మెయన్ ఫీచర్

భావ ప్రకటన స్వేచ్ఛా? బరితెగింపా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ నడిబొడ్డున విదేశీ గళానికి మరో రూపం వికటాట్టహాసం చేసింది. పాకిస్తాన్ అనుకూల శక్తులు సాంస్కృతిక ఉత్సవం2 పేర తీవ్రవాదులకు జయగానం చేశారు. కళాశాల విద్యలో ఏనాడైనా జనగనమన పాడేరో లేదో కాని కరువుతీరా అరువు తెచ్చుకున్న భారత వ్యతిరేక నినాదాలతో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ ప్రాంగణం హోరెత్తించారు. నింగికెగసిన నెహ్రూ సైతం కమ్యూనిస్టులతో కలిసి తన కూతురు ఇందిర చేసిన నిర్వాకం చూసి నిర్ఘాంతపోయి ఉంటారు. దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి 9వ తేదీ జరిగిన విద్యార్థులనబడే కొందరు అరాచక శక్తులు జెఎన్‌యులో పేట్రేగిపోయిన వైనం చూసి జాతిమొత్తం నివ్వెరపోయింది.
మరోపక్క దేశ సరిహద్దులను కాపాడుతూ సియాచిన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగిపడి పదిమంది జవానులు వీరమరణం పొందారు. వారి భౌతిక శరీరాలను బయటకు తీసేందుకు మరో రెండువందల మంది సైనికులు 20,500 అడుగుల ఎత్తుల మైనస్ 25 నుంచి మైనస్ 45 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో తలొకరు నలభై కిలోల బరువు మోస్తూ అవస్థలు పడుతున్నారు. ఈ బరువులో డ్రిల్లింగ్ పరికరాలు, రంపాలు, ఇతర ప్రత్యేక సామగ్రి ఉన్నాయి. 25 నుంచి 30 అడుగుల లోతులో, 800 మీటర్లనుండి 1000 మీటర్ల వార మంచు చరియలు మరణించిన జవాన్లను కప్పివేశాయి. కాంక్రీటుకంటే గట్టిదైన నీలిరంగు మంచును ఛేదించేందుకు, తమ సహచర వీర సైనికులను వెదికేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఆరురోజులపాటు రాత్రింబవళ్లు వారు శ్రమించారు. రాత్రిళ్లు అక్కడ వెలుగును సృష్టించేందుకు గ్యాలన్లకొద్దీ కిరోసిన్ కావాలి. అందుకోసం వందల గంటలపాటు హెలికాప్టర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఆ పనిలో నిమగ్నమైన వారికి ఆహారం కావాలి. వైద్యం, మందులు కావాలి. వాతావరణ తీవ్రతను వారు పరిగణనలోకి తీసుకోవాలి. ఇన్ని విపత్కర పరిస్థితల మధ్య వారి ఆశలు ఆవిరైపోతున్న క్షణాన వారు లాన్స్‌నాయక్ హనుమంతప్పను బయటకు లాగారు. వారు ఆనందంతో ఉప్పొంగిపోయారు. ఒక సరిహద్దు రక్షకుడ్ని రక్షించామన్న గర్వం వారి పెదవులపై తొణికిసలాడింది. వెంటనే ప్రాణాలతో ఉన్న హనుమంతప్పను ఆర్మీ రీసెర్చ్ రిఫరెల్ ఆసుపత్రి ఢిల్లీకి చేర్చారు. వైద్యులు శ్రమించారు. కానీ ఫిబ్రవరి 11న ఆ వీరుడు అంతిమ శ్వాస విడిచాడు.
ఒకే రోజున జరిగిన ఈ రెండు సంఘటనల్లో ఎంతటి అంతరముంది? అవును! జనం వివేకంతో, విచక్షణతో ఆలోచించాల్సిన విషయమెంతో ఉంది. ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో భారత వ్యతిరేక నినాదాలు చేసిన సంఘటనలో పోలీసులు కేసు నమోదు చేసారు. జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు, ఎఐఎస్‌ఎఫ్‌కు చెందిన కన్హయ్య కుమార్‌ను అరెస్టు చేసారు. కేవలం భారత వ్యతిరేక నినాదాలే కాకుండా తీవ్రవాదులై శిక్షలు పొందిన అఫ్జల్‌గురు, మక్బూల్ భట్‌లను వీరు కీర్తించడం, తీవ్రవాదులకు అనుకూలంగా నినాదాలు ఇవ్వడం చూస్తుంటే జెఎన్‌యు దేశద్రోహులకు కేంద్రమైందని అర్ధం అవుతోంది. ఈ ఘటన జరిగిన తర్వాత జీన్యూస్‌లో సుధీప్ చౌదరి, టైమ్స్‌నౌల అర్నబ్ గోస్వామి ఈ ఘటనల వైపరీత్యాన్ని వివరంగా దేశ ప్రజల ముందుంచారు. ఒమర్, లెనిన్, యిషాంత్‌లనబడే ముగ్గురు విద్యార్థులను స్టుడియోకి పిలిచి మరీ అర్నబ్ గోస్వామి తీవ్రంగా మందలించాడు. లాన్స్‌నాయక్ హనుమంతప్ప గురించి చెబుతున్నప్పుడు ఒమర్ అడ్డుపడి నవ్వుతుంటే అర్నబ్ గోస్వామి తీవ్ర స్వరంతో 3నీకు జవానులంటే గౌరవముందా? నేను ఓ వీర సైనికుడ్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అడ్డుపడతావా? నీకు సంస్కారం ఉందా? నిన్ను మాట్లాడనివ్వను, మంచు చరియల్లో వేల అడుగుల ఎత్తులో దేశంకోసం వీరుడైపోయిన హనుమంతప్ప ఎక్కడ? దేశం నడిబొడ్డున జెఎన్‌యు కాంపస్‌లో కూర్చుని తీరికగా భారత వ్యతిరేక నినాదాలిచ్చే నువ్వు నీ సహచర బృందం డొల్లతనం ఎక్కడ? భారతీయుల సహనాన్ని పరీక్షిస్తారా?2 అంటూ తీవ్ర పదజాలంతో దూషించాడు.
హఠాత్తుగా వీరికి కాశ్మీరుపై ప్రేమ పుట్టింది. గత 10 నెలలుగా ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ ప్రజలను వీరు నినాదాలతో రెచ్చగొట్టారు. కాశ్మీరుకు స్వాతంత్య్రం కా వాలంటూ నినాదాలిచ్చారు. 3కాశ్మీరు పండితుల గురించి వారు పడ్డ బాధల గురించి వారిని కాశ్మీర్ లోయనుంచి గెంటివేసిన వైనం గురించి ఈ నాయకులెందుకు మా ట్లాడడం లేదని2 కొందరు విద్యార్థులు వి ద్యార్థినులు ప్రశ్నించడం ఆ గందరగోళంలో కొన్ని చానళ్లలో కన్పబడింది.
3్భరత్ గోబ్యాక్, మేము భారత్‌ను నాశనం చేసేదాకా యుద్ధంచేస్తాం2 అంటూ నినాదాలిచ్చిన ఈ విద్యార్థి మూక వెనుక ఐఎస్‌ఐ హస్తముందని పలువురు రక్షణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కొందరు దేశ వ్యతిరేకులు తుపాకులు పట్టుకుని క్యాంపస్‌లోకి ప్రవేశించారని, ఇలా ఎప్పుడూ జరగలేదని, ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి విచారణ జరగాలని జెఎన్‌యు విద్యార్థి సంఘం సంయుక్త కార్యదర్శి ఎబివిపికి చెందిన శ్రీ సౌరభ్‌శర్మ అన్నారు.
సాంస్కృతికోత్సవం పేర, భావ ప్రకటనా స్వేచ్ఛ పేర, బరితెగించిన ఈ విద్యార్థి ఉద్యమకారులు జాతిమొత్తం వెనుదిరిగి నినదించేసరికి ఈ సంఘటనలతో తమకు సంబం ధం లేదంటూ తప్పించుకోవాలని చూస్తున్నారు. ఏ దేశంలోనూ ఈ ఘోర కలిని చూడం. 1918లో అర్జెంటీనీనాలో విద్యార్థులు కార్టోబా విశ్వవిద్యాలయంలో జాతీ య జెండా గౌరవం కాపాడారు. 2012లో కెనడాలో అధిక విద్యార్థి రుసుములకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు. మనదేశంలోనూ ఇది మామూలుగా జరిగేదే! 2011-13లో చిలీలో విద్యార్థులు విద్యావిధానంలో మార్పుకై పోరాటం చేసా రు. అందరు విద్యార్థులకు సమాన విద్యా హక్కులుండాలని వాదించారు. 1919లో చైనాలో మూడు వేలమంది పెకింగ్ విశ్వవిద్యాలయ విద్యార్థులు తియానానె్మన్ స్క్వేర్‌లో జరిపిన ప్రదర్శన చైనా కమ్యూనిజానికి పురుడు పోసింది. అయితే 1989లో ఇక్కడే మళ్లీ నాటి చైనా ప్రభుత్వం విద్యార్థులు ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తే అణచివేసింది. 1956లో హంగరీ విప్లవం వెనుక ప్రశాంతంగా విద్యార్థులు జరిపిన పోరాటం వుంది. 1969లో జెకోస్లొవేకియా విద్యార్థుల పోరాటం వల్ల రష్యా ఆక్రమణలనుంచి జెకోస్లోవేకియా బయటపడే అవకాశం కలిగింది. 1998లో సెర్బియాలో రాజు నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడారు. ఇది తదనంతరం జార్జియా, ఉక్రెయిన్, కిర్కిస్తాన్, అల్బేనియాల్లో జరిగిన ఉద్యమాలకు ఊతమిచ్చాయి. వీటిని 3రంగు2 విప్లవాలు అన్నా రు. ఫ్రాన్సులో 1968లో విద్యార్థులు ఫ్రాం కో నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. 1960లో జర్మనులో విద్యార్థులు నాజీల నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. 1960లో ఇండోనేషియాలో విద్యార్థులు రాజు సుకర్ణోను ప్రభుత్వంలో కమ్యూనిస్టులను తొలగించమంటూ ఉద్యమించారు.
ఇరాన్‌లో విద్యార్థులు మతవాద ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా పోరాటం జరిపారు. ఇందుకోసం అనేకమంది విద్యార్థులు ప్రాణత్యాగం చేసారు. ఇజ్రాయిల్‌లోప్రతి విద్యార్థి తమ చదువు తరువాత మూడేళ్లపాటు సైన్యంలో పనిచేస్తారు. చైనా లో 1957-59 మధ్య సంభవించిన కరువులో మూడు కోట్లమంది చనిపోయిన విషయాన్ని ఆ దేశ యువకులు సవాలుగా తీసుకున్నారు. ఈ వార్త 1986లో బయటకు వ చ్చింది. దక్షిణ కొరియాలో రాజ్యాంగ సవరణలపై విద్యార్థులు చేసిన పోరాటం సఫలమైంది. 1975లో మనదేశంలో విద్యార్థులు అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరా టం చేసారు. అస్సాంలో విదేశీయుల విషయమై విద్యార్థి ఉద్యమాలు జరిగాయి. ఇప్పటికీ అస్సాంలో ఆల్ అస్సాం స్టూడెం ట్స్ యూనియన్ బలీమైన శక్తి.
మరి ఢిల్లీ జెఎన్‌యులో ఫిబ్రవరి 9నాడు విద్యార్థులు జరిపిన ప్రదర్శనలో పరాయి దేశ ప్రయోజనాలు ప్రస్ఫుటించడం ఎలా న్యాయమవుతుంది? విద్యార్థుల సమస్యలపై దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించకుండా దేశవ్యతిరేక కార్యకలాపాలపై వారు ప్రదర్శన జరిపితే అది పైశాచిక, పంచమాంగ దళ ప్రహసనం తప్ప, శత్రుదేశానికి సహకరించడం తప్ప మరొకటి కాదు. ఈ విషయమై ప్రభుత్వం నిఘా పెంచాలి. ప్రజలకు రక్షణ భరోసా కలిగించాలి.

చిత్రం... జెఎన్‌యు విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్య కుమార్‌ను విడుదల చేయాలని చేస్తున్న విద్యార్థుల నిరసనలో పాల్గొన్న రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

-తాడేపల్లి హనుమత్‌ప్రసాద్ సెల్ - 967619088