సబ్ ఫీచర్

బుక్క అయ్యవార్ల వెతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రస్తుతం 21వ శతాబ్దంలో సమస్త కులాల సమీకరణ మనదేశంలో జరుగుతున్నది. ఆ కులాలలో బుక్క అయ్యవారు కులమనేది ఒకటి ఉన్నది. చారిత్రకంగా బుక్క అయ్యవార్లు చాలా ప్రాచీనత కలిగినవారు. వేద కాలమునుండి పరంపారనుగతముగా వస్తున్న ప్రాచీన సాంప్రదాయ కులము అయ్యవార్లు. బుక్క అయ్యవార్లను వేద కాలంనాడు వైదిక అయ్యవార్లు, వైదిక వైష్ణవులు మరియు బ్రాహ్మణ వైష్ణవులుగా పిలిచేవారు. వేద కాలమున జరిగిన యజ్ఞయాగాదుల నిర్వహణ వైదిక అయ్యవార్ల (బుక్క అయ్యవార్లు) మీదనే ఆధారపడేది. సింధూరము- కస్తూరి, పసుపు, గులాలు, యజ్ఞసమిధలు, యజ్ఞ ధూపములు, యజ్ఞ వేదికల మీద అలంకరణలు బుక్క (వైదిక) అయ్యవార్లే చేసేవారు. యజ్ఞ సామగ్రులు సమకూర్చి యజ్ఞ వేదికలు అలంకరించిన తరువాతనే యాజ్ఞికులు యజ్ఞాలు ప్రారంభించేవారు. యజ్ఞం పూర్తి అయిన తరువాత యజ్ఞ ప్రసాద వితరణతో సహా సింధూరము (కుంకుమ) పసుపుగులాలు ఆహుతులందరికి అందించేవారు. ఈ ప్రకారం అయ్యవార్ల జీవనం గతంలో సుఖప్రాయంగానే గడిచింది. కాని కాలం మారిపోయి ప్రజల ఆలోచన విధానం శరవేగంగా మారి యజ్ఞయాగాదులు ఖర్చుతో కూడివున్నాయని వాటి ఆచరణ దాతలకు కష్టంగా మారింది. యజ్ఞయాగాదులవల్ల కోరికలు నెరవేరవని ధనాన్ని యజ్ఞాల మీద వెచ్చించడం వృధాయని భావించేవారు అధికమైనారు. అందువల్ల యజ్ఞయాగాదుల ప్రాశస్త్యం తగ్గి బుక్క అయ్యవార్ల జీవితం సంకట స్థితిలో పడింది. చాలా సులభమైన పనులు, ఆనంద జీవనంలో మృష్టాన్నం తిన్నవారు వేద కాలానంతరము వారి జీవన నౌక కష్టమైనది. ఈ జీవన గమనంలో కూడబెట్టింది లేక నానా దీనావస్థలో ఈ బుక్క అయ్యవార్లు కొట్టుమిట్టాడుతున్నారు.
విద్య నేర్చుకొన్నవారు కొంతమంది అర్చనలు, చిన్న చిన్న వ్యాపారాలు, ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించారు. ఆదాయం లేనివారు స్వల్ప పెట్టుబడి పెట్టుకొని సాధారణముగా అందరికి బొట్టు అవసరము కనుక కుంకుమలు, పరిమళ ద్రవ్యాలు తయారుచేసుకొని వాటిని ఊరూర తిరిగి అమ్ముకొని పొట్టపోసుకొని జీవిస్తున్నారు. ఆనాటినుండి ఏ వృత్తి చేసినవారు ఆ వృత్తిలోనే స్థిరపడి ఆ కులంవారిగానే పిలువబడ్డారు. వైదికులు వేలాది మంది ఆ వృత్తిలోనే స్థిరపడి ఆ కులంగానే మారిపోయారు. ఉత్తర భారతదేశ సాంప్రదాయాన్ని అనుసరించి నేటికి వీరిని వైదిక బ్రాహ్మణులుగానో, బ్రాహ్మణ వైష్ణవులుగానో పిలుస్తున్నారు.
బుక్క అయ్యవార్లను తమిళ, కర్ణాటక ప్రాంతాలలో అయ్యవార్లుగా పిలుస్తున్నారు. కాని ఆంధ్రప్రదేశ్‌లో కొంతమందిని మాత్రమే అయ్యవార్లుగా కుంకుమలు అమ్మి జీవించే వారిని బుక్కఅయ్యవార్లుగా పిలుస్తున్నారు. తమ వృత్తి లాభదాయకంగా లేకున్నప్పటికీ ఆ వృత్తినే నమ్ముకొని నేటికి వేలాదిమంది తెలంగాణ జిల్లాల్లో నిరుపేదలుగా బతుకులు వెళ్లదీస్తునానరు బుక్క అయ్యవార్లు జీవించేందుకు ఈ వృత్తి లాభకరముగా లేకున్నప్పటికీ ఆ వృత్తినే నమ్ముకొని నేటికి వేలాదిమంది నిరుపేదలుగా తెలంగాణ జిల్లాల్లో కనబడుతున్నారు. బుక్క అయ్యవార్లు వారి సాంప్రదాయాల్ని మరిచి వారి అస్థిత్వానే్న మర్చిపోతున్నారు. ప్రస్థుతము ఆంధ్రప్రదేశ్‌లోని బుక్క అయ్యవార్లు కులము ఆర్థికముగా, రాజకీయ మరియు సాంఘిక నైతిక రంగాలలో చాలా వెనుకబడి యున్నది. చాలా గ్రామాలలో వీరి ఆర్థిక పరిస్థితి కడు దయనీయంగా వుంది. తెలంగాణాలోని తూర్పు ప్రాంతంలో చాలామంది దారిద్య్రరేఖకు దిగువన జీవిస్తున్నారు. 1975 నుండి 2009 వరకు ఈ కులానికి గుర్తింపు రాకపోవడంవల్ల అనేక ఇబ్బందులకు గురైనారు. ఇప్పటికైనా నేటి ప్రభుత్వాలు వీరి జీవన విధానం మారేలా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని బుక్కఅయ్యవార్ల సంఘాలు కోరుతున్నాయి.

- జి. రమణయ్య