మెయిన్ ఫీచర్

ఆనందం.. ఆస్కారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దటీజ్ ప్రి.చో-

ఓ సెనే్సషన్. ఒకప్పుడు ఆస్కార్ రెడ్‌కార్పెట్‌పై క్యాట్‌వాక్ అందాలు ప్రదర్శించేందుకే భారత్‌కు అవకాశం దక్కితే -ఓహ్ అనుకున్నాం. ఆస్కార్ వేడుకలో సందడి చేయడానికి రమ్మంటూ వరుసగా ఆహ్వానాలు అందుకున్న ఎవర్‌గ్రీన్ మిస్ వరల్డ్ ఐశర్యను చూసుకుని మురిసిపోయాం. రెడ్‌కార్పెట్‌పై వైట్‌ఫ్రాక్‌తో క్యాట్‌వాక్ చేసిందని, రెడ్‌కార్పెట్‌పై పింక్‌రెడ్ షిఫాన్‌తో హోయలు పోయిందని గర్వంగా చెప్పుకున్నాం. 88వ ఆస్కార్ అవార్డు ఫంక్షన్‌లో భారత్ అందానికి మరో గొప్ప గౌరవం దక్కింది. భారతీయకు ఆ గౌరవాన్ని మోసుకొచ్చిన అందం పేరే -ప్రి.చో. బాలీవుడ్‌లో తన సత్తా చాటుకుని అటు హాలీవుడ్‌లోనూ నటనా ప్రతాపాన్ని రుచి చూపించే ప్రయత్నాల్లో బిజీగావున్న ఆమె -ప్రియాంక చోప్రా. ఆస్కార్ విజేతలకు అవార్డులు అందించే అత్యంగ గౌరవాన్ని ప్రియాంక దక్కించుకుంది. ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసిన మొట్టమొదటి భారతీయురాలిగా గౌరవాన్ని దక్కించుకుంది గ్రేట్ ప్రి.చో-

వైట్‌ఫ్రాక్‌లో మెరిసిన ప్రియాంక చోప్రా

హాలీవుడ్‌కు అతి పెద్ద సినిమా పండుగ. అమెరికా లాస్‌ఏంజెల్స్‌లోని డాల్మీ థియేటర్ -దిగొచ్చిన తారలతో తళుక్కుమంది. కళ్లుమిరుమిట్లు గొలిపే విద్యుత్ పచ్చిక బయలుపై -కలర్‌ఫుల్ తారల కేరింతలు కొత్త అందాలను చవిచూపించాయి. ఆ పండుగ అందరికీ
తెలిసిన, ప్రపంచం ఎదురు చూస్తున్న -88వ ఆస్కార్ అవార్డుల పండుగ. దృశ్య వైవిధ్యం, శబ్ధ సృజనాత్మకత, ఉత్కంఠ రేకెత్తించే కథా కథనాలకు పట్టంగట్టే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి సిద్ధం చేసిన వేదిక సైతం వైవిధ్యాన్ని సంతరించుకుంది. ఆహూతులే ఆశ్చర్యపోయేలా సిద్ధం చేసిన వేదికపై హాలీవుడ్ హాస్య నటుడు క్రిస్‌రాక్ మాటల తూటాలతో చెలరేగిపోయాడు. ప్రయోక్తగా అతను సంధించిన చతురోక్తులు -ఆహూతులకు పొట్టచెక్కలయ్యేలా నవ్వులు తెప్పించాయి. క్రిస్ తన చలోక్తులతో కార్యక్రమాన్ని రక్తికట్టించాడు. ఆద్యంతం నవ్వుల్లో ముంచెత్తాడు. అట్టహాసంగా ఆరంభమైన వేడుకలో దిగ్దింగతాల నుంచి దిగొచ్చిన తారాగణమంతా సందడి చేసింది. రెడ్‌కార్పెట్‌పై హొయలుపోయింది. వందలాది కెమెరా నేత్రాలకు పోజులిచ్చింది. వయ్యారాలేవో వొద్దికగా నడిచిపోతున్న భావన కలిగించింది. తారల క్యాట్‌వాక్కులు.. తీరైన హాట్‌లుక్కులు.. స్మైలీ చమక్కులు.. స్వీటీ పలకరింపులు... ఎటు చూస్తే ఎటువైపు ఏం మిస్సవుతామోనన్న ఫీలింగ్. ఆస్కార్‌లో భారత్‌కు ఎలాంటి ప్రాధాన్యతా లేదన్న బాధను పటాపంచలు చేసింది -ప్రి.చో. ఆస్కార్ అందలేదన్న విషయం మర్చిపోయేలా -విజేతలకు ఆస్కార్లు అందించే స్థాయికి భారత్ ఎదిగిందన్న భావన కలిగించింది. ఆస్కార్ విజేతలకు అవార్డులు అందించే అతిధిహోదా అందుకున్న మొట్టమొదటి భారతీయ నటిగా ప్రియాంక చోప్రా గౌరవాన్ని దక్కించుకుంది. హాలీవుడ్ భామలు వినూత్న వస్తధ్రారణలతో రెడ్ కార్పెట్‌పై హోయలొలికిస్తూ చేసిన క్యాట్‌వాక్కులు ప్రేక్షకుల మతులు పోగొట్టాయి. తొలిసారి ఆస్కార్ అవార్డు దక్కించుకున్న నటీనటుల ఆనందానికి అవధుల్లేవు. వేడుక సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

జతకలిసే...

chitram... దేదీప్యమానంగా వెలిగిపోయన ఆస్కార్ అవార్డుల వేదిక