బిజినెస్

జిఎస్‌టి రాక తథ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియాద్, ఏప్రిల్ 3: సులువుగా వ్యాపారం జరుపుకోవడానికి అనువైన వాతావరణాన్ని కల్పిస్తామని, నిలకడయిన పన్నుల విధానాన్ని అందిస్తామన్న హామీతో సౌదీ అరేబియా పెట్టుబడిదారులను ఆకర్షించడానికి యత్నించిన ప్రధాని నరేంద్ర మోదీ పాత పన్నుల విధానం అనేది గతించి పోయినదిగా మారపోయందన స్పష్టం చేయడమే కాక, గత ప్రభుత్వంనుంచి వారసత్వంగా సంక్రమించిన రెండు కేసుల విషయంలో తానేమీ చేయలేనని, ఎందుకంటే అవి రెండూ కోర్టు పరిధిలో ఉన్నాయని స్పష్టం చేశారు. తమ దేశంలో రక్షణ. ఇంధన, రైల్వే, ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా వ్యాపారవేత్తలను ఆయన ఆహ్వానిస్తూ, వస్తు సేవల పన్ను(జఎస్‌టి) రూపంలో ఉమ్మడి పరోక్ష పన్నుల విధానం త్వరలోనే రానున్నదని చెప్పారు. అయితే ఈ విధానం ఎప్పట్లోగా అమలులోకి వస్తుందో మాత్రం ఆయన చెప్పలేదు.
సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనలో చివరి రోజయిన ఆదివారం నాడు ఎంపిక చేసిన సౌదీ, భారతీయ వ్యాపారవేత్తలతో ప్రధాని మాట్లాడుతూ, తమ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు అనేక రంగాల తలుపులు తెరచిందని, ప్రపంచ ఆర్థిక మాంద్యంతో కొట్టుమట్టాడుతున్న సమయంలో భారత్ ఆశాదీపంలాగా నిలిచిందని చెప్పారు. భారీగా పెరిగిపోయిన రాష్ట్ర విద్యుత్ బోర్డుల నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఏ)లనుంచి విముక్తి ల్పించడం ద్వారా దేశంలోని బ్యాకింగ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కూడా ఆయన చెప్పారు. పాలనాపరమైన అడ్డంలను తొలగించడంతో పాటుగా పెట్టుబడదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడానికి తమ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని కూడా ఆయన చెప్పారు. వ్యాపారానికి అనువైన వాతావరణం కల్పించిన దేశాల జాబితాలో భారత్‌ను ప్రపంచ బ్యాంక్ 12వ స్థానంలో ఉంచిందని కూడా ఆయన చెప్పారు. అంతేకాదు, ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఇతర రేటింగ్ ఏజన్సీలు అన్నీ కూడా భారత్‌ను శరవేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా గుర్తించాయని ఆయన అన్నారు.
ఇప్పటికే ఎంతో ఆలస్యమైన జిఎస్‌టి అమలు గురించి మాట్లాడుతూ, ‘జిఎస్‌టి వచ్చి తీరుతుంది. ఇది మా హామీ. ఇది జరగబోతోంది’ అని అన్నారు. పాత పన్నులకు సంబంధించి అడిగిన ఒక ప్రశ్నకు మోదీ సమాధానమిస్తూ, దాన్ని తిరిగి తీసుకురావడం జరగదని, అది గతించిపోయిన వ్యవహారం అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన సంఘటనలు రెండున్నాయని, అయితే అవి కోర్టు పరిధిలో ఉన్నాయని ఆయన అంటూ, వాటి విషయంలో తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. ఆ రెండు ఏమిటో ప్రధాని చెప్పపోయనప్పటికీ వోడాఫోన్, కైర్న్స్ సంస్థలకు చెందిన పన్ను వివాదాలనేది అందరికీ తెలిసినదే. సౌదీ వాణిజ్య మండలుల మండలి ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సౌదీ వాణిజ్య, పరిశ్రమల మంత్రి తాఫిగ్ ఫాజాన్ అల్ రబియా, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి అదెల్ ఫకీ కూడా పాల్గొన్నారు.

చిత్రం... రియాద్‌లోని సౌదీ అరేబియా చాంబర్ ఆఫ్ కామర్స్‌లో ఆదివారం ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సమావేశమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ