మెయిన్ ఫీచర్

ఆసక్తి ఉంటే విజయం మీదే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల భవిష్యత్ గురించి బంగారు కలలు కనని తల్లిదండ్రులుండరు. వారిని డాక్టర్లుగానో, ఇంజనీర్లుగానో లేదా ఉన్నత స్థాయిలో చూసుకోవాలనే ఆశలుండడం సహజం. కాని వాటిని సాఫల్యం చేసుకొనేందుకు తగిన ప్రయత్నాలు చేయరు.
పిల్లల మనసెరిగి వారి ఆశలు, ఆశయాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా మసలుకోవడం, పిల్లల ఉజ్వల భవితను కోరే తల్లిదండ్రుల కర్తవ్యం. ఎందుకంటే కాలేజీలో, వివిధ కోర్సుల్లో చేరాక కష్టపడి చదవాల్సింది మీ పిల్లలు గాని మీరు కాదు గదా! మీకేమో మీ అబ్బాయిని ఇంజనీరుని చేయాలనుంటుంది. మరి మీ అబ్బాయికేమో లెక్కలంటే భయం. మరి ఇలాంటి స్థితిలో మీ వత్తిడికి భయపడి మీ మాటను కాదనలేక ఇంజనీరింగ్ కోర్సైన ఎంపిసిలో చేరినప్పటికీ మీ పిల్లవాడు ఉత్సాహంగా చదవగలడా? అనుకున్న గమ్యానికి చేరుకోగలడా? అనేది ఆలోచించాలి. అలాగాక మీ అబ్బాయి మనసులోని మాటను అడిగి తెలుసుకొని, అతనికి ఇష్టమైన కోర్సులో చేర్పించినట్లయితే ఆ కోర్సు ఎంత కష్టమైనదైనా, తన ఇష్టపూర్వకంగా చేరాడు కాబట్టి మనస్సు పెట్టి చదువుతాడు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు కష్టపడతాడు.
పిల్లల కర్తవ్యాలు
మీకు ఆసక్తి వున్న సబ్జెక్టులు ఏమిటి? ఆ సబ్జెక్ట్సు ద్వారా అందివచ్చే కెరీర్ ఏమిటి? మీకు సబ్జెక్టులపై ఆసక్తి మాత్రమేనా? వాటిని పూర్తిచేయగల శ్రద్ధ కూడా వుందా? మీ కెరీర్‌ను ఎలా ఎంచుకోవాలనుకున్నారు? భవిష్యత్తులో ఏమి కాదల్చుకున్నారు? వంటి ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం చెప్పుకుంటే టెన్త్ తర్వాత ఇంటర్‌లో గ్రూపు సబ్జెక్టుల ఎంపికలో మీకు విజయం సాధించినట్లే. మీ ఫ్రెండ్స్ ఏ గ్రూపు తీసుకుంటే మీరూ ఆ గ్రూపు సబ్జెక్టులు తీసుకోకుండా మీ శక్తి సామర్థ్యాలను గుర్తెరిగి, మీకిష్టమైన గ్రూపును ఎంపిక చేసుకోవాలి.
అభిరుచి, ఆసక్తి, ఆకర్షణ, ఇష్టం.. ఇవన్నీ ఒకటి కావు. మీకు సబ్జెక్టుపై వున్నది ఏ తరహా అభిరుచో ముందే తెలుసుకోవాలి. మీకు లెక్కల్లో పెద్దగా అభినివేశం లేదు. కానీ దానికున్న అవకాశాల దృష్ట్యా, కష్టానికోర్చి, ఆ సబ్జెక్టును ఎంచుకున్నారు. కొన్నాళ్లకు మీవల్ల కాక చేతులెత్తేశారనుకోండి. ఆ తర్వాత ఎంత అనర్థం జరుగుతుందో వేరే చెప్పాలా? భవిష్యత్తును అన్ని విషయాలను బేరీజు వేసుకుని ఒక సబ్జెక్టును ఎంచుకున్నాక ఇక తాడో పేడో దానితోనే తేల్చుకోవాలన్నంత పట్టుదలతో చదవాలి.
తల్లిదండ్రులు ఏకాభిప్రాయంతో వారి అభిరుచుల్ని పిల్లలపై బలవంతంగా రుద్దక, వారికి అనుగుణంగా తగిన కోర్సులను, ఆ కోర్సులకు తగిన కాలేజీలను ఎంపిక చేసి పిల్లల ఉజ్వల భవితకు బంగారుబాట వేయగలరని ఆశిద్దాం. పిల్లల అభిరుచికి అనుగుణంగా కోర్సుల ఎంపిక చేసి, పిల్లలు కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి, తను ఎంచుకున్న రంగంలో ఉన్నతంగా ఎదిగేందుకు తల్లిదండ్రులు సహకరించగలరని ఆశిద్దాం.

- ఆళ్ళ నాగేశ్వరరావు