మెయిన్ ఫీచర్

సవాళ్లకు ఎదురీత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల కాశ్మీర్‌లోయలో నవ శకానికి నాంది పలుకుతూ తొలిసారి ఓ మహిళ అధికార పగ్గాలు చేపట్టేందుకు అడుగు ముందుకు వేసింది. రాజకీయ చదరంగంలో పావులు కదిపే సత్తా తమకు మాత్రమే సొంతం అని అనుకుంటున్న ఉగ్రవాద, పురుషాధిక్యానికి సవాల్ విసురుతూ న్యాయ శాస్త్రంలోనే కాదు రాజకీయంలోనూ ఎత్తుకు పైఎత్తులు వేయగలనని నిరూపించుకునేందుకు తల పండిన రాజకీయ పార్టీలతో తలపడేందుకు సిద్ధమైన ఆ మహిళా నేతే మెహబూబా ముఫ్తీ. కాశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఆమె సవాళ్లకు ఎదురీదనున్నారు. ఉగ్రవాదుల తూటాల బెదిరింపులకు వెరవక దశాబ్ద కాలంగా రాజకీయాలలో ఉన్న ఆమెకు తండ్రి అందించిన రాజకీయ వారసత్వం అలవోకగా అందలేదు. గత రెండు నెలలుగా అందరి చూపు ఆమెపైనే నెలకొన్న నేపధ్యంలో రాజకీయ సంక్షోభానికి తెరదించబోతున్నారు.
అది 1996 సంవత్సరం. కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. మహిళలెవ్వరూ పోటీ చేసేందుకే భయపడుతున్న వేళ మెహబూబాను తండ్రి ఎన్నికల బరిలో నిలిపారు. మెహబూబాతో పాటు ఆమె తల్లి కూడా పోటీచేశారు. విచిత్రంగా తల్లి ఓడిపోగా మోహబూబా గెలిచారు. తొలి రాజకీయ అడుగులోనే ఆమె కాశ్మీర్‌వాసులు మనసు గెలుచుకున్నారు. అందుకే ఆమె ఆది నుంచి కూడా కాశ్మీర్ లోయలో రాజకీయ ప్రభావం చూపే నాయక గణంలో ఒకరిగా నిలిచారు.
తండ్రీ కూతుళ్లు 2002లో కాంగ్రెస్ పార్టీని వీడి ‘పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ’ని ఏర్పాటుచేసినపుడు మెహబూబా పార్టీకి పునాది రాయిగా నిలిచారు. నిరాడంబర జీవితాన్ని ఇష్టపడే మెహబూబా తండ్రి కేంద్ర హోం మంత్రిగా ఉన్నా ఆమె బస్సులోనే కాలేజీకి వెళ్లేవారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్న ఆమె కాశ్మీర్ లోయలో మిలిటెంట్లు,సైనికుల మధ్య జరిగే పోరులో భర్తలు కోల్పోయిన భార్యల కన్నీటిని తుడవటానికి బాధితుల ఇంటింటికి వెళ్లి వారిని పరామర్శించి బాసటగా నిలిచారు. అందుకే ఆమెను కాశ్మీర్ మహిళలు అక్కున చేర్చుకుంటారు. అసెంబ్లీలో సీనియర్ రాజకీయనాయకుడు ఫరూక్ అబ్దుల్లాకు ధీటుగా ఆమె ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. కాశ్మీర్‌లో అబ్దుల్లా, సరుూద్ కుటుంబాల మధ్య రాజకీయ పోరు సాగుతున్న నేపథ్యంలో పీడీపీ అధ్యక్షురాలుగా ఎన్నికైన మెహబూబా అబ్దుల్లాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసి తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఏ మేరకు ప్రయత్నిస్తారో వేచి చూడాలి. 2014లో అనంతనాగ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆమె తండ్రి హఠాన్మరణంతో పార్టీ పగ్గాలు చేపట్టాల్సి వచ్చింది. ఆమెకు సోదరి, సోదరుడు ఉన్నప్పటికీ ఈ ఇరువురుకి రాజకీయం అంతగా అబ్బలేదు. అందుకే మెహబూబాను కాశ్మీర్‌వాసులు ‘తండ్రి గారాల పట్టి’ అని ముద్దుగా పిలుచుకుంటారు. నిరుద్యోగం, ఒమర్ అబ్దుల్లా అవినీతిపై గళమెత్తిన మెహబూబా 2014 ఎన్నికలలో వీటినే ఎన్నికల అస్త్రాలుగా చేసుకుని ఉదయం 8 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసి పీడీపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేశారు. ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే ఆమె ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
గత ఒమర్ అబ్దుల్లా అవివీతి కార్యకలాపాలను ఏమేరకు వెలుగులోకి తీసుకువచ్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో చూడాలి. కాశ్మీర్ లోయలో పాగా వేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం తీవ్రంగానే కృషిచేశారు. గతంలో ఏ ప్రధాని పర్యటించని విధంగా అనేక సార్లు ఆయన లోయలో పర్యటించి కాశ్మీర్ వాసులకు భరోసా కల్పించేందుకు కృషి చేశారు గానీ అధికారం దక్కించుకోలేకపోయారు. మరి అధికార దాహంతో ఉన్న ఆ బిజెపితోనే చెలిమి చేసేందుకు పీడీపీ సిద్ధమైంది. అధికార భాగస్వామి, పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి డిమాండ్లకు తలఒగ్గి ముందుకు పోవాల్సి రావటం మెహబూబాకు కత్తిమీద సాము లాంటిదే. కాశ్మీర్ లోయలో తన ప్రభావాన్ని పెంచుకునే ప్రయత్నంలో బిజెపి దుందుడుకుగా వ్యవహరించేచే నేపధ్యంలో ఆమెకు మరిన్ని ఆటంకాలు ఎదురవ్వక తప్పదు. అలాగే అన్నింటికన్నా ముఖ్యం ఏన్నో ఏళ్ల నుంచి వేళ్లూనుకుపోయిన కాశ్మీర్ వేర్పాటువాదానికి ఏమేరకు పరిష్కారం చూపుతారోనని ఈ 55 ఏళ్ల మహిళా నేతపై కాశ్మీర్‌వాసులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సైన్యం ఉక్కుపాదాల కింద నలిగిపోతున్న కాశ్మీర్ లోయలో శాంతి నెలకొనాలంటే పలు ప్రాంతాల నుంచి సైనిక బలగాలను తొలగించాలని మెహబూబా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్‌కు భాగస్వామ్య పక్షమైన బిజెపి ఏ విధంగా స్పందిస్తుందనే చర్చినీయాంశంగా మారింది. ఇంచుమించు పీడీపీ పార్టీకి చేరువుగా సీట్లు సంపాదించిన జాతీయ పార్టీ అయిన బిజెపి ఓ ప్రాంతీయ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమైంది. ఈ భాగస్వామ్యంతో రాబోయో ఎన్నికలలో తన బలాన్ని పెంచుకునేందుకు ముందస్తు వ్యూహరచనకు సిద్ధమైందనే చెప్పవచ్చు. ఇందులో భాగంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం కేంద్రం తోడ్పాటుతో కాశ్మీర్ లోయలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజలలో సానుకూలతను సంపాదించేందుకు ముందుకు సాగుతోంది. మృధుస్వభావి, కాంగ్రెస్ గూటి పక్షి అయిన మెహబూబా బిజెపితో బంధం బీటలువారకుండా ఉంటేనే మనుగడ సాగించగలదు.