మెయన్ ఫీచర్

జాతీయత కొడిగట్టిన ‘జనగణ’ములు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదరాసు ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంది. తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలల్లో ప్రతిరోజు జాతీయ గీతాన్ని-నేషనల్ యాంథమ్-ఆలపించాలని మార్చి ఐదవ తేదీన ఆదేశించింది! విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో విధిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాలన్న కేంద్ర ప్రభుత్వం వారి సూచన ఈ ఆదేశానికి నేపథ్యం! ఇంత కాలం తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలల్లో జాతీయ గీతం వినపడలేదన్నది మదరాసు హైకోర్టు వారు ఆదేశం జారీ చేయడానికి దారితీసిన పరిణామం! ఇది అట్టడుగు స్థాయి వైపరీత్యానికి దర్పణం! అత్యున్నత స్థాయిలో స్నాతకోత్తర విద్యార్థినీ విద్యార్థులకు నిలయమైన విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో జాతీయ పతాక ధ్యాస అడుగంటిపోయిందన్నది భరతమాత విస్మయ వీక్షణలకు కారణం! ఇలా పతాక ధ్యాస అడుగంటడంవల్లనే అఫ్జల్‌గురు వంటి దేశ ద్రోహిని ఆరాధించే మరింత మంది దేశద్రోహులు విద్యార్థుల ముసుగులలో విశ్వవిద్యాలయాల ప్రాంగణాలలో విశృంఖల విహారం చేయగలిగారు!
తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలలలో జాతీయ గీతాన్ని పాడడం లేదన్నది మదరాసు ఉన్నత న్యాయస్థానం దృష్టికి వచ్చిన వైపరీత్యం! దేశంలోని ఇతరేతర ప్రాంతాలలోని ప్రభుత్వేతర పాఠశాలలలోనైనా జాతీయ గీతాలాపన జరుగుతోందా? జనగణమన గీతం ప్రాధాన్యం, అర్ధం, స్ఫూర్తి, ఔచిత్యం తెలియని వారు ప్రభుత్వేతర పాఠశాలలను నిర్వహిస్తుండడం ప్రపంచీకరణ మాయా మారీచ మృగం కల్పించిన అద్భుతాలలో ఒకటి! అద్భుతాలు మహిమలు కావచ్చు మాయ లు కావచ్చు! దేవతలు సృష్టించే అద్భుతాలు మహిమలని రాక్షసులు పిశాచాలు కల్పించే అద్భుతాలు మాయలని అనాదిగా ఈ దేశంలోని జాతీయుల విశ్వాసం! ప్రపంచీకరణ కల్పిస్తున్న అద్భుతం దేశాల సరిహద్దులు చెరిగిపోవాలన్నది! ఇలా చెరిగిపోవడానికి మరో పేరు అంతర్జాతీయ అనుసంధానం...ప్రతిక్షణాన్ని ఆర్థిక మూల్యంతో లెక్కపెట్టడం, ప్రతిపనినీ వాణిజ్యపు గీటురాయిపై నిగ్గు తేల్చడం ప్రపంచీకరణ! సరిహద్దులు చెరగిపోయిన తరువాత రూపురేఖలను, విలక్షణ స్వభావ సంస్కారాలను కోల్పోయిన దేశాలు, జాతులు ఒకే ముద్దగా కలిసిపోవడం వాణిజ్య ప్రపంచీకరణ లక్ష్యం! అంతర్జాతీయ వనంలోని అన్నిరకాల పువ్వులు ఉమ్మెత్త పువ్వులవలె తెల్లబోయి ఉన్నాయి మరి! అన్ని మొక్కలు ముళ్లచెట్లు...అందువల్ల హంసలు, నెమళ్లు, కోకిలలు, చిలుకలు, గోరువంకల గళాలన్నీ కలగాపులగంగా కలిసిపోయి తెల్లటి వరాహ ధ్వనిగా గురుగురులాడడం ప్రపంచీకరణ! భాషలు, భావాలు, సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు, సంస్కారాలు, విద్యలు వినోదాలు అన్నీ వాణిజ్యపు వాసనల ముద్దగా కలిసిపోవడం ప్రపంచీకరణ...
ఈ ముద్దను శిశు విద్యార్థులు మొదలు స్నాతకోత్తర మేధావుల వరకూ ఆరగిస్తుండడం దేశ ప్రజల ఆధునిక జీవనం! జాతీయతను అత్యంత సహజంగా మన స్వభావాలనుంచి తొలగించి వేస్తున్న ప్రక్రియను ఆదర్శంగా ఆరాధిస్తున్న, ఆచరిస్తున్న మనం అప్పుడప్పుడు మాత్రం పూర్వ స్మృతిని పొంది వాపోతున్నాము! చేతులను వెనక్కి నెట్టేసి చెంచాలతో తింటున్నవారు, బురద నిండిన బూట్లను తొడుక్కుని పచార్లు చేస్తు పాముకుంటున్నవారు ప్రపంచీకరణ నిలబెట్టిన వనె్నల పతాకాలు! వీరికి జాతీయ పతాకం గురించి ఎందుకు తెలుస్తుంది? జాతీయ గీతం పాడితే మీకొచ్చే లాభం ఏమిటి? సాఫ్ట్‌వేర్ ఇంజనీరైతే అమెరికాకు వెళ్లవచ్చు...కోట్లు సంపాదించవచ్చు! ఇంగ్లీషును అమెరికా యాసలో అందుకే మాట్లాడాలి! తెలుగువల్ల లాభం ఏమిటి? కూటికొస్తుందా గుడ్డకొస్తుందా? అనడం ఫ్యానైపోయింది! ఓహో మీరు సంస్కృత భాషను ఉధ్ధరిస్తారా? అంటూ కట్టించుకున్న పళ్లతో ఎక్కిరిస్తున్న కామందులు నిర్ణాయకులుగా మారిపోతున్నారు!
నిద్రలేవగానే మాతృభూమిని నమస్కరించే సంస్కారాన్ని సంస్కృత భాష ఈ సనాతన జాతికి నేర్పించింది! ఈ సంస్కారానికి బయ్‌బయ్, టాటాలను చెప్పించినది ఏ భాష? భావ వ్యక్తీకరణకు మాధ్య మం భాష! ఇంగ్లీషు భాష మాధ్యమం ద్వారా వ్యక్తం కాని, ఈ మాధ్యమంలో ఇమడలేని భారతీయ సంస్కారాలన్నీ భగ్నమైపోతున్నాయి! ఒకప్పుడు సంస్కృత భాషామాధ్యమం ద్వారా జరిగిన జాతీయ జనజీవన వ్యవహారం ఇప్పుడు విదేశీయులు నెత్తికెత్తిపోయిన భాషలో జరుగుతున్నాయి! సంస్కృత భాషా మాధ్యమం భారతీయుడిని భారతీయుడిగా నిలబెట్టింది! ఆంగ్లభాషా మాధ్యమం అంతే సహజంగా భారతీయుడిని ఐరోపా వాసిగా పరివర్తన చేయించింది! ఇదంతా ప్రపంచీకరణకు రంగాన్ని సిద్ధం చేసిన పరిణామ క్రమం! ప్రపంచీకరణ జాతీయతా భావ నిష్ఠకు దాపురించిన చివరి జాడ్యం! విద్యారంగంలోనే కాదు అన్ని రంగాల్లోను మోడువారిన జాతీయతా భావ వృక్షాల పాలిట గొడ్డళ్లు వాల్‌మార్ట్, నెజ్లీ వంటి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు-మల్టీ నేషనల్ కంపెనీలు-! ఈ విదేశీయ సంస్థలలో ఉద్యోగాలు పొందడానికి అర్హులైనవారు భారత జాతీయ పతాకాన్ని గౌరవిస్తున్నారా లేదా అన్నది ఇంటర్వ్యూల పరిధిలో లేని పరీక్ష! అందువల్ల జనగణమన గీతాన్ని, వందేతరం గీతాన్ని పాడకపోయినా ఉద్యోగం వస్తుంది, విమానంలో విహరించవచ్చు! పాడితే ఏలాభం? నీకు జాతీయ గీతం, జాతీయ మంత్రం వచ్చునా అని ఉద్యోగార్ధులను ఉద్యోగ ప్రదాతలు ప్రశ్నలు వేయ రు! పిల్లలలో ఈ జాతీయతా నిష్ఠారాహిత్య స్థితిని నిర్మాణం చేస్తున్న తల్లిదండ్రులు! వారిలో కొందరు పాఠశాలలను స్థాపించి విద్యా వ్యాపారం చేస్తున్నారు...
ప్రపంచీకరణ దేశాల సరిహద్దులను చెరిపి వేసినట్టయితే మనం దేనికి కాపలా కాయాలి? దేన్ని రక్షించాలి అన్న ప్రశ్నలు బహుశా సైనికుల అంతరంగంలో అంకురిస్తూ ఉండవచ్చు! కానీ తమిళనాడులోని నివశిస్తున్న ఎన్.సెల్వితిరుమాల్ అన్న సజ్జనునికి ఈ ప్రశ్నలతో ఇఫ్పుడు అవసరం లేదు.ఎందుకంటే ఆయన మాజీ సైనికుడు! కానీ ఆయనను మరోప్రశ్నవేధించింది! పాఠశాలలల విద్యార్థులలో ఎంతమందికి జాతీయ గీతం గురించి, జాతీయ మంత్రమైన వందేమాతరం గురించి, జాతీయ పతాకం గురించి అవగాహన ఉంది? అన్నది ఆయన అంతరంగంలో అంకురించిన ప్రశ్న! ఆయన కొంతమంది ప్రాథమిక మాధ్యమిక పాఠశాలల పిల్లలతో ముచ్చటించాడు! జనగణమన గీతమా? బహుశా అది ఏదో సినిమాలోని పాట అన్నది ఆ ప్రభుత్వేతర పాఠశాలల పిల్లలు సెల్వితిరుమాల్ అన్న మాజీ సైనికునికి చెప్పిన పాఠం! సెల్వితిరుమాల్ అనేక పాఠశాలలను దర్శించాడు, ఆరాలను తీసాడు. ప్రభుత్వేతరులు నిర్వహిస్తున్న అనేక పాఠశాలల్లో జనగణమన గీతాన్ని ప్రతిరోజు పాడడం లేదన్నది ఆయన రట్టు చేయగలిగిన కార్పొరేట్ గుట్టు! సెల్వితిరుమాల్ దాఖలుచేసిన వినతి పత్రం ప్రాతిపదికగా మదరాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె.కౌల్, న్యాయమూర్తి ఎమ్‌ఎమ్ సుందరేశ్ ఇప్పుడీ ఆదేశం జారీ చేసారు. తమిళనాట అన్ని పాఠశాలలోను ఇక జాతీయ గీతం పాడక తప్పదు. కానీ ఇతర ప్రాంతాలలోని పాఠశాల మాట ఏమిటి? సర్వోన్నత న్యాయస్థానం కూడ జోక్యం చేసుకోవాల్సిన అనివార్యం ఏర్పడి ఉంది...
ఇలా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించా లా వద్దా? జాతీయ గీతాన్ని పాడాలా? వ ద్దా? అన్న చర్చలు జరగడానికి ఆస్కారం ఏర్పడడం జాతికి అవమానకరం! పతాకం జాతికి ప్రతీక, గీతం స్వజాతీయుల అంతరంగ ధ్వని తరంగం! అమ్మను అమ్మా అని పిలవడం శిశువునకు సహజం, మాతృభూమి పట్ల మాతృ సంతతికి మమకారం అంతే సహజం! జాతీయ ధ్వజం ద్వారా జాతీయ మంత్రం ద్వారా ఈ మమకారం ప్రస్ఫుటిస్తోంది! ఇది సహజం! సహజమైన ఈ ప్రవృత్తికంటె భిన్నమైన ప్రవృత్తి లేదు! ఉండడానికి వీలులేదు!మనజాతికి మాత్ర మే కాదు అవనీ తలంలోని అన్ని జాతుల కు వర్తించే శాశ్వతమైన సత్యమిది! అమ్మను అమ్మా అని పిలవడానికి ప్రత్యామ్నాయం లేదు, జాతీయ పతాకాన్ని గౌరవించాలన్నదానికి, జాతీయ గీతాన్ని భక్తితో ఆలపించాలన్న దానికి ప్రత్యామ్నాయం లేదు. రెండవ అభిఫ్రాయం ఉండదు! సూర్యుడు వెలుగును పంచుతున్నాడు, చంద్రుడు వెనె్నలను వెదజల్లుతున్నాడు అన్న వాస్తవాల పట్ల భిన్నాభిప్రాయం ఉంటుందా? నాన్యఃపంథ విద్యతే అయనాయ...నడవడం కోసం మరో మర్గాం లేదు! అన్నది వేద ఋషులు దర్శించిన మాతృదేశపు మమకారం! ఆ మార్గంలోనే అనాదిగా ఈ సనాతన జాతి ప్రస్థానం సాగించింది! మాతృ పృథివీ పుత్రోహం పృధివ్యాః-్భమి నాకు తల్లి నేను ఆమెకు పుత్రుడను అన్నది మమకారం! మాతృదేశం పట్ల మమకారం కంటె భిన్నమైన మరో మార్గం పగతి కోసం సుగతి కోసం ప్రస్థానం సాగిస్తున్న వారికి లేదు! నాన్యఃపంథా అయనాయ విద్యతే..! కానీ పదమూడు వందల ఏళ్లపాటు విదేశీయ దురాక్రమణదారులతో నిరంతరం జరిగిన సంఘర్షణ ఫలితంగా స్వజాతీయాత్మ విస్మృతి దాపురించింది! ఇలా దాపురించిన ఫలితమే రెండవ మార్గం కూడా ఉండాలా? ఉందా? అన్న చర్చకు ప్రాతిపదిక! దేశభక్తి మొదటి మార్గం, భిన్నమైన మార్గం దేశద్రోహం! ఎన్ని చర్చలు జరిగినప్పటికీ, ఎంత సిద్ధాంత రాద్ధాంతం జరిగినప్పటికీ ఇంతకుమించి స్పష్టమయ్యేదిలేదు, స్పష్టం కావలసినది లేదు!
కానీ రెండవదైన భిన్నమైన మార్గం ఉందని మదరాసు హైకోర్టుకే చెందిన మరో న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ ఇటీవల ప్రకటించి విన్నవారిని దిగ్భ్రాంతికి గురి చేసాడు. భారతదేశంలో పుట్టినందుకు తాను సిగ్గుపడుతున్నానని కులవివక్ష లేని మరో దేశానికి వలస వెళ్లడానికి తాను సంకోచించబోనని కర్ణన్ ఫిబ్రవరి 15వ తేదీన చేసిన ప్రకటన! తనకు ప్రభుత్వాలు, సుప్రీంకోర్టువారు అన్యాయం చేసారన్నది ఆయన చేసిన ఆరోపణ! లోక్‌సభలో జనగణమన గీతం పాడుతుండిన సమయంలో ఒకప్పుడు నిరసనగా విసురుగా లేచి నడుచుకుంటూ బయటికి వెళ్లిన దృశ్యం 2013లో మాధ్యమాలలో ఆవిష్కృతమైంది!
లక్షల ఏళ్లుగా అనుసంధాన భాషగా వివిధ ప్రాంతాలను అద్వితీయ జాతీయ సంస్కృతితో సమన్వయం చేసిన సంస్కృత భాషను ఇంగ్లీషు ఒక్కసారిగా తొలగించలేదు, అంచెలంచెలుగా తొలగించింది! ఇదంతా భారత జాతి ఓటమి ఫలితం! ఈ సనాతన జాతి మళ్లీ విజయ విశ్వాసంతో మనుగడ సాగించడానికి వీలుగా అంచెలంచెలుగా ఇంగ్లీషును తొలగించి సంస్కృత భాషను పునఃప్రతిష్ఠించడం ఒక్కటే వౌలికమైన ప్రత్యామ్నాయం! మరో మార్గం లేదు...

-హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352