మెయిన్ ఫీచర్

పర్వతారోహణ ఆమె ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భర్త ఇచ్చిన చేయుత... అత్తింటివారు ఇచ్చిన ప్రోత్సాహం ఐదు పదులు దాటిన ఆ ఇల్లాలిని పర్వాతారోహకురాల్ని చేసింది. వాస్తవానికి నలభై ఏళ్లు దాటిన మహిళలు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటారు. కాని 46 ఏళ్ల వయసులో ఆఫ్రికాలో అతి ఎతె్తైన పర్వతమైన కిలిమంజారో శిఖరాన్ని ముద్దాడింది. ఆ మరుసటి సంవత్సరమే యూరప్‌లోని అత్యంత ఎతె్తైన పర్వతాన్ని అధిరోహించారు. తదనంతరం అంటార్కిటికాలోని ఎత్తయిన పర్వతమైన విన్సన్‌ను అధిరోహించారు. ఇలా ప్రతి ఏడాది పర్వతాలను అధిరోహించటమే ధ్యేయంగా పెట్టుకున్న సంగీతా సింధీ బల్ వయసు 51 ఏళ్లు వచ్చేనాటికి దీనాలిలోని వౌంట్ మిక్నిలీ పర్వతాన్ని అధిరోహించారు. ప్రపంచంలోని ఎత్తయిన ఏడు పర్వత శిఖరాలను అధిరోహించటమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. భర్త, పిల్లలకు వండిపెట్టడమే తన లోకంగా జీవించే ఓ సాధారణ గృహిణి గొప్ప పర్వతారోహకురాలిగా మలచబడటానికి ఆమె స్వశక్తి, భర్త అందిస్తున్న ప్రోత్సాహమే అని చెప్పవచ్చు.
సంగీతా సింధీ భర్త, పిల్లలే లోకంగా జీవించే ఓ సాధారణ గృహిణి. కన్సల్టింగ్ వ్యాపారం చేయటమే ఆమెకు తెలుసు. ఆమె భర్త అంకూర్ పర్వతాలను అధిరోహించటానికి ఇష్టపడతాడు. సంగీతా సింధీకి పర్వతారోహణ యాధృచ్చికంగా జరిగిందని చెప్పవచ్చు. భర్త అంకూర్ కిలిమంజారో ఎక్కాలని సన్నాహాలు చేస్తుండగా.. యాభై ఏళ్లు దాటిన ఆయనను ఒంటరిగా పంపటానికి కుటుంబంలోని పెద్దలు అంగీకరించకపోవటంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్న భర్తను ప్రోత్సహించేందుకు సంగీతా సింధీ ఆయనతో పాటు కిలిమంజారో ఎక్కేందుకు సంసిద్ధులయ్యారు. ఓకేసారి అంత పెద్ద పర్వతాన్ని అధిరోహించటం అంటే మాటలు కాదు. భర్తతో పాటు ఆమె కూడా ఫిట్‌నెస్ పరీక్షలు, భర్తతో పాటు శిక్షణ తీసుకోవటం ప్రారంభించింది. ఇవన్నీ కూడా ఆమెకు పర్వతారోహణం పట్ల మక్కువ పెంచింది.
మగవాళ్లకు తప్ప ఆడవాళ్లకు స్థానం లేదనే భావించే రంగంలో సంగీత ఈ రంగంలో ఒక్కొక్క ఏడాది అప్రతిహతంగా దూసుకుపోవటం అత్తింటివారినే కాదు ఎందరినో మంత్రముగ్ధులను చేస్తుంది. కిలిమంజారో పర్వతారోహణ తనకు ఎన్నో తీపి జ్ఞాపకాలను అందించిందని చెబుతారు. ఎందుకంటే భర్తతో పాటు ఆమె వెళ్లాల్సి రావటం, ఏడేళ్ల కుమారుడ్ని అత్తంటివారికి అప్పజెప్పటం, మధ్యలో తమకేదైనా ప్రమాదం సంభవిస్తే పిల్లాడు అనాధ అవుతాడనే బెంగ మధ్య భర్త సంకల్పాన్ని నెరవేర్చాలనే నిశ్చయంతో ఆమె అడుగు ముందుకు వేసింది. కిలిమంజారో పర్వతం ఎక్కటం ఎంతో సాహసంతో కూడకున్న పని. ఎందుకంటే దిగువన నదీ ప్రవాహం ఉంటుంది. ఏమాత్రం కాలుజారినా నదిలో పడిపోతారు. దీంతో ప్రాణాలకే ముప్పు. కాని తొలి పర్వతారోహణమే తనకు ఎన్నో మెళకువలను నేర్పిందంటారు సంగీత. ఎనిమిది రోజుల సుదీర్ఘ ప్రయాణం తరువాత కిలిమంజారో పర్వత శిఖరం 19,341 మైలురాయికి చేరుకున్నామని, వాస్తవానికి తమ పుట్టింట్లో ఎవ్వరూ కూడా పర్వతారోహకులు లేరని, కేవలం భర్త అందించిన ప్రోత్సాహంతోనే తొలి విజయాన్ని నమోదు చేసుకున్నానని గర్వంగా చెబుతారు.
తొలి విజయం తరువాత శిక్షణ
కిలిమంజారో అధిరోహించిన ఆమె ఇక వెనుదిరిగి చూసుకోలేదు. డార్జిలింగ్ ఇన్‌స్టిట్యూట్‌లోచేరి పర్వతారోహణలో సాంకేతిక శిక్షణ తీసుకునేందుకు సమాయత్తమయింది. అయితే ఈ ఇన్‌స్టిట్యూట్‌లో కేవలం 40 సంవత్సరాల వయసులోపు వారికే శిక్షణ ఇస్తారు. దీంతో ఆమెను ఇన్‌స్టిట్యూట్‌లో చేర్చుకోలేదు. పర్వతారోహణ పట్ల అమె ఇష్టాన్ని గ్రహించిన భర్త ఆమెను అమెరికా పంపి అక్కడ శిక్షణ ఇప్పించటం జరిగింది.శిక్షణ తీసుకున్న తరువాత ప్రతి ఏడాది వరుసగా నాలుగు పర్వతాలను ఆధిరోహించిన సంగీత ఐదవ పర్వతం అలస్కా పర్వతం ఎక్కేటపుడు మోకాలి గాయాలకు గురైంది. విపరీతమైన మంచు కురుస్తున్న వేళ పర్వతారోహణకు సిద్ధమైంది. దీనికి తోడు వీపుపై 30 కేజీల బరువు మోస్తూ పర్వతాన్ని అధిరోహించాల్సి రావటంతో సంగీతా సిద్ధిని ఎన్నో ఇబ్బందులకు గురిచేసినా ఈ కష్టాలు తన ఎవరెస్ట్ అధిరోహణకు దోహదం చేస్తాయని చెప్పటం ఆమెకు పర్వతారోహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది. అలాస్కా పర్వతారోహణ తరువాత ఆమెకు మోకాలికి శస్త్ర చికిత్స చేశారు. కర్ర చేతికి ఇచ్చారు. ఈ స్టిక్ తన జీవిత లక్ష్యానికి అవరోధంగా నిలువకూడదని భావించి దానిని విసిరేసి వారం రోజులలో కఠినమైన ఫిజయోథెరపీ చేసి నడవటం ప్రారంభించింది. ఆపరేషన్ జరిగిన ఆరు నెలల తరువాత అకాన్‌కాగ్వో (22,347 అడుగులు) పర్వతాన్ని అధిరోహించి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. వారంలో ఆరు రోజులు రోజూ రెండుగంటల పాటు శిక్షణ తీసుకుంటుంది. అంతేకాదు శారీరక బరువు నియంత్రణకు నాలుగు రోజులు పాటు జిమ్‌కు వెళుతుంది. ఇలా కఠోర శ్రమతో ఈసారి కార్సెట్నెంజి పిరమిడ్‌ను ఎక్కటానికి సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయిన తరువాత ఎవరెస్ట్‌ను 2017నాటికి అధిరోహించాలని శ్రమిస్తున్నారు. పర్వతారోహణను తన జీవితంలో అంతర్భాగంగా చేసుకుని శ్రమిస్తున్న సంగీతా సిద్ధి ఆశయం నెరవేరాలని ఆశిద్దాం.
*

చిత్రం... పర్వతారోహణ చేసిన సంగీతా సింధి, భర్త అంకుర్ బల్‌తో సంగీతా