మెయిన్ ఫీచర్

ప్రేమే గాయమా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంధాలు అందరికీ ఉంటాయి. కాని ఆ బంధాలే ఆర్థిక సంబంధాలుగా మారటం వల్ల జీవితమంతా కలిసి జీవించాలని ఆశ పడిన ప్రత్యూషా హృదయం ఎనె్నన్నో ఆటుపోట్లకు గురైంది. జీవిత భాగస్వామి గురించి సావధానంగా తెలుసుకుని, జాగ్రత్తలు తీసుకుని ఉంటే సందేహాలకు తావు లేకుండా జీవితం సాఫీగా సాగిపోయేదే.. దురదృష్టవశాత్తు జీవితాన్ని ఆనంద గీతంగా మలుచుకోకుండానే, కలల్ని సాకారం చేసుకోకుండనే అంతమొందించుకున్నది.

ప్రేమ మధురం అంటారు. కాని ఆమె పాలిట అది గాయమైంది. అంతేకాదు మృత్యువు సైతం అయింది. అందుకే రెండు పదులు దాటిన ఆమె అర్థాంతరంగా మృత్యువును ఆశ్రయించింది. బుల్లితెర యాక్టర్ ప్రత్యూషా బెనర్జీ ఆకస్మిక మరణం వెనుక దాగిన నిజాలు కొత్త కోణాల్లో బయటపడుతున్న కొద్దీ ఆమె అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. అసంబద్ధమైన సంబంధాలను ఈ చిన్నారి పెళ్లికూతురు ప్రేమగా భావించి సహజీవనం చేయటం ఆమెకు చేటు తెచ్చింది. ఆమె మరణం వెనుక దాగివున్న చేదు నిజాలు బయటపడుతుంటే ప్రత్యూషా సన్నిహిత మిత్రులు సైతం రాహుల్ వైపు వేలెత్తిచూపే పరిస్థితులు నేడు కనిపిస్తున్నాయి. రాహుల్ డబ్బు కోసం ఆమెను ఏవిధంగా వేధించేవాడో ఒక్కొక్కరు చెబుతుంటే వారిద్దరి మధ్య నెలకొన్న సంబంధంలో అతను ఆమెను ఎంత మానసిక వంచనకు గురిచేశాడో తెలుస్తోంది. రాహుల్‌కు ముందు ప్రత్యూషాకు ఉన్న సంబంధాలు కూడా అసంబద్ధం అవ్వటం వల్ల అవి కూడా ఆమె జీవిత ముగింపునకు దోహదం చేశాయంటున్నారు మానసిక విశే్లషకులు. ఇలాంటి అసంబద్ధమైన, విషం చిమ్మే అనుబంధాలు సమాజంలో ఎలాంటివారికైనా చేటే తెస్తాయి. ప్రస్తుతం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారుతున్న నేటీ తరుణంలో వీటిని గుర్తించే మానసిక పరిపక్వత యువతలో పెరగాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అండ, ఆధారం ఉంటుందనే ధీమాతో పెట్టుకుంటున్న ఈ అసంబద్ధ సంబంధాలే అనుకోనిరీతిలో హఠాత్తుగా విచ్ఛన్నమైపోతే గుండెలో కొండంత నైరాశ్యం పేరుకుపోయి ఒకదశలో తామెటు వెళుతున్నామో తెలియని అయోమయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఆత్మీయంగా హత్తుకొని సెల్ఫీలు దిగిన వ్యక్తి ప్రేమలో కేవలం డబ్బేదాగి ఉందని తెలుసుకునే సరికే ప్రత్యూషా చేతిలో చిల్లి గవ్వ లేకుండా పోవటం డబ్బుల కోసం పనిమనిషిని అడుక్కునే స్థితికి దిగజారిపోయింది.
ఈ బంధాల్లోని మాధుర్యం తొలుత అందంగా కనిపించినా.. తరువాత చేదు అనుభవాలు ఎదురవ్వటం ప్రారంభమవుతాయి, రంగస్థలంపై నటించటం అంతా సులువు కాదు జీవితంలో నటించటం అని తెలుసుకునే సరికి ప్రత్యూష జీవితంలో తిట్లు, కొట్లాటలు ఆరంభమయ్యాయని జీవిత విశే్లషకులు ప్రియ కుమార్ అంటున్నారు. ఫలితంగా ఈ అసంబద్ధమైన బంధాలలోని విస్పోటనం ఒక్కసారిగా బయటపడేసరికి ఎవరికీ అవసరం లేని ఈ జీవితం ఎందుకులే అనే నైరాశ్యం చోటుచేసుకోవటంతో పాటు ఈ బంధం వారికి అభద్రతా భావాన్ని కలుగజేస్తోందని జీవిత విశే్లషకులు మిలింద్ జాదవ్ అంటున్నారు. జీవితంలో ఎన్నో సమకూర్చుకోవాలి, సంపాదించుకోవాలనే జీవితాపేక్షతో పాటు స్వీయ గౌరవాన్ని, స్యీయ ప్రేమను పెంపొందించుకుంటే ఎలాంటి కష్టాలు, నష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కుంటారని, జీవితంలో రాజీ అనే ధోరణి లేకుండా నైతిక విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగుతారని ప్రియకుమార్ తెలియజేస్తున్నారు. మానసిక వేధింపులు బయటకు తెలియకపోయినా శారీరక వేధింపులు నేరమే అవుతుంది కాబట్టి నేరస్తుడు శిక్ష నుంచి తప్పించుకోలేడు. ప్రేమ, అంగీకారం పేరుతో వేధింపులకు పాల్పడటానికి ప్రత్యేక కారణాలు ఉండవని మిలంద్ జాదవ్ అంటున్నారు. ఇలాంటి బంధాలు ఏర్పాటుచేసుకునే యువతీయువకులు మొదట్లోనే వాస్తవ పరిస్థితులను తెలుసుకుంటే ఒక్కసారిగా విస్పోటనం వలే జీవితం బద్దలవ్వదు. అవసరాల కోసం కలిసే జంటలు జీవిత వాస్తవాలను తెలుసుకుని ముందుకు సాగితే జీవితం ఊహించని మలుపు తిరగవు అని జీవిత విశే్లషకులు వీచి షాహి అంటారు.