మెయన్ ఫీచర్

కృపాల్ సింగ్ బలిదానం వ్యర్థం కారాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృపాల్‌సింగ్ పేరు విన్నారా? అతనిని 1992లో వాఘా వద్ద సరిహద్దులు దాటుతుండగా చూశాను అని పాకిస్తాన్ చెబుతున్నది. గత పాతిక సంవత్సరాలుగా ఇతడు కోట్ లక్‌పాట్ జైలులో (పంజాబ్ ప్రావెన్స్) మగ్గుతున్నాడు. 2016, ఏప్రిల్ 13న అతడిని లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ మరణించినట్లు ప్రకటించారు. గూఢచారి అంటూ పాక్ ప్రభుత్వం అతనిపై నేరారోపణ చేసింది.
కృపాల్ సింగ్‌కు ఒక సోదరి ఉంది. ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. అఫ్జల్ గురును ఉరితీయవద్దు-అది జుడీషియల్ మర్డర్ అంటూ గొంతు చించుకొని పూనకం వచ్చినట్టు ఊగిన కన్హయ్యకుమార్, ఏచూరి సీతారామ్‌లు కృపాల్ సింగ్ హత్యకు కనీసం సానుభూతి కూడ ప్రకటించలేదు. ఒక యాకూబ్ మెమెన్ చనిపోతే ఇంటింటా యాకూబ్ మెమెన్‌లు పుడతారని హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అరచిన వారెవరూ ఒక కృపాల్‌సింగ్ చనిపోతే ఇంటింటా కృపాల్ సింగ్‌లు పుడతారు అని నినాదాలు ఇవ్వలేదు ఎందుకని? ఇప్పుడు బెలూచిస్థాన్‌లో కులభూషణ్ యాదవ్ అనే వ్యాపారిని పాక్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఇతడినైనా నరేంద్ర మోదీ ప్రభుత్వం కాపాడగలుగుతుందా? నాకైతే నమ్మకం లేదు. 2016, ఏప్రిల్ 13న కృపాల్ సింగ్ పాకిస్తాన్‌లో బలిదానం చేసినప్పుడు హైదరాబాద్‌లో సంగీత విభావరులు జరుగుతున్నా యి. న్యూఢిల్లీలో పద్మ పురస్కారాల ప్రదా నం జరుగుతోంది.
బ్రిటిషు యవరాజుగారికి భారత ప్రభుత్వం స్వాగతం పలికి ఆయన చేత ఇండియన్ దోసెలు ఎంత రుచిగా ఉం టాయో రుచి చూపిస్తున్నది. ముద్రగడ పద్మనాభం మళ్లీ కాపు ఉద్యమం మొదలుపెడతానంటున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ గురించి పవన్ కళ్యాణ్ అభిమానులు చ ర్చలు జరుపుకుంటున్నారు. కృపాల్ సింగ్ గూర్చి ఎవరికి కావాలి? చాలా పత్రికల్లో, టివి ఛానళ్లలో ఈ వార్త కూడా రాలేదు. ప్రావెన్షియల్ క్యాపిటల్ ఆఫ్ క్వెట్టా నుండి కౌంటర్ టెర్రరిజం డిపార్ట్‌మెంట్ తేదీ లేని ఒక ఎఫ్‌ఐఆర్ విడుదల చేసింది. అందులో కృపాల్ సింగ్ నేరస్థుడని తేల్చింది. ఏం నేరం చేశాడో మనకు తెలియాలి కదా. కృపాల్ సింగ్, మన్‌మోహన్ సింగ్ ఇద్దరూ పంజాబు రాష్ట్రానికి చెందినవారే. కాని కృపాల్ సింగ్‌ను విడిపించాలన్న ఊహ మాజీ ప్రధానికి ఎందుకు కలుగలేదు? అనేదే సమస్య. పాకిస్తాన్‌కు కోపం తెప్పిస్తే ఢిల్లీలో ఇమామ్ బుఖారీ కస్సుమంటాడు. అప్పుడు కాంగ్రెస్‌కు మైనారిటీ ఓట్లు తస్సుమంటాయి! అంటే రాజకీయ లబ్దికోసం దశాబ్దాల తరబడి పాలకులు ఎంతెంతమంది దేశభక్తులను బలిపెట్టారో చెప్పడానికి ఈ కృపాల్‌సింగ్ ఉదంతం ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
ఇప్పుడీ వరుసలో కులభూషణ యాదవ్ ఉన్నాడు. ఆయనను పాకిస్తానీ సైనికులు ఎప్పుడైనా ఉరితీయవచ్చు. కనీసం దేశభక్త నరేంద్ర మోదీ గారైనా కులభూషణ్ యాదవ్‌ను రక్షిస్తారని ఆశిద్దాం. హైదరాబాదు నిండా వేల సంఖ్యలో పాకిస్తానీ గూఢచారులున్నారు. వీళ్లు ఐఎస్‌ఐ ఏజెంట్లు. పాతబస్తీలో ఐసిస్ రిక్రూట్‌మెంట్ సెంటర్ ఉన్నట్టు ప్రభుత్వం వారే ప్రకటించారు. ప్రతి ఆగస్టు 15నాడు హైదరాబాదు పాతబస్తీలో చంద్రవంక జెండాలు ఎగురుతాయి. ‘నా గొంతుమీద కత్తి పెట్టినా నేను భారత్ మాతాకీ జై అనను. ఏం చేస్తారో చేసుకోండి’ అని హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నాడు. ఆయన మద్దతుతో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘనవిజయాలు సాధించింది.
కృపాల్ సింగ్‌ను తాము హత్య చేయలేదని, గుండెపోటుతో మరణించాడని పాక్ ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ రెండో వారంలో భారత్‌కు కబురు పంపింది. పాక్‌లోని తాత్కాలిక హై కమిషనర్ జెపి సింగ్ ఇస్లామాబాద్‌లో పాక్ విదేశాంగ శాఖలో దక్షిణాసియా వ్యవహారాల డైరెక్టర్‌ను కలిసి పూర్తి వివరాలు తీసుకున్నట్టు చెప్పాడు. విదేశాంగ శాఖ ఈ అంశంపై విచారణ చేపట్టారు. భారతీయ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ఈ మొత్తం వ్యవహారంపై ఆరాతీస్తున్నారు. 1992లో కృపాల్ సింగ్‌ను పాకిస్తానీయులు అరెస్టు చేసి మరణశిక్ష విధించారు. గత పాతిక సంవ్సరాలుగా కృపాల్ సింగ్ లాహోరు జైలులో మగ్గుతున్నాడు. కృపాల్ సింగ్ అర్థాంతరంగా తన యాభయ్యవ ఏట సగం దారిలోనే జీవన యాత్రను ముగించాడు. అంతేకాదు కాలియా అనే పేరుగల మరొక హిందువును కూడ పట్టుకొచ్చి నరికి అడవిలో శవాన్ని పారేశారు. ఇప్పుడు కులభూషణ్ యాదవ్‌ను బెలూచిస్థాన్‌లో హింసిస్తున్నారు. ఏచూరి సీతారామ్ చైనా కన్హయ్యలు కులభూషణ్ యాదవ్‌ను వదలిపెట్టాలి అని ఎందుకు ఆందోళన మొదలు పెట్టలేదు? అంటే వీరు ఇండియాలో ఉంటూ చైనా గూఢచారులుగా పనిచేస్తున్నారని అర్థం.
2016, ఏప్రిల్ 13వ తేదీనాడు న్యూఢిల్లీలో జంతర్ మంతర్ రోడ్డు వద్ద ఒక ప్రదర్శన జరిగింది. అందులో కాశ్మీరులోని ‘నిట్’ నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. నిట్ జైలు మాదిరిగా మారిందని, అక్కడ మాన ప్రాణాలకు రక్షణ లేదని, నిట్‌ను కాశ్మీరు నుంచి జమ్ముకు మార్చాలని కోరారు. ఐతే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించలేదు. అదే రోజు శ్రీనగర్‌లోని పాతబస్తీలో జరిగిన ఆందోళనల్లో పోలీసు కాల్పు ల్లో ఒక స్ర్తితో సహా ముగ్గురు మరణించారు. ఈ ప్రాంతం హైదరాబాద్ పాతబస్తీ లాంటిది.
ఈ మొత్తం అంశం దేన్ని తెలియజేస్తున్నది. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కలిసి ఒకే జాతిగా జీవించలేరా? ముస్లిం లు మెజారిటీలో ఉన్న రాష్ట్రాలు (కాశ్మీరు) జిల్లాలు (మల్లాపురం, కేరళ), గల్లీలు (శాలిబండ-హైదరాబాద్) ఈ చోట్ల హిందువులను ఎందుకు ఉండనివ్వడం లేదు? ఇదే సమయంలో హిందువులు మెజారిటీగా ఉన్న అన్ని ప్రాంతాల్లో ముస్లిం లేదా క్రైస్తవ కుటుంబాలు సుఖశాంతులతో జీవించగలుగుతున్నారు. ఎందువల్ల? ఈ అంశాన్ని రాజకీయ వేత్తలు ఆలోచించాలి. మన్‌మోహన్ సింగ్ నుండి భారతదేశం ఏమీ ఆశించలేదు. కానీ నరేంద్ర మోదీ నుంచి ఈ దేశం చాలా ఆశిస్తున్నది. ఆ స్థాయికి ఆయన ఎదగవలసిన సమయం వచ్చింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామ్‌రాజ్ నాడార్ ప్రతిదానికీ ‘పార్ కలాం’ (వేచిచూద్దాం) అంటుండేవారు. ఇప్పుడు నరేంద్ర మోదీ, పార్ కలాం అంటున్నారు. ఆక్రమిత కాశ్మీరులో రెండువందల ఉగ్రవాద స్థావరాలున్నాయి. అధికారంలోకి భాజపా వచ్చి రెండేళ్లు గడిచినా ఈ సమస్య పరిష్కారం కాలేదు. మణిశంకర్ అయ్యర్ కరాచీకి వెళ్లి అక్కడి ఐఎస్‌ఐ అధికార్లతో ప్రత్యక్షంగా చేతులు కలిపి దునియా టివిలో భారత్‌లో నరేంద్ర మోదీని ఓడించడానికి మీరు తగినవారు అని చేసిన ప్రకటన అందరూ చూశారు. భారత్‌లో పెద్ద సంఖ్యలో మణిశంకర్ అయ్యర్‌లు ఉన్నా రు. ప్రతి విశ్వవిద్యాలయంలో ఒక చైనా కన్హయ్యకుమార్ ఉన్నారు. వీరిపట్ల కేంద్ర ప్రభుత్వ పార్ కలాం (సాచివేత) ధోరణి అనుసరిస్తోంది. ఇది దేశానికే కాదు భాజపాకు కూడా ఆత్మహత్యా సదృశం. అనుకున్న దానికన్నా చాలా తొందరగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అదృశ్యమైపోయింది. ఒక్క కేరళ మినహా మరెక్కడా కమ్యూనిస్టులు అడ్రస్ లేరు. ఈ దశలో శంఖాన్ని పూరించవలసిన చారిత్రక అవసరం భాజపాపై ఉంది.
భగత్‌సింగ్ నాస్తికుడు, ఆయన భారత్ మాతాకీ జై అనలేదంటూ ప్రచారం చేస్తున్న దుర్మార్గపు రోజులివి. నాడు భగత్ సింగ్, నేడు కృపాల్ సింగ్‌లు చేసిన త్యాగాలు వ్యర్థం కారాదు. కనీసం కులభూషణ్ యాదవ్‌నైనా వెంటనే విడిపించండి- లేదా బెలూచిస్థాన్, సింథ్‌లను పాకిస్తాన్ నుండి వెంటనే విడదీసి స్వంతంత్య్ర రాజ్యాలుగా ప్రకటించండి. బెలూచిస్థాన్‌లో గుంపులు గుంపులుగా శవాలను ఖననం చేస్తున్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యకు స్పందించిన అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంఘాలకు బెలూచిస్థాన్ శవాల గుట్టలు ఎందుకు కనబడటం లేదు?
కాశ్మీరులో ఉన్నవారంతా నాబిడ్డలే అంటూ మెహబూబా ముఫ్తీ ఏప్రిల్ 14న సన్నాయి నొక్కులు నొక్కింది. అదే నిజమైతే నిట్‌లో చదువుకుంటున్న విద్యార్థులపై ఎందుకు లాఠీచార్జ్ జరిపారు? ఇళ్లు తగలబడుతుంటే పేలాలు కాల్చుకున్నాడని తెలుగు సామెత. కాశ్మీరు తగలబడుతుంటే కాంగ్రెస్ మళ్లీ పాతపాట మొదలుపెట్టింది. భాజపా అధికారంలోకి వచ్చాక హైదరాబాద్, ఢిల్లీ, యాదవ్‌పూర్ కాశ్మీరులతో సహా అన్ని విశ్వవిద్యాలయాల్లోనూ అల్లర్లు మొదలైనాయని రాజకీయ లబ్దికోసం ప్రకటించింది. మరి 2002 నుండి 2014 వరకు హైదరాబాదు ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రణరంగంగా మార్చిందెవరు?
ఢిల్లీ యూనివర్సిటీ చైనా-పాక్‌ల స్థావరంగా దాశాబ్దాలుగా మారుతుంటే చూస్తూ ఊరుకున్నదెవరు? దేశద్రోహం ఎందు చేయవలసి వచ్చింది?కనీసం కృపాల్ సింగ్ సోదరిని కలిసి సానుభూతిని చెప్పడానికి కూడా సోనియా గాంధీ మనసు ఒప్పలేదు. 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో భారత్ చేతికి 93,000 మంది పాక్ సైనికులు సజీవంగా దొరికారు. వారిని ఇందిరాగాంధీ సురక్షితంగా పాక్‌కు అప్పగించింది. ఈ ఔదార్యానికి ఫలితమేమిటి? కృపాల్ సింగ్ ఏ తప్పూ చేయలేదని లాహోరు హైకోర్టు తీర్పు చెప్పింది. ఐనా అటు పాకిస్తాన్ సైన్యం కా ని, ఇటు మన్మోహన్ ప్రభుత్వం కాని అతన్ని విడిపించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మొన్న కాలియాను చంపి అడవిలో పారేశారు. నిన్న సర్వజిత్ సింగ్ దిక్కులేని చావుకు గురయ్యాడు..ఇవ్వాళ కృపాల్ సింగ్‌కు కూడా ఇదే గతి పడుతుంది. నిన్నటి మన్‌మోహన్ ప్రభుత్వానికి నేటి నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్దగా తేడా ఏమీ లేదు. తక్షణమే ఈ సమస్యను ఐక్యరాజ్య సమితి ముందు నివేదించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది.
chitram...
1. కృపాల్ సింగ్
2. కులభూషణ్ యాదవ్

- ముదిగొండ శివప్రసాద్