మెయన్ ఫీచర్

తైతక్కలాడుతున్న తిండి జాడ్యం...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బడి వదలి పెట్టే సమయానికి వర్షం ప్రారంభమైంది... అందువల్ల ఐదేళ్ల పాపను అమ్మమ్మగారు చేయి పట్టుకొని ‘బరబరా’లాక్కెళ్లుతున్న దృశ్యం ఆ వీధిలో ఆవిష్కృతమైంది... వడివడిగా నడవకపోతే తడిసి ముద్దయిపోయే ప్రమాదం ఉంది, చిరుజల్లులు వెల్లువలా మారకముందే పాపాయితో సహా అమ్మమ్మగారు ఇల్లుచేరుకోవాలి మరి!! అయినప్పటికీ వానలో నానక తప్పని స్థితి... ఇంత ‘హడావుడి’లోను అమ్మమ్మగారు ఆ దుకాణం ముందు ఆగారు, లావుపాటి ఖరీదైన ‘ఐస్‌క్రీమ్’ను ‘పుల్ల’తో సహా కొనేశారు! ఆ వానలో ‘ఐస్‌క్రీమ్’ ఎందుకని ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు! ‘ఐస్‌క్రీమ్’లను ఆరగించడం ఆధునిక నాగరికతా ప్రస్థాన క్రమంలో సమున్నత శిఖరారోహణం వంటిది! ఎడమ చేత్తో పట్టుకొని ‘స్టెయిల్’గా తింటే అది మరింత నాగరికత! ఇదంతా జీవన వ్యవహారం! ‘కాన్సర్’ వ్యాధి పాలవుతున్న ప్రతి పది మందిలో తొమ్మిది మందికి ఈ జబ్బు రావడానికి కారణం ‘‘జీవన వ్యవహార పద్ధతి’’అని అమెరికాలోని ‘స్టోనీ బ్రూక్’ అన్న విశ్వవిద్యాలయానికి చెందిన శాస్తవ్రేత్తల అధ్యయనంలో ధ్రువపడిందట, మాధ్యమాలలో ప్రచారవౌతోంది! మన దేశంలో ‘‘జీవన వ్యవహారం’’అని అంటే ఏమిటి?? ‘ఐస్‌క్రీమ్’లు తినడం, చాక్లెట్లు నమలడం... నమిలి నమిలి దవడ పళ్లన్నీ పుచ్చిపోయిన తరువాత డాక్టర్ వద్దకు వెళ్లడం! అక్కడ... ఆ వీధిలో ఆ వానలో ‘ఐస్‌క్రీమ్’ను కొన్న అమ్మమ్మగారు ఒక చేత్తో పాపను మరో చేత్తో ‘ఐస్‌క్రీమ్’ను పట్టుకోవడం గృహోన్ముఖ గమనంలో రెండవ ఘట్టం! గబగబా నడుస్తూనే అమ్మమ్మగారు ‘ఐస్‌క్రీమ్’ను పాప నోటికి అందించబోయారు. పాప ‘‘వద్దన్నట్టు’’ తలను అడ్డంగా ఊగించింది! అమ్మమ్మగారు ‘ఐస్‌క్రీమ్’ను తమ నోటికి ఎత్తుకున్నారు... ఆ తరువాత పాపకు తినిపించడానికి యత్నించడం, పాప తినడానికి నిరాకరించడం, అమ్మమ్మగారు తామే నాకేయడం, మింగేయడం పునరావృత్తికి గురిఅయిన దృశ్యపరంపర! వారిద్దరూ ఆ వీధి మలుపు తిరిగేలోగా అమ్మమ్మగారి నోటిగుండా ‘ఐస్‌క్రీమ్’ మొత్తం ఆమె కడుపులోనికి వెళ్లిపోయింది! అమ్మమ్మ ‘పుల్ల’ను విసిరిపారేసింది... వర్షం కురుస్తూనే ఉంది!
ఆధునిక నాగరికతా వర్షధారలతో తడిసి ముద్దయిపోతున్న భారతీయ జన జీవన క్షేత్రంపై ఆవిష్కృతవౌతున్న అసంఖ్యాక చిత్ర విచిత్రాలలో ఇది ఒకటి మాత్రమే! నెజల్-నెస్లే-అన్ని స్విట్జర్లాండ్ వాణిజ్య సంస్థవారు తయారుచేసిన ‘ఐస్‌క్రీమ్’వంటి పదార్థాలలో ఆవుదూడల కడుపులోని లేత మాంసం- రెనె్నట్- కల్తీ అయిందని దశాబ్దికి పూర్వమే ప్రచారమైంది! ‘నెస్లే’వారి ‘చాక్లెట్ల’లో కూడ ఈ ‘మాంస ఖండాలు’ మిళితమై ఉండడం ‘సంస్థ’వారే అనేక ఏళ్ల పూర్వం అంగీకరించిన వాస్తవం! గోవంశ పరిరక్షణ ఉద్యమం ఉద్ధృతవౌతున్న మన దేశంలోనే ఇలాంటి ‘చాక్లెట్ల’ను టన్నులకొద్దీ జనం చప్పరించేస్తూ ఉండడం ‘సమాంతర’ విపరిణామం! ఆ ‘నెస్లే’సంస్థవారు కూడ ‘‘్భరతదేశంలో వీటిని అమ్మరాదు....’’అని ‘చాక్లెట్ల’ తొడుగుపై ముద్రించారట! ఆ అక్షరాలు ఎవ్వరికీ కనపడవు! గబగబా పై ‘తొడుగు’ చింపేసి ‘చాక్లెట్ల’ను ‘ఆబగా’ నోట్లో కుక్కుకోవడం ఆధునిక నాగరికతా జీవన వ్యవహారం! ‘‘పళ్లు మా త్రమే పుచ్చిపోతాయన్నది’’ అందరికీ తెలిసిన సత్యం! చాక్లెట్లు, ఐస్‌క్రీమ్‌లు, పిజ్జాలు, బర్గర్‌లు, రోడ్డుపక్కన ‘బండి’మీది ‘బజ్జీ’లు తినేయడంవల్ల ఇరవై ఏళ్లలోపు వారికే ‘బానల’వంటి, ‘కుండల’వంటి, ‘బెలూన్ల’వంటి ‘బూడిద గుమ్మడికాయల’వంటి రకరకాల ఆకారాలలో పెద్ద బొజ్జలు ఏర్పడిపోతుండడం ఆధునిక జీవన రీతి! ఈ ‘బొజ్జల’ యువజనులు ‘‘సూర్య నమస్కారాలు’’ చేయరు, చేయలేరు! ఎందుకంటె ఇలా చేయడానికి నడుం వంచి చేతులతో నేలను తాకాలి! అలా ‘వంగడం’ అన్నది వృద్ధులకు, మధ్యవయస్కులకు మాత్రమేకాదు ‘యువజనుల’కు కూడ చాలా కష్టమైన పని! ఎందుకంటె ముందుకు విస్తరించిన ‘బొజ్జలు’ వంగనీయవు! తల్లిదండ్రులకు పెద్దలకు గురువులకు పాద నమస్కారం చేసే పద్ధతి ఇప్పుడు యువజనులకు తెలియని ‘విద్య’... ‘బొజ్జలు’ వంగనీయవు!! ‘‘వంగలేరు’’ కనుక కాళ్లను ‘టేబిల్’మీదికి, ‘‘స్టూల్’’ మీదికి లేపి బూట్ల’ను ధరిస్తున్నారు!! ఇదీ మన జీవన రీతి...
ప్రధానమంత్రి! నరేంద్రమోదీ కృషి ఫలితంగా అంతర్జాతీయ యోగ దినోత్సవాలను జరపడం మొదలైంది. కానీ ‘యోగం’ జన్మించిన భూమిలో మాత్రం ‘్భగం’ పేరుతో ‘రోగం’ వ్యాపిస్తోంది! శీతల పానీయాలు తాగడంవల్ల వాటిలో నిక్షిప్తమైఉన్న పురుగులను నశింపచేసే రసాయన విషా లు మన కడుపును సైతం కోస్తున్నాయి. డిసెంబర్ ఇరవయ్యవ తేదీన జరిగిన రాష్ట్రాల ‘పోలీస్’ అధిపతుల సమావేశంలో ప్రసంగించిన నరేంద్రమోదీ- పోలీసులు యోగాభ్యాసం చేయాలని ప్రతి పోలీస్‌స్టేషన్‌లోను ఒక ‘యోగ’శిక్షకుణ్ని- మాస్టర్- నియమించాలని సూచించి ఉన్నాడు! ఈ సూచన అమలు జరిగినట్టయితే కనీసం పోలీసుల ‘జీవన రీతి’లోనైనా ఆరోగ్య ప్రవర్థకమైన మార్పులు రావడం ఖాయం! సూర్యోదయానికి ముందు నిద్రలేచే ‘జీవన రీతి’ని పునరుద్ధరించడంవల్ల ఆధునిక నాగరికతలో భాగమైపోయిన అనేక చిత్రవిచిత్ర శారీరక వ్యాధులను మాత్రమేకాక మానసిక వ్యాధులను సైతం దూరం చేసుకోవచ్చు! కానీ దేశ ప్రజలలో అత్యధికులు, విద్యావంతులు దాదాపు తొంబయి శాతానికి పైగా సూర్యోదయం తరువాతనే నిద్రలేస్తున్నారు. ఎనిమిదిన్నరకు తొమ్మిది గంటలకు నిద్రలేవడం, ‘‘పరాపరా’’ పళ్లు ‘బ్రష్’చేయడం.... వెం టనే జరిగిపోతున్న తక్షణ కర్తవ్యం ‘బ్రేక్‌ఫాస్ట్’ను మింగేయడం! కొంతమంది ఉదయం పదకొండుకు ‘బ్రేక్‌ఫాస్’ - అల్పాహారం- తినేసి మధ్యాహ్నం మూడునాలుగుగంటల మధ్య భోజనాలు చేస్తున్నారు. రాత్రిపూట పదకొండు గంటలకు భోజనం.... ఈమధ్యలో ‘‘నోళ్లు ఆడుతూ నే’’ ఉంటాయి! కాన్సర్, మధుమేహం, మూత్రపిండాలు మూల పడడం వంటి రోగాలు ఇలా అనేక రోగాలు వస్తున్నది ఇలాంటి జీవన రీతివల్ల మాత్రమే! వంటలలో ‘పసుపు’ను వాడడంవల్ల కాన్సర్ రాకుండా నిరోధించవచ్చునని, ‘మెంతులు’ వాడడంవల్ల మధుమేహం- డయాబిటిస్- రోగాన్ని దూరంగా ఉంచవచ్చునని తెలుసుకోవడం ‘మత వ్ఢ్యౌం’గా ప్రచారవౌతున్న రోజులివి! సూర్యోదయానికి ముం దు నిద్రలేచి ‘ఆవు పంచితం’- గోమూత్రం తో- ముఖాన్ని నోటిని కడిగి ‘కొంచెం పం చితాన్ని’ తాగిన వారికి జీవితమంతా ఏ జబ్బులూ రాలేదు! ఆ రీతి ఇప్పుడు అడుగంటిపోయింది! దేశవాళీ ఆవులను దశాబ్దులపాటు శతాబ్దులపాటు హత్యచేసి మాం సాన్ని ఎగుమతి చేసేయడం ‘జీవన పద్ధ తి’గా మారిపోవడం చిత్ర విచిత్ర వ్యాధులకు కారణం. ఆవులు లేవు! అందువల్ల ‘గోమూత్రం’ద్వారా తయారైన ‘అర్కాన్ని’ ఉదయానే్న సేవించవచ్చు!! కానీ ఈ ‘అర్కం’ వాసన తమకు పడదని అధికాధికులు అంటుండడం ‘కాన్సర్’వంటి వ్యాధులను విస్తరింపచేస్తున్న ‘జీవన రీతి’...
కల్తీ నూనె, కల్తీ పిండి, కల్తీ చక్కెర, కల్తీ ఆవాలు, కల్తీ నీళ్లు, కల్తీ ఉప్పు, కల్తీకారం- ఇలా సర్వం కల్తీఅయిన ‘్ఫస్ట్ఫుడ్ సెంటర్ల’ లోను, వీధుల పక్కన దుకాణాలలోను నిరంతరం ‘ఆబాలగోపాలం’ ఆబగా ఆరగిస్తుండడం నేటి జీవన నీతి! ‘కల్తీ’వల్ల కాన్సర్ దాపురిస్తోంది, బొజ్జలు లావయి నడవడం మరచిపోతున్నాము!! అన్ని వ్యాధులకూ వౌలిక కారణం ‘కల్తీ’ తిండి! ‘నెజల్’కంపెనీ వారి సేమ్యాలు, ‘పెప్సీ’వారి ‘కోలా’లు, కల్తీమందులు బ్రిటిష్ భావదాస్యంతో ‘కల్తీ’అయిపోయిన భారతీయ ఆధునిక జీవన రీతికి కొన్ని ప్రతీకలు మాత్రమే....రోగాలు ఎందుకు రావు??
హిమాలయం నుంచి బయలుదేరిన రెండు పక్షులు ‘కోరుక్’- కః అరుక్- ఎవరు రోగికాదు??- అని అరచుకుంటూ కేరళ వరకు విహరించాయట! వందలాది ప్రదేశాలలో వైద్యుల ఇళ్లవద్ద, విజ్ఞుల ఇళ్లవద్ద, ప్రముఖుల ప్రాంగణాలవద్ద, సామాన్యుల ముంగిళ్లవద్ద ఈ జంట పక్షులు ఆగాయి... ‘కోరుక్?’’-అని అరిచాయి. అర్థంకాని అందరూ ఆ పక్షులను తరిమివేశారు, కేరళ ప్రాంతంలోని ఒక నదీతీర గ్రామంలో ఒక వైద్యుడు ఇంటి బయట చెట్లమధ్య పువ్వుల పరిమళాల మధ్య కూచుని ‘కల్వం’లో మందులను నూరుతున్నాడు! అక్కడికెల్లి ఈ పక్షులు కూచున్నాయి! మళ్లీ యధావిధిగా అరిచాయి! ‘‘కోరుక్?’’అన్న పక్షులకు సమాధానంగా ఆ వైద్యుడు ‘‘హితభుక్’’- మంచి పదార్థాలను తినేవాడు రోగికాడు- అని అరిచాడట! ఆ పక్షులు రెండవసారి కూడ ‘‘కోరుక్’’అని అరిచాయి! సమాధానం ‘‘మితభుక్’’- మితముగా తినేవాడు-అన్నది......ఆ పక్షులు మళ్లీ ‘‘కోరుక్’’అని అరిచాయట! ‘‘సమయభుక్’’ అని వైద్యుడు సమాధానం చెప్పాడు. ప్రతిరోజు నిర్దిష్ట సమయంలో భోజనం చేసేవాడు రోగగ్రస్తుడుకాడు....పక్షులు ఇంకొకసారి కూడ ‘‘కోరుక్’’ అని అరిచాయట! ‘‘హితమిత సమయభుక్’’అని వైద్యుడు ముక్తాయించాడు! హితంగా, మితంగా, సమయానికి తినేవాడు రోగగ్రస్తుడు కాడు... సంతృప్తిచెందిన పక్షులు మళ్లీ శివాలయాలవైపు పయనం సాగించాయి. ఆ పక్షులు అశ్వనీ దేవతలు అన్నది ఆ వైద్యుల నిర్ధారణ!! ప్రముఖ వైద్య శాస్తజ్ఞ్రుడు స్వర్గీయ ఇటికాలపాటి సంజీవరావుచెప్పిన సనాతన జీవనరీతి ఇది!
ఈ రీతి భ్రష్టుపట్టిపోవడంవల్లనే ఆధునిక సమాజాన్ని రోగాలు అలముకుంటున్నాయి. ఈ రోగాలను నయంచేసే ‘ప్రక్రి య’ బహుళజాతీయ వాణిజ్యసంస్థల దోపిడీకి ఆలవాలమైపోయింది! ఈ ప్రక్రియ కూడ ‘కల్తీ’అయిపోయింది! ‘రుక్కు’అని అంటే ‘రోగం’, ‘ఋక్కు’అని అంటే వేదం! ‘‘ఋగ్వేదాన్ని’’ ‘‘రుగ్వేదం’’గాను, ‘‘ఋత్విక్కుల’’ను ‘‘రుత్విక్కులు’’గాను వ్రాసి భాష ను ‘సైతం’‘కల్తీ’ చేయడం భావదాస్యగ్రస్తుమైన జీవన నీతికి పరాకాష్ఠ... తిండి కల్తీకావడానికి ప్రాతిపదిక మన సమష్టి స్వభావం ‘కల్తీ’కావడం!! పిల్లలు వృద్ధులు రోగులు కాయకష్టంచే శ్రమ సౌందర్య జీవనులు ఎక్కువసార్లు తినవచ్చు... కానీ ఆరోగ్యవంతులైన మిగిలినవారు రోజునకు రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలన్నది భారతీయ సనాతన జీవన రీతి! కానీ ఎక్కువసార్లు ఇలా తినకూడని వారు ‘‘మేము సంపాదిస్తున్నాం... మేము తింటున్నాం’’ అన్న అహంకారంతో రోజంతా తింటూనే ఉన్నారు. ఎన్నిసార్లు తిన్నప్పటికీ జీర్ణించుకోగలిగిన శరీర శ్రమజీవులకు మాత్రం రెండుపూటల తిండి కూడ దొరకని వికృత జీవనరీతి విస్తరించిపోతోంది....
ఆర్జించేవారు ఆరగించడం ‘ప్రకృతి’! ప్రకృతిలోని సమస్త జీవజాలం ఈ పనిచేస్తోంది! ఇతరుల నోరు కొట్టి తినేయడం మానవులకు పరిమితమైన ‘వికృతి’! ఆర్జించేవారు ఇతరులను ఆదరించడం మానవులకు సాధ్యమైన ‘సంస్కృతి!’ ‘‘తినడం’’ ఇలా ప్రకృతి, ఇతరుల తిండిని దోచుకోవడం వికృతి, ‘‘తినిపించడం’’ సంస్కృతి! మన జీవన రీతి ఏది??

-హెబ్బార్ నాగేశ్వరరావు