మెయిన్ ఫీచర్

అమెరికా మహిళ ఆవేదన తెలుసు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశ హర్మ్యాలతో సగటు మనిషి కలల సౌధంగా నిలిచే అమెరికాలో ఇన్నాళ్లకు ఓ మహిళ చరిత్ర సృష్టించగలిగింది. స్వేచ్ఛ, సమానత్వం గురించి చెబితే మనకు కనిపించేది విదేశీ మహిళలే. వారెంతో సాధికారిత, సమానత్వం తో జీవిస్తున్నారని భ్రమపడుతుంటాం.‘ మేడిపండు చూడ మేలిమై యుండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు’ అని వేమన చెప్పినట్లు రెండు వందల సంవత్సరాలు దాటిన అమెరికా స్వాతంత్య్ర దేశ చరిత్రలో ఓ మహిళ అదీ తొలి అధ్యక్ష మహిళా అభ్యర్థిగా బరిలో నిలవటంపై హర్షాతిరేకాలు వెల్లువెత్తటం ఆనందించదగ్గ విషయమే అయినప్పటికీ..వాస్తవానికి అక్కడి మహిళా వివక్షతకు అద్దం పడుతుందనేది కఠోర సత్యం అని చెప్పక తప్పదు. అతి పేద దేశమైన దక్షిణాఫ్రికా, ఆసియా, యూరప్ ఖండాలలోని పలు దేశాలలో అత్యున్నతమైన అధ్యక్ష, ప్రధానమంత్రి పదవులను మహిళలు అధిష్టించి చరిత్రకెక్కుతుండగా.. ఇన్నాళ్లకు ఓ మహిళ అధ్యక్ష స్థానానికి అర్హత సాధించటానే్న సంబరంగా చెప్పుకోవలసి రావటం దురదృష్టకరం. ఉన్నత విద్యా సదుపాయాలతో పాటు ఆధునిక టెక్నాలజీని ఒడిసిపట్టుకోవటంలో అందెవేసిన చేయిగా భావిం చే అమెరికా ఇప్పటికీ ప్రపంచ దేశాలకు పెద్దన్నగా వ్యవహరిస్తోంది. అలాంటి ఈ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఒక పార్టీ (డెమోక్రాటిక్) అభ్యర్థిత్వాన్ని సాధించిన తొలి మహిళగా అమెరికా విదేశాంగ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ (68) చరిత్ర సృష్టించటంతో పాటు ఒకేఒక మైలురాయిని మాత్రమే దాటారు. ఈ ఎన్నికల్లో గెలిస్తేనే ఆమె నిజమైన చరిత్ర సృష్టించినట్లు భావించాల్సి ఉంది. ఇకపోతే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తొలి మహిళ అభ్యర్థి మాత్రం ఆమె కాదని చరిత్ర చెబుతోంది. 1872లో తొలి మహిళ అభ్యర్థిగా విక్టోరియా ఉడ్‌హల్ మార్టిన్ పోటీ చేసి ఓడిపోయారు.
గొప్ప దేశంలో అతి గొప్ప వివక్షత!
అమెరికా జనాభాలో 50.8 శాతం మంది మహిళలు ఉన్నారు. వీరిలో 60శాతం మంది డిగ్రీ, పీజీ చేసినవారు. మొత్తం అమెరికాలో 52శాతం మంది మహిళా ప్రొఫెషనల్స్. విద్యాధిక్యంలో ఏమాత్రం తీసిపోని అమెరికాలో కీలకమైన ఎన్నో రంగాల్లోకి నాయకత్వ స్థాయికి వెళ్లిన మహిళలను మాత్రం వేళ్లమీద లెక్కించవచ్చు. అంతరిక్షయానానికి పెట్టింది పేరుగా నిలిచే నాసా స్పేస్ స్టేషన్ అత్యున్నత పదవుల్లో మహిళలకు స్థానమే లేదు. ప్రపంచానికే తలమానికంగా నిలిచే నాసాలో నాయకత్వ స్థానం 2007 నాటికి కూడా అమెరికా మహిళకు దక్కలేదంటే ఆశ్చర్యం వేస్తుంది. అంతరిక్షంలోకి అతివలను పంపించవచ్చు కానీ.. ఆ స్పేస్ అత్యున్నత స్థానానికి ఓ మహిళ ఈనాటికీ చేరుకోలేదు. మొదటి మహిళా కమాండ్‌గా ఇంటర్నేషన్ స్పేస్ స్టేషన్‌కు 2007లోఇన్‌స్టన్ ఎం పికయ్యారు. ప్రస్తుతం దావానూమాన్ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేస్తున్నారు.

పెంటగాన్‌లో పడతికి స్ధానం లేదా?
యూఎస్ సైనిక స్థావరంగా నిలిచే పెంటగాన్ రక్షణ స్థావరంలో అత్యున్నత స్థానంలోకి అమెరికా మహిళ వెళ్లకపోవటం శోచనీయం. చాలామంది మహిళలు నాలు గు నక్షత్రాల యూనిఫామ్ ధరించే జనరల్ స్థానాలకే పరిమితమయ్యారు. మికేల్ ఫ్లూర్నో సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ స్థానానికి 2009-2012వరకు పనిచేయగలిగారు. ఇదీ కూడా జూనియర్ స్థాయి పదవి మాత్రమే. ఇప్పటి వరకు కూడా యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ డిఫెన్స్‌కు ఉన్నత స్థాయి స్థానంలో మహిళ నియమింపబడకపోవటం పెద్దన్న దేశంలో పడతి పట్ల చూపించే వివక్షతకు నిదర్శనంగా చెప్పవచ్చు.
సెంట్రల్ ఇంటలిజెన్స్‌లోనూ స్ర్తికి స్థానం లేదు
అమెరికా సెంట్రల్ ఇంటలిజెన్స్ (సిఐఎ)లో పురుషులే అత్యున్నత స్థానాల్లో ఉన్నారు. మహిళలు మాత్రం వారికి అనుచరులుగానే నిలిచారు. ఈనాటికీ డైరెక్టర్ పోస్టుకు మహిళ ఎంపిక కాలేదు. 2013లో మాత్రం డిప్యూటీ డైరెక్టర్ స్థానానికి అవిర్రిల్ హైనీస్‌ను నియమించారు.
ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్‌లోనూ..
ఎఫ్‌బిఐలోనూ ఇదే స్టోరీ రిపీట్ అవుతోంది. 108 ఏళ్ల ఎఫ్‌బిఐ చరిత్రలో మహిళా డైరెక్టర్‌ను నియమించకపోవటం గమనార్హం. ఇక్కడ కూడా డిప్యూటీ స్థానాలకే మహిళలు పరిమితమయ్యారు.
బ్యాంకింగ్ రంగంలోనూ మొండిచేయి..
అమెరికా బ్యాంకింగ్ చరిత్రలో అతిపెద్ద బ్యాంక్‌లుగా నిలిచే నాలుగింట్లోనూ సిఇఓ స్థాయికి ఇంతవరకు ఒక్క మహిళ కూడా వెళ్లలేదు. బోర్డు మెంబర్లకే మహిళలను పరిమితం చేశారు. 2011లో మాత్రం యూఎస్ బ్యాంక్‌కు బెత్ మ్యూనీ నియమించబడ్డారు.
అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ నిర్లక్ష్య ధోరణే..
అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు ఇంతవరకు చీఫ్ జస్టిస్‌గా ఒక్క మహిళ కూడా నియమించబడలేదు. సుప్రీం కోర్టులో మూడు జస్టిస్ పదవులకే మహిళలు పరిమితమయ్యారు.

నమ్మలేని నిజాలు..
-47శాతం మంది మహిళలే లా డిగ్రీలు పొందగలిగారు.
-112 న్యాయమూర్తుల స్థానాల్లో 108 మంది పురుషులే ఉన్నారు. అంటే 96.4 శాతం వీరిదే ఆధిపత్యం
- 1981 వరకు కూడా సుప్రీం కోర్టు జస్టిస్ స్థానాలు పురుషులకే దక్కాయి. ఒక్క మహిళకు చోటు దక్కలేదు. నలుగురు మహిళలు మాత్రమే ఈ స్థానం దక్కించుకొని సేవ చేయగలిగారు.
- వందేళ్ల బ్యాంకింగ్ రంగ చరిత్రలో జానెట్ ఎల్లెన్ 2014లో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంస్థకు చైర్‌పర్సన్‌గా ఎంపికయ్యారు.
-జనరల్ మోటార్స్ సంస్థకు చైర్మన్‌గా మెరీ బెర్రా నియమించబడ్డారు. అమెరికాలో చిన్నా చితకా 500 కంపెనీలు ఉంటే మహిళా సీఇఓలు మాత్రం నాలుగు శాతం మాత్రమే ఉన్నారు.

మ్యాడలెన్ ఆల్బ్రైట్ అడుగుజాడల్లో హిల్లరీ..
అమెరికా తొలి మహిళా సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా చరిత్రలో నిలిచిపోయిన మ్యాడలిన్ ఆల్బ్రైట్ అడుగు జాడల్లో హిల్లరీ క్లింటన్ నడవటానికి సదా ప్రయత్నిస్తున్నారు. మ్యాడలిన్ యూఎస్ ప్రభుత్వంలో అత్యున్నత ర్యాంకింగ్ పొందిన అధికారిణిగా తన స్థానాన్ని సుస్థిర పరచుకున్నారు. అలాగే కండోలిజారైస్ కూడా తనదైన ప్రతిభాపాటవాలు కనబరిచారు. వీరికిలాగే హిల్లరీ క్లింటన్ ఈ మైలురాయిని దాటుకుని ముందుకు సాగుతూ అత్యున్నత అధ్యక్ష స్థానాన్ని అధిరోహించగలదో లేదో రాబోయే కొన్ని రోజుల్లో వెల్లడవుతుంది. తాను గనుక గెలిస్తే మహిళల కోసం పనిచేస్తానని, వారికి అత్యున్నత పదవులు ఇస్తానని భరోసా ఇచ్చిన ఈ ఆరుపదులు దాటిన మహిళ అంతా వివక్షత నిండిన అమెరికాలో తొలి ఆశాకిరణమైంది.

- లత