస్‌గుప్తా